ఉగ్రరూపంగా ‘ కరోనా’

  • ఒకే కుటుంబానికి చెందిన21మందికి కరోనా
  • తిరుమల కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థి ద్వారా వ్యాప్తి
  • నిజామాబాద్‌ ‌జిల్లాలో సెకండ్‌వేవ్‌ ‌కల్లోలం
  • మహారాష్ట్ర నుంచి రాకపోకలతో పెరుగుతున్న కేసులు
  • స్థానికంగానే ర్యాపిడ్‌ ‌టెస్టులకు అధికారుల ఏర్పాట్ల

కాకినాడ,జ్యోతిన్యూస్‌ :

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదు వుతున్నాడు. అతడు కాలేజీ నుంచి ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కుటుంబ సభ్యులను దవాఖానకు తరలించారు. ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్‌ ‌రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత నాలుగు రోజులుగా వారు ఎవరెవరిని కలిశారనే విషయంపై ఆరాతీస్తున్నారు. ••ష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 758 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,92,984కు చేరింది. ఇదులో 8,82,314 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 3469 మంది చికిత్స పొందుతుండగా, 7201 మంది మరణించారు.
నిజామాబాద్‌ ‌జిల్లాలో సెకండ్‌వేవ్‌ ‌కల్లోలం..
నిజామాబాద్‌ ‌జిల్లాలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగడంతో టెస్టుల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయిం చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఈ నెలాఖరులోపు ఆర్టీపీసీఆర్‌ ‌టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చిన అధికారులు.. కొత్తగా మైక్రో బయాలజిస్టుల నియామకం చేపడుతున్నా రు.ఈ నెలాఖరులోపు భర్తీచేసి ఇక్కడే టెస్టులు నిర్వహించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జనరల్‌ ఆసుపత్రులలో ట్రూ నాట్‌ ‌పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తుండగా.. అన్ని పీహెచ్‌సీ ల పరిధిలో ర్యాపిడ్‌ ‌కిట్‌ల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. పొరుగున గల మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ‌కొనసాగుతుం డడంతో జిల్లాలో కరోనా భయం మళ్లీ పెరుగుతోంది. అక్కడి నుంచి వచ్చిపోయేవారు ఎక్కువగా ఉండడంతో కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి సరిహద్దుల వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నా కేసులు మాత్రం తగ్గడంలేదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఇప్పటి వరకు ట్రూ నాట్‌ ‌పద్ధతిలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ ‌టెస్టులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ మధ్యనే మూడు రోజుల క్రితం ఆర్‌టీపీసీఆర్‌ ‌పద్ధతిలో టెస్టులను కూడా పరిశీలించారు. పరీక్షలు విజయవంతం కావడంతో ఈ నెలాఖరులోపు పూర్తిస్థాయిలో చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ టెస్టులు చేసేందుకు అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆర్‌టీపీసీఆర్‌ ‌ల్యాబ్‌ ‌కు ఇన్‌చార్జ్‌గా ఈ నెలాఖరులోపు మైక్రోబయాలజిస్ట్ ‌ను ని యమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఇక్క డే టెస్టులు నిర్వహించే విధంగా అన్ని పరికరాను ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని ల్యాబ్‌లో ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీల్లో చేస్తున్న ర్యాపిడ్‌ ‌టెస్టుల్లో పూర్తిస్థాయిలో ఫలితాలు రాకపోవడం వల్ల ఇక్కడే ఆర్‌టీపీసీఆర్‌ ‌చేసేందుకు నిర్ణ యించారు. ర్యాపిడ్‌ ‌కిట్‌ల శాతం 60 నుంచి 80శాతమే ఉండడం, కొన్నిసార్లు నెగిటివ్‌ ‌వచ్చినా ఆర్‌టీపీసీఆర్‌లో పాజి టివ్‌ ‌రావడం వల్ల ఇక్కడే చేయాలని ఈ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో గడిచిన నెల రోజులుగా సెకండ్‌ ‌వేవ్‌ ‌ప్రభావం కనిపిస్తోంది. కేసుల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతోంది. నిత్యం సుమారు 30 కేసులు వస్తున్నాయి. గతంలో జిల్లాలో ప్రతీరోజు వెయ్యి వరకు టెస్టులు నిర్వహించగా.. ప్రస్తుతం 2వేల నుంచి 3వేల వరకు నిర్వహిస్తున్నారు. పాటిజివ్‌ ‌వచ్చిన వారికి జాగ్రత్తలు చెప్పడంతో పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. కేసులు బాగా పెరుగుతున్నందున గతంలోలాగా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు కూడా టెస్టులు చేసేందుకు సిద్ధ మవుతున్నట్టు తెలుస్తోంది. ఒకే ప్రాంతంలో కేసులు ఎక్కువగా వస్తే అవసరమైతే క్వారంటైన్‌ ‌విధించే విధంగా ఏర్పా ట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సంవత్సరకాలంలో మొత్తం లక్షా 89వేల 813 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఇప్పటి వరకు 16,470 మందికి పాజిటివ్‌ ‌వచ్చింది. వీరిలో ఎక్కువ మంది హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందగా జనరల్‌ ఆసుపత్రిలో సుమారు 2వేల మంది వర కు చికిత్స అందించారు. బయట నుంచి వచ్చేవారు కూడా ఎక్కువగా ఉండడం, విద్యాసంస్థలు నడవడంవల్ల కేసులు బాగా పెరిగాయి. ప్రస్తుతం విద్యాసంస్థలు మూతబడినా ఇతర సంస్థలు తెరిచి ఉండడం వల్ల కేసుల సంఖ్య తగ్గడం లేదు. మాల్స్, ‌బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, మద్యం షాప్‌లు, వాణిజ్యసంస్థల వద్ద జనం గుంపులుగా ఉండడం, మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. విద్యాసంస్థ లు మూసివేసినా ప్రజలు మాత్రం బయటకు రావడం తగ్గించడం లేదు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.