పరిశ్రమే ఊపిరి…
- విశాఖ ఉక్కుకు ఊపిరి పోసిన పల్లా
- ప్రైవేటీకరణ జరుగుతోంటే ఏం చేస్తున్నారు
- ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు
- విజయసాయి విశాఖను అమ్మేస్తారని ధ్వజం
విశాఖపట్టణం,జ్యోతిన్యూస్ :
విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా శ్రీనివాస్ ఊపిరి పోశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేస్తూ టీడీపీ చేస్తున్న ఉద్యమానికి చంద్రబాబు మద్దతు తెలిపారు. ఆ సందర్భంగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? జగన్ ఎక్కడున్నావ్.. పబ్‌జీ ఆడుకుంటున్నావా? అంటూ మండిపడ్డారు. విశాఖను దోచుకోవాలనుకుంటున్నారా? ఎందరో ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఆనాడు రైతులిచ్చిన భూమి విలువ ఇప్పుడు రూ.వేల కోట్లు. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ లేదు. పోర్ట్ బేస్‌లో ఎక్కడా స్టీల్ ఎ•-లాంట్ లేదు.. విశాఖలోనే ఉంది’ అని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 5 లక్షల మందికి ఉపాధి కల్పించింది. విశాఖలో ఎయిర్‌పోర్టు, మెట్రోకు శ్రీకారం చుట్టాం. విశాఖకు ఐటీ పరిశ్రమ, షాపింగ్‌మాల్ రాకుండా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రాజెక్టులూ ఇప్పుడు వెళ్తున్నాయి. రు పాలకులా? కషన్ ఏజెంట్లా? విశాఖ ఉక్కు సంకల్పాన్ని కొనేయాలనుకుంటున్నారా?’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ ఆత్మను అమ్మితే రు ఆమోదిస్తారా? విశాఖ స్టీల్ సిటీని స్టోలెన్ సిటీగా చేస్తే రు అంగీకరిస్తారా? విశాఖ ఉక్కపై సీఎం ఎందుకు మాట్లాడటం లేదు. నోరు పడిపోయిందా? విశాఖ ప్రజలు మంచివాళ్ళు అయినా పిరికివారు. విశాఖ ఉక్కు సంకల్పాన్ని అమ్మిస్తే.. ఊరుకోం. విశాఖపట్నం నాకు ప్రాణం.. అందర్నీ అడిగే అమరావతి ప్రకటించాను. విజయసాయిరెడ్డి అంతు చూస్తాం. ముఖ్యమంత్రి తేలు కుట్టిన దొంగ. రేపు దొంగ స్వామిని కలవటానికి సీఎం వస్తున్నారు. అందరూ నన్ను నువ్వు చేతగానివాడివి… తిట్టలేవు అని అంటారు. విశాఖ స్టీల్ సాధిస్తావా? లేక నా వల్ల కాదు అని రాజీనామా చేసి జైలుకు పోతావో పో’ అంటూ వ్యాఖ్యానించారు.