‘‌గులాబీ’ దూకుడు

  • టిఆర్‌ఎస్‌ ‌వ్యూహాత్మక అడుగులు
  • హాలియా బాంబు వదిలిన గులాబీ బాస్‌
  • అం‌దుకుని ఎగదోస్తున్న టిఆర్‌ఎస్‌ ‌నేతలు
  • బిజెపి లక్ష్యంగా విమర్శలకు నేతల పదును
  • భారీగా సభ్యత్వ నమోదుపై దృష్టి
  • కాంగ్రెస్‌,‌బిజెపిల్లోకి వెళ్లకుండా నేతలకు బుజ్జగింపులు
  • మారుతున్న రాజకీయ పరిణామాలు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌హాలియా సభలో సిఎం కెసిఆర్‌ ‌కాంగ్రెస్‌, ‌బిజెపిలపై విమర్శలు వదలడంతో అందుకున్న టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు దూకు డుగా పోతున్నారు. సభ్యత్వ సమోదు కార్యక్రమాలతో పాటు ఇతర చోట్లా కోరస్‌ అం‌దుకున్నారు. మంత్రి కెటిఆర్‌ ఓ అడుఉగ ముందుకు వేసి ప్రధానిని కూడా వదలబోమని హెచ్చరించారు. మొత్తంగా మరోమారు టిఆర్‌ఎస్‌ ‌స్వరం మారింది. బిజెపి పట్ల మెతక వైఖరి పార్టీకి ముప్పు తెచ్చేదిగా ఉందని గుర్తించిన గులాబీ బాస్‌ ‌హాలియా సభతో అప్రమత్తం అయ్యారు. అధినేత మనసు ఎరిగిన నేతలు కూడా తమ విమర్శలకు పదును పెట్టడం మొదలు పెట్టా రు. 2019 పార్లమెంటు ఎన్నికలు మొదలుకొని ఇటీవల జరిగిన గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల వరకు వరుసగా అధికార పార్టీకి ఎదురైన పరాజయాల నేపథ్యంలో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని తేలికగా తీసుకోరాదని టీఆర్‌ఎస్‌ ‌నాయకత్వం ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇకపై బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచే పార్టీని సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన ట్లు తాజా పరిణామాలను బట్టి అర్థం అవుతోంది. ముఖ్యంగా బీజేపీపై సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ఎదురుదాడి చేసేందుకు ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఐటీ సెల్‌ను మరింత బలోపేతం చేసే ఆలోచనలో కెటిఆర్‌ ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు లోపాయికారిగా సర్దుబాటు చేసుకున్నాయని ప్రచారం సాగుతున్న పరిస్థి తుల్లో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పార్టీ నేతలకు స్పష్టతను ఇచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ముఖ్య మంత్రి మార్పు కూడా ఏ ఉండదని కేసీ ఆర్‌ ‌తేల్చి చెప్పారు. దీంతో పాటు జిల్లాలో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా టీఆర్‌ఎస్‌ ‌బలోపేతంపై దృష్టి సారించాలని ఆదేశించడంతో పార్టీ నాయకత్వం కూడా ఈదిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈనెల 12వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వేళ ఆయా జిల్లాల్లో మంత్రులు ప్రధానంగా బిజెపిని లక్ష్యంగా చేసుకుని విమర్వల బాణాలను వదిలారు. బండిసంజయ్‌ ‌నోరు అదుపులో పెట్టుకోవాలని గర్జించా రు. ఇదే క్రమంలో పదవుల పందేరంపైనా కార్యకర్తల్లో ఆశలు కల్పించారు. అందుకు సభ్యత్వ నమోదును చేపట్టి వారిని ఉద్యుక్తులను చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ‌ప్రధానంగా బీజేపీనే లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. జిల్లాల్లో బీజేపీకి ఇప్పటిదాకా సంస్థాగత నిర్మాణం పెద్దగా లేకపోయినప్పటికీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బిజెపి అనూహ్య విజయం సాధించింది. జిల్లాకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం రెండు నియోజకవర్గాల్లో కలుపుకొని కనీసం లక్షకు తగ్గకుండా కొత్త సభ్యులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెబు తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో జడ్పీటీసీలు, ఎంపీపీలకు, గ్రామ స్థాయిలో సర్పం చ్‌లు, ఎంపీటీసీలకు, ఇతర ప్రజాప్రతినిథులు, పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమ ం పూర్తి కాగానే నియోజక వర్గాల్లో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలకు ఎన్నికలు జరిపే అవకాశం ఉందంటున్నారు.ఇకపోతే పార్టీ విస్తరణలో భాగంగా బిజెపి నేతలు తరచూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పలువురు నాయకులను బీజేపీలో చేర్చుకునేందుకు మంతనాలు సాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ బీజేపీకి సానుకూల ఫలితాలు వెలువడడంతో ఒక్కసారిగా రాజకీయ పార్టీల్లో అలజడి మొదలైంది. ఈ ఫలితాలతో టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల మనోబలం దెబ్బతినగా వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి రాజకీయ సకరణలు, బీజేపీకి సానుకూలంగా మారే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. దీంతో అలర్ట్ అయిన టీఆర్‌ఎస్‌ ‌నాయకత్వం బిజెపి లక్ష్యంగా విమర్శలకు పదను పెట్టిందని అంటున్నారు.
