గిరిజనుల భూములు లాక్కుంటూ కేసులా?

  • మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌

‌హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌గిరిజనులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌మరోమారు హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో సంత్‌ ‌సేవాలాల్‌ ‌జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్‌ ‌స్పూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు. మూడెకరాల భూమి, 10శాతం రిజర్వేషన్‌ ‌హాని నిలబెట్టుకోలేని.. సీఎం కేసీఆర్‌.. ‌గిరిజనుల భూములు గుంజు కుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గుర్రంపోడు తండాలో గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. సేవా లాల్‌ ‌జయంతి కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో సేవాలాల్‌ ‌జయంతి సందర్భంగా గిరిజన మహిళలు నృత్యాలు చేశారు. సేవ లాల్‌ ‌జయంతి సందర్భంగా సేవాలాల్‌ ‌చిత్ర పటానికి బండి సంజయ్‌ ‌నివాళులు అర్పించారు. బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు హుసేన్‌ ‌నాయక్‌, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలైన నేపథ్యంలో ఆయా పార్టీలు పోటీరికి రంగం సిద్దం చేస్తున్నాయి. మార్చి 14న మహబూబ్‌నగర్‌- ‌రంగారెడ్డి-హైదరాబాద్‌, ‌వరంగల్‌- ‌ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించ నున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మహబూబ్‌నగర్‌ – ‌రంగారెడ్డి – హైదరాబాద్‌ ‌పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరును, వరంగల్‌ – ‌ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి గుజ్జుల ప్రేమేందర్‌ ‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు వీరిద్దరి పేర్లను బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. మహబూబ్‌నగర్‌-‌రంగారెడ్డి-హైదరాబాద్‌, ‌వరంగల్‌-‌ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌ ‌రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల పదవీకాలం మార్చి 29తో ముగియ నుంది. ఈ ఎన్నికలతోపాటే ఆంధప్రదేశ్‌లోని ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల టీచ ర్స్ ‌నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్‌ ‌తెలిపింది. వరంగల్‌ ‌స్థానానికి టిఆర్‌ ఎస్‌ ఇప్పటికే పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి పేరును ఖరారు చేసింది. హైదరాబాద్‌కు ఖరారు చేయాల్సి ఉంది. ఇదిలా వుంటే ఎమ్మె ల్సీ ఎన్నికలతో పాటు సాగర్‌ ఉప ఎన్నికపై బిజెపి దృష్టి సారించింది. త్వరలో నాగార్జునసాగర్‌లో బీజేపీ భారీ బహి రంగ సభ నిర్వహించనుంది. బీజేపీ జాతీయ నేతలు సభకు హాజరుకానున్నారు. ముఖ్యంగా లంబాడి ఓట్లపై కమ లనాథులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉప ఎన్నిక ముందు లంబాడి కీలక నేత బీజేపీలో చేరనున్నారు.సాగర్‌లో ఇప్ప టికే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌క్షేత్రస్థాయిలో పని మెదలు పెట్టింది. ప్రతి 50 ఓట్లకు బీజేపీ ఒక ప్రతినిధిని పెట్టింది. గుర్రంపోడు అరెస్ట్‌లను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. మరోసారి గుర్రంపోడు వెళ్లేందుకు బండి సంజయ్‌ ‌సిద్ధమవుతున్నారు.