యువతకు దగా

  • నిజమైన తెలంగాణ వాదులు చిన్నారెడ్డి, రాములు నాయక్‌
  • ‌వారిని భారీ మెజార్టీతో ఎమ్మెల్సీలుగా గెలిపించాలి
  • టిఆర్‌ఎస్‌కు గుణపాఠం నేర్పాలని ఉత్తమ్‌ ‌పిలుపు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌రాజకీయలు బాగా కమర్షియల్‌ అయ్యాయని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం గాంధీభవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములు నాయక్‌కు బీ ఫారాలను ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా డియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి కేటీఆర్‌ ‌ప్రకటించారు.. మరి ఏందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. కాజీపేట రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యా రం ఉక్కు ఫ్యాక్టరీని.. తీసుకురావడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌విఫలమయ్యారన్నారు. చిన్నారెడ్డి వ్యవసాయ రంగంలో పీహెచ్‌డీ చేశారన్నారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తి చిన్నారెడ్డి అని తెలిపారు. రాములు నాయక్‌ ‌కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వ్యక్తి అని.. నిజమైన తెలంగాణ వాదులు వీళ్లని గ్వరంగా చెప్పవచ్చని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తే రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పారు. అయోధ్య రామ మందిరానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. భద్రాచలం రామాలయం భూములు ప్రైవేట్‌ ‌వ్యక్తులకు అప్పగించింది కేంద్రమేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములు నాయక్‌లను గెలిపించాలని ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి కోరారు. చిన్నారెడ్డి నిజాయితీ గల వ్యక్తని, వ్యవసాయ రంగంపై పీహెచ్‌డీ చేసిన వ్యక్తని అన్నారు. రాజకీయాలు మొత్తం కమర్షియలైన ఈ సమయంలో ఏ మాత్రం ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తని కొనియాడారు. రాములు నాయక్‌ ‌కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. చిన్నారెడ్డి, రాములు నాయక్‌లు నిజమైన తెలంగాణ వాదులని, ఇద్దర్నీ గెలిపించాలని ఉత్తమ్‌ ‌కోరారు. దుబ్బాక, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల ఫలితాల దెబ్బకు నిరుద్యోగ భృతి ప్రకటన చేసినా ఇవ్వలేదు. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా దెబ్బ కొడితే రావాల్సిన 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు. లక్షా 90 వేల ఉద్యోగాలు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఇవన్నీ రావాలంటే టీఆర్‌ఎస్‌ని చిత్తు చిత్తుగా ఓడించాలి. పీఆర్సీ కూడా నివేదిక ఇచ్చింది. ఉద్యోగాల ఖాళీలు భారీగా ఉన్నాయని చెప్పింది.