టిఆర్‌ఎస్‌ ‌వ్యూహాత్మక అడుగులు…

తాజగా టిఆర్‌ఎస్‌ ‌చేపట్టిన సభ్యత్వ నమోదులో బీజేపీ వైపు మొగ్గే అవకాశం ఉన్న వారినే లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్‌ ‌వైపు ఆకర్షించేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తు న్నట్లు చెబుతున్నారు. ఇందుకు బూత్‌, ‌గ్రామ స్థాయి పార్టీ కార్యకర్తల ద్వారా పంచాయతీల వారీగా అలాంటి వారి జాబితాలను తయారు చేస్తున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్‌కు చెందిన అసంతృప్త వర్గాలను టీఆర్‌ఎస్‌ ‌వైపు ఆకర్షించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసంతృప్తవాదులను బీజేపీ వైపునకు వెళ్లకుండా టీఆర్‌ఎస్‌లోకి చేరేలా ఒప్పించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. గత కొద్దిరోజుల నుంచి బీజేపీ, కాంగ్రెస్‌లు తమ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేస్తూ అధికార టీఆర్‌ఎస్‌పార్టీని లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి కొనసాగిస్తున్న క్రమంలో ఆ రెండు పార్టీలకు దీటైన సమాధానం చెప్పేందుకోసం టీఆర్‌ఎస్‌, ‌పకడ్భందీ కార్యాచరణకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 50 వేల నుంచి లక్ష వరకు పార్టీ సభ్యత్వాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీని కోసం జిల్లాలపై పార్టీ పరంగానే కాకుండా, కేడర్‌తో నాయకులతో సన్నిహిత సంబంధాలు, చనువు ఉన్న నాయకులను సభ్యత్వ ఇన్‌చార్జీలుగా టీఆర్‌ఎస్‌ అధిష్టానం నియమించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి ఇన్‌చార్జీలకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ ఇన్‌చార్జీల దిశానిర్దేశరతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి చేపట్టబోతున్నారు. ప్రస్తుత క్లిష్టతరమైన రాజకీయ పరిస్థితుల్లో జిల్లా సభ్యత్వ నమోదు బాధ్యతలను స్థానికంగా పార్టీలో ఉన్న బలమైన నేతలకు అప్పజెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇదిలా ఉండగా గ్రామస్థాయి నుంచి సభ్యత్వలక్ష్యాన్ని సాధించేందుకు మండల, గ్రామ ఇన్‌చార్జీలను కూడా నియమించబోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ అసంతృప్తితో ఉన్న నాయకులను, కార్యకర్తలందరినీ లక్ష్యంగా చేసుకొని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. దీని కోసం గాను గ్రామస్థాయి నుంచి అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తల జాబితాను సిద్దం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగానే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేత ఈ అసంతృప్తి వాదులందరికీ సభ్యత్వంను కట్టబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఇప్పటికే అసం తృప్తి వాదులపై బీజేపీ సీరియస్‌గా దృష్టి కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో వారిని చేజారకుండా చూసుకోవాలని టీఆర్‌ఎస్‌ ‌నేతలు యోచిస్తున్నారంటున్నారు. ఇందులో భాగంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైన రెండు, మూడు రోజుల నుండే ఈ అసంతృప్తి వాదులందరికీ సభ్యత్వాన్ని పూర్తి చేయబోనున్నారంటున్నారు. గణనీయంగా సభ్యత్వాన్ని నమోదు చేసి బీజేపీ, కాంగ్రెస్‌లకు గట్టి షాక్‌నివ్వాలని టిఆర్‌ఎస్‌ ‌నేతలు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌ ‌నాయకులు బీజేపీలో చేరడమే కాకుండా మరికొంతమంది సీనియర్‌ ‌నేతలు, కార్యకర్తలు ఆ పార్టీవైపు చూస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అ‌ప్రమత్తమవుతోంది. తమ నేతలు, కేడర్‌ను బీజేపీ వైపు ఆకర్షితులు కాకుండా అడ్డుకునేందుకు సభ్యత్వ నమోదును అస్త్రంగా వాడుకోవాలని టీఆర్‌ఎస్‌ ‌భావిస్తోందంటున్నారు. వ్యూహత్మకంగా బీజేపీ వైపు చూస్తున్న నేతలు, కార్యకర్తలకు సభ్యత్వాన్ని కట్టబెట్టి మిగతా వారందరిలో మనోదైర్యం నింపాలని టీఆర్‌ఎస్‌ ‌నేతలు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. భారీ సంఖ్యలో సభ్యత్వాన్ని చేపట్టి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్‌లకు షాక్‌నివ్వాలన్న యోచనలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఉందంటున్నారు. అలాగే కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన చాలా మందిని తమ వైపుకు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్‌ ఇప్పటికే సన్నాహాలు చేస్తుందంటున్నారు. వీరందరికి మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో సభ్యత్వ నమోదును చేసి వారిని కట్టడి చేయాలని టీఆర్‌ఎస్‌ ‌యోచిస్తోందంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌యంసీ ఎన్నికల తరువాత దూకుడు దున్న బీజేపీని ఎలాగైనా కట్టడి చేయాలని టీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేతలు సీరియస్‌గా యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నందున దీనిని అస్త్రంగా మలుచుకునే ప్రయత్నాలను టీఆర్‌ఎస్‌ ‌మొదలