తెలంగాణలో…లాక్‌డౌన్‌’ఉం‌డదు

  • మరోమారు లాక్‌డౌన్‌ ‌పెట్టే యోచన లేదు
  • విద్యార్థులు కరోనా బారిన పడుతుంటే చూడలేకపోయాం
  • విధిలేకే స్కూళ్లను తాత్కాలికంగా మూసాం
  • థియేటర్లు యధావిధిగా నిబంధన మేరకు నడుస్తాయి
  • కరోనా టెస్టుల సంఖ్యను పెంచాం
  • మాస్కులు ధరించి…భౌతిక దూరం పాటించండి
  • ప్రాణం పోయినా నీటి వాటాను వదులుకోం
  • రాయలసీమ ప్రాజెక్టులపై అన్ని విధాలుగా పోరాడుతున్నాం
  • ఢిల్లీలో కూర్చుని అయినా అడ్డుకుంటాం
  • నిరుద్యోగులకు సీఎం తీపి కబురు
  • భృతి ఇచ్చి తీరుతామని ప్రకటన
  • ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచుతాం
  • పంచాయితీ సెక్రటరీలకు రెగ్యులర్‌గా జీతాలు
  • అసెంబ్లీలో వెల్లడించిన సీఎం కేసీఆర్‌
  • ‌నిరవధికంగా వాయిదాపడ్డ అసెంబ్లీ
  • ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదంతో ముగిసిన బడ్జెట్‌ ‌సమావేశాలు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్‌ ‌విధించే ఆలోచన లేదని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌పై వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు. కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌పై వస్తున్న వార్తలపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టత ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందవద్దని…తెలంగాణలో లాక్‌డౌన్‌ ‌పెట్టమని తేల్చిచెప్పారు. విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంతో బాధతోనే స్కూళ్లను మూసేశామని తెలిపారు. స్కూళ్ల మూసివేత తాత్కాలికం మాత్రమే అని చెప్పారు. తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని…ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినమియ బిల్లుపై మాట్లాడుతూ ఈ విష యం చెప్పారు.లాక్‌డౌన్‌ అనేది పెట్టం. పరిశ్రమల మూసివేత ఉండదు. ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. కరోనా నియ ంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తే కరోనాను నియంత్రిం చొచ్చు. బాధతోనే స్కూళ్లను మూసివేశాం అని సీఎం స్పష్టం చేశారు. విద్యాసంస్థలను తాత్కాలికంగానే మూసివేశామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. కరోనా విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం భేష్‌గా ఉంది. మళ్లీ కరోనా వేవ్‌ ‌ప్రచారంతో టెస్టుల సంఖ్యను పెంచాం. నిన్న ఒక్కరోజే 70 వేలు టెస్టులు చేశారు. ఇప్పటికే 10.85 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చాం. వ్యాక్సిన్‌ ఇచ్చే అంశం కేంద్రం పరిధిలో ఉంది. డోసుల తయారీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తోంది. వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అని సీఎం తెలిపారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించాం. సినిమా థియేటర్ల యాజమాన్యాలకు కొన్ని వెసులుబాట్లు కల్పించి, కేంద్రం నిబంధనలకు అనుగుణంగా థియేటర్ల ను ఓపెన్‌ ‌చేశాం. వారు వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. వారు కూడా ఈ విషయంలో ఆందోళనగా ఉన్నారు. కరోనా వల్ల మనం ఒక్కరం కాదు.. ప్రపంచం దేశం కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. కరోనా ఎవరికీ అంతుబట్టకుండా సంవత్సర కాలంగా ప్రపంచాన్ని వేధిస్తోంది. అన్ని దేశాల జీడీపీలు కుప్పకూలాయి. జీడీపీలో మనం మెరుగ్గా ఉన్నాం. అనేక రాష్ట్రాలు మైనస్‌లో ఉన్నాయని వివరించారు.