‘బడికి వేళాయే…

  • నేటినుంచి 6,7,8 విద్యార్థులకు స్కూళ్లు
  • కరోనా నిబంధనలు పాటిస్తూ తెరిచేలా ఆదేశాలు
  • మార్చి 1 వరకు ప్రారంభించుకునే వెసలుబాటు
  • ఆదేశాలు ఇచ్చిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
ఇప్పటికే 9,10 తరగతులను ప్రారంభించిన ప్రభుత్వం రాష్ట్రంలో 6,7,8 తరగతులకు కూడా బడులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో నేటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే నేటి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవ చ్చని ఆమె మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలల ప్రారంభానికి ఈ మేరకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నేటి నుంచి మార్చి 1వ తేదీలోగా తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పాఠశాల నిర్వాహకులు కొవిడ్‌ ‌మార్గదర్శకాలు విధిగా పాటించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరుకావాలన్న నిబంధనేది లేదని, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిద ండ్రుల అనుమతి తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్న ట్లు వెల్లడించిన ఆమె కోవిడ్‌ ‌మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్‌ ‌కారణంగా గత ఏడాది మార్చి చివరి నుంచి విద్యాలయాలు మూత పడ్డాయి. సుదీర్ఘకాలం తర్వాత కాలేజీలు ప్రారంభమైనప్పటికీ పాఠశాలలు మాత్రం తెరుచుకోలేదు. ఇక తెలంగాణలో ఇప్పటికే 9, 10 వ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మిగతా తరగతులు చదువుకునే విద్యార్థులకు కూడా బడులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇందులో భాగంగా తాజా 6, 7, 8 తరగతులను ప్రారంభించేం దుకు ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే 9,10 తరగతులు ఎలాంటి ఆటంకాలు,ఆందోళనలు లేకుండా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి మిగతా క్లాస్‌లు కూడా ప్రారంభానికి అనుమ తుల ఇచ్చారు.