ప్రాణం పోయినా సరే నీళ్ల విషయంలో రాజీపడే సమస్య ఉత్పన్నం కాదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాజెక్టుపై అన్ని రకాలుగా ఫైట్‌ ‌చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా రాయలసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవి అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్‌ ‌సమాధానం ఇచ్చారు. ఎపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ప్రాజెక్టుపై స్టేలు కూడా ఉన్నాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ‌కూడా స్టే ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తాము కూడా ఫిర్యాదు చేశాం. ఆ ప్రాజెక్టు పూర్తి అసంబద్ధమైనదని కేంద్రానికి చెప్పాం. అన్ని రకాలుగాఫైట్‌ ‌చేస్తాం.. దాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. రాజీపడే ప్రశ్న లేదన్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అవసరమైతే శాసనసభ సభ్యులందరూ ఢిల్లీలో కూర్చొనైనా.. పోరాడుతాం కానీ మన నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రశ్న ఉత్పన్నమే కాదని స్పష్టం చేశారు. ఆర్డీఎస్‌ ‌విషయంలో ఏపీ నాయకులు మొండిగా ముందుకు పోతున్నారు. పాత పద్ధతిలో వెళ్తామంటే ఇవాళ తెలంగాణ దిక్కులేని స్థితిలో లేదు. ఆర్డీఎస్‌లో కచ్చితంగా 15.9 టీఎంసీల నీటిని తీసుకుంటాం. ఒక్క బొట్టు నీటిని కూడా వదలం అని సీఎం తేల్చిచెప్పారు. తెలంగాణ స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం.. ఆరాచకం జరగనివ్వం.. హక్కులను కాపాడుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతి కరోనాతో ఆగింది..అయినా వారికి ఇచ్చిన హాని నెరవేరుస్తా.. టీఎస్‌ఆర్టీసీ నష్టాల్లో నడు స్తోందని, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం.. వారికీ జీతాలు పెంచుతాం. పంచాయితీ సెక్రటరీలకు కూడా రెగ్యుల ర్‌గా జీతాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ. 3వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ముందు ముందు ఆర్టీసీని ఇంకా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా త్వరలో జీతాలు పెంచుతామని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. జీతాలు పెంచాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారని, సంబంధిత మంత్రితో మాట్లాడి జీతాలు పెంచుతామన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న సంకల్పం ఉంది. తప్పకుండా ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా నిరుద్యోగ భృతి పై సీఎం మాట్లాడారు.కరోనా కారణంగా నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయామని చెప్పారు. నిరుద్యోగులను గుర్తించే పక్రియపై చర్యలు తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలవుతున్న తీరును పరిశీలిస్తున్నాం. కరోనా కొలిక్కి వచ్చాక నిరుద్యోగ భృతి తప్పక ఇస్తామన్నా రు. విద్యారంగ నిధులు పెంచే ప్రయత్నం చేస్తామని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని జూనియర్‌ ‌పంచాయతీ సెక్రటరీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త వినిపించారు. సెక్రటరీల పట్ల మరోసారి సీఎం కేసీఆర్‌ ‌గొప్ప మనసు చాటుకున్నారు. అందరి ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ ఏప్రిల్‌ ‌నుంచే రెగ్యులర్‌ ‌జీతాలు ఇస్తామన్నారు.శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్బంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడారు. కడుపులు నింపినోళ్లం.. కడుపు కొట్టినోళ్లం కాదు.. పంచాయతీరాజ్‌ ‌చట్టాన్ని పటిష్టంగా చేయడం వల్లే గ్రామాలు బాగు చెందు తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు బతుకుతున్నాయి. అందరూ పంచాయతీ సెక్రటరీల మాదిరిగానే.. జూనియర్‌ ‌పంచాయతీ సెక్రటరీలకు ఈ ఏప్రిల్‌ ‌నుంచే రెగ్యులర్‌ ‌పీఎస్‌లకు ఇచ్చిన జీతాలు ఇస్తాం. కానీ ప్రొబేష నరీ పీరియడ్‌ను మరో ఏడాది పెంచుతాం.. కడుపు నిండా జీతం ఇస్తాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందా ల్సిన అవసరం లేదు. తమ ప్రభుత్వం భయపడకుండా పని చేస్తోందన్నారు. ప్లలె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.
మూడు ప్రార్థనాలయాల నిర్మాణం…
సచివాలయంలో మూడు ప్రార్థనా మందిరాలకు ఒకేసారి శంకుస్థాపన చేయడం ద్వారా పునరుద్దరణ చేస్తామని ప్రభు త్వం మరోమారు స్పష్టం చేసింది. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సెక్రటేరియట్‌లో కొత్త మసీదు నిర్మాణ ంపై ఎంఐఎం సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి సమాధానం ఇచ్చారు. సెక్రటేరియట్‌లో పాత మసీదు స్థానంలో కొత్త మసీదు కడుతామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ‌పలుమార్లు చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. గతంలో 433 గజాల్లో మసీదు ఉండే.. దాన్ని ప్రస్తుతం 1500 గజాల స్థలంలో నిర్మిస్తామన్నారు. టెంపుల్‌కు 1500 గజాలు, చర్చికి 500 గజాలు కేటాయించా మన్నారు. ఈ మూడింటింకి ఒకేసారి శంకుస్థాపన చేస్తామన్నారు. సెక్రటేరియట్‌ ‌బిల్డింగ్‌ ‌పూర్తికాకముందే.. వీటిని నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. మసీదు విషయంలో మరోసారి సమావేశమై ప్లాన్‌పై నిర్ణయం తీసుకుంటాం, రంజాన్‌ ‌కంటే ముందే నిర్మాణం చేపడుతాం అని మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.
పెండింగ్‌ ‌ప్రాజెక్టులను రన్నింగ్‌ ‌ప్రాజెక్టులుగా మార్చాం…
పాలమూరు జిల్లాను ఆకుపచ్చ, అన్నపూర్ణ జిల్లాగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్‌ ‌లక్ష్యమని మంత్రి హరీష్‌ ‌రావు ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాలు వదిలేసిన పెండింగ్‌ ‌ప్రాజెక్టులను రన్నింగ్‌ ‌ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కోయిల్‌సాగర్‌, ‌కల్వకుర్తి, బీమా, నె•-టటెంపాడులను పూర్తి చేసి సాగునీరు అందిస్తు న్నామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతలను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్‌ ‌రావు సమాధానం ఇచ్చారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ‌పాలమూరు ప్రాజెక్టులపై రివ్యూ చేశారని తెలిపారు. చిట్టచివరి ఆయకట్టుకు నీరు అందించేలా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులకు రీడిజైన్‌ ‌చేస్తున్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకుంటున్నామని తెలిపారు. గుడిపల్లి రిజర్వాయర్‌ ‌వద్ద లిప్ట్ ‌ద్వారా వచ్చే నీరు.. 3250 క్యూసెక్కులు కాగా.ఇందులో 1250 క్యూసెక్కుల నీటిని అచ్చంపేట కెనాల్‌కు తరలిస్తు న్నామని చెప్పారు. భవిష్యత్‌ ‌తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులను రీడిజైన్‌ ‌చేస్తున్నాం. కానీ కొందరు పనులను అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడిప్పుడే కోర్టు కేసులను పరిష్కరించాం. త్వరితగతిన పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ ‌నియోజకవర్గంలో 40,064 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 15,073, కొడంగల్‌లో 1, 17,135, నారాయణపేట 63,382, మక్తల్‌ 66,963, ‌కల్వకుర్తి 96,398, అచ్చంపేట 2,675, షాద్‌నగర్‌ ‌నియోజకవర్గంలో 79,996 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు.
దళిత రైతులకు పాడి పశువులను పంపిణీ…
ఎస్సీ కార్పొరేషన్‌ ‌ద్వారా ఒక పైలట్‌ ‌ప్రాజెక్టుగా 10 జిల్లాల్లో దళిత రైతులకు పాడి పశువులను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌తెలిపారు. 60 శాతం సబ్సిడీతో బర్రెలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 2018-19 సంవత్సరం నుంచి ఈ పథకం కింద పాడి పశువుల పంపిణీ ప్రారంభించబడిందన్నారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్‌ ‌ద్వారా దళిత రైతులకు పాడి పశువుల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. సూర్యాపేట, వరంగల్‌, ‌ములుగు, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, మహబూబాబాద్‌, ‌సిద్దిపేట, జోగులాంబ గద్వాల, పెద్దపల్లి జిల్లాల్లో మినీ డైరీ పథకాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 3,590 మంది రైతులు లబ్ది పొందారని తెలిపారు. ప్రత్యేకంగా ఎస్సీ వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మినీ డైరీ ప్రాజెక్టు చేపట్టామని పేర్కొన్నారు. ఒక్కో యూనిట్‌లో 4 బర్రెలు ఇవ్వడం జరుగుతుం దన్నారు. మూడు క్వింటాళ్ల దాణా ఇస్తున్నామని చెప్పారు. ఒక్కో బర్రెకు రూ. 4 వేలు కలెక్టర్‌ ‌ద్వారా అందిస్తున్నామని తెలిపారు. అర్హులను చాలా పారదర్శకంగా గుర్తించి బర్రెల పంపిణీ చేయడం జరుగుతుం దన్నారు. గ్రాణ ప్రాంతాల్లో రూ. లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు ఆదాయ పరిమితిని విధించామ న్నారు. కనీసం 20 గుంటల భూమి కూడా ఉండాలని నిబంధన విధించామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌తెలిపారు.
నీటి వనరులున్న చోటల్లా చేపల పెంపకం…
నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో చేపలు పెంచాలని తమ శాఖకు ఆదేశాలు ఇచ్చి బడ్జెట్‌లో నిధులు కేటాయించామని మంత్రి తలసాని శ్రీనివాసయ యాదవ్‌ ‌చెప్పారు.ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులతో పాటు చిన్న నీటి వనరుల్లో చేప పిల్లలను ఉచితంగా విడుదల చేసి మత్స్యకారులను ఆదుకుంటున్నామని తెలిపారు. రూ. 525 కోట్లతో మోపెడ్‌ ‌వాహనాలతో పాటు జాలర్లకు వసతులు కల్పించామన్నారు. చేపల విక్రయానికి మార్కెట్లు పెంచుతామని చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేప పిల్లల పంపిణీ, మత్స్యకారుల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌సమాధానం ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో మత్స్యకారు లను గుర్తించలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ‌మత్స్యకారులను గుర్తించారు. కులవృత్తుల ద ఆధారపడ్డ వారి అభివృద్ధికి సీఎం చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నీలి విప్లవం తీసుకొచ్చామన్నారు. మొబైల్‌ ఔట్‌లెట్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. వీటిని రేపు ప్రారంభిస్తున్నామని చెప్పారు. రాష్‌ర్టంలోని మత్స్యకారులను ఆదుకుంటూ.. గతానికి భిన్నంగా సంపదను పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో మత్స్యకారులు గౌరవంగా బతుకుతున్నారు అని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
15 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి…
రాష్ట్ర వ్యాప్తంగా 15 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి చేసామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. సోమశిల రిజర్వాయర్‌, ‌సింగోటం రిజర్వాయర్‌, అక్కమహాదేవి గుహాలు, ఈగలపెంట, మన్ననూరు, మ్లలెలతీర్థం, ఉమామహేశ్వరం, లక్నవరం, మేడారం, తాడ్వాయి, పాకాల, ఆలీసాగర్‌ ‌వద్ద ఎకో పార్కులను అభివృద్ధి చేశామన్నారు. మహబూబ్‌నగర్‌ ‌సపంలో 2,097 ఎకరాల్లో కేసీఆర్‌ ఎకో పార్కును అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎకో టూరిజంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గతంలో టూరిజం స్పాట్‌లను వ్యాపార కేంద్రాలుగా మార్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం.. టూరిజం ద్వారా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. టూరిజం పేరుతో ఉమ్మడి ఏపీలో విలువైన భూములు కబ్జా చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అచ్చంపేట, సోమశిలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటును అందుబాటులోకి తెచ్చామన్నారు. రిజర్వాయర్లు నిర్మించిన ప్రాంతాల్లో టూరిజాన్ని అభివృద్ధి చేసి పర్యాటకుల కోసం బోట్లు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఉమా మహేశ్వరం ఆలయం వద్ద పార్కుతో పాటు ట్రెక్కింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఫారెస్ట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి.. నల్లమలలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పాకాల చెరువు వద్ద ఇప్పటికే కొంత అభివృద్ధి చేశాం.. త్వరలోనే ఆ ప్రాంతాన్ని సందర్శించి మరింత అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కోయిల్‌సాగర్‌, ‌సరళాసాగర్‌, ‌మిడ్‌మానేరుతో పాటు మిగతా రిజర్వాయర్ల వద్ద ఎకో టూరిజం పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణను టూరిజం హబ్‌గా తయారు చేసే దిశలో ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌ ‌దేశానికే ఆదర్శం…
తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌ ‌దేశానికే ఆదర్శమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అభినందించారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌ ‌డిజైన్‌ ‌చేసిన బడ్జెట్‌ను ఫాలో అయినా తప్పు లేదన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని అనేక అంశాలను కేసీఆర్‌ ‌ప్రజలకు అందించారు. ప్రతిపక్షాలకు ధైర్యం- ప్రజలపై సోయి ఉంటే బడ్జెట్‌ను మెచ్చుకో వాలన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ ‌చర్చలో ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల మాటలు విని తెలంగాణ సమాజం అసహ్యించుకు ంటోందని పేర్కొన్నారు. 70 ఏళ్ల ఆనాటి ప్రభుత్వాల పాలనలో ప్రజలను దోచుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఏం ఇచ్చిందని ప్రశ్నించారు. పైగా రాష్ట్రం నుంచి 2లక్షల కోట్లకు పైగా పన్నులు వసూలు చేసిందని ముత్తిరెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలకు తెలంగాణ ప్రజలపై సోయి లేదన్నారు. నదులను మాత్రమే కాదు రాష్ట్ర పాలననే రీ-డిజైన్‌ ‌కేసీఆర్‌ ‌చేస్తున్నారని ముత్తిరెడ్డి తెలిపారు. గడిచిన ఆరేండ్లుగా రాష్ట్రం అభివృద్ధి దిశలో దూసుకుపోతోంది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినప్పటికీ.. సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో పడిలేచిన కెరటంలా ఆర్థికంగా పుంజుకుంటున్నాం అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద గౌడ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా నియంత్రణలో, ఆర్థిక పునర్జీవనంలో తెలంగాణ రాష్ట్రం భేష్‌ ‌సాక్షాత్తు భారత ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించడం హర్షించదగ్గ విషయమన్నారు. 2016-17లో దేశ వృద్ధి రేటు 8.03 శాతం, 2017-18లో 7 శాతం, 2018-19లో 6.1 శాతానికి, 2019-20లో 4.2 శాతానికి దిగజారింది. కరోనా ధాటికి సంపద వృద్ధి చెందలేదు. 2021లో మైనస్‌ 7.07 ‌శాతానికి పడిపోయింది. తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ. 4,56,280 కోట్లు ఉంటే.. అది 2019-20లో రూ. 8,81,873 కోట్లకు చేరింది. ఇది సీఎం కేసీఆర్‌ ఆలోచన విధానాలు, పథకాల వల్లే సాధ్యమైందన్నారు. వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి సీఎం కేసీఆర్‌ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు ఐటీని విస్తరిస్తున్నారు. మిషన్‌ ‌భగీరథ కింద ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. రెవెన్యూ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందించి భూలావాదేవీలు పారదర్శకంగా జరుపుతున్నారు. ధరణి పోర్టల్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోందన్నారు.
నిరవధికంగా వాయిదాపడ్డ అసెంబ్లీ…

తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం దానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 15న ప్రారంభమైన సమావేశాలు తొమ్మిది రోజుల పాటు కొనసాగాయి. 18న బ్జడెట్‌ను ప్రవేశపెట్టారు. 15న ప్రారంభమైన అసెంబ్లీ 47 గంటల 44 నిమిషాల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ‌పీఆర్సీపై ప్రకటన చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల తాత్కాలిక మూసివేతపై ప్రకటన చేశారు. 75 మంది సభ్యులు ప్రసంగించారు. శాసనసభలో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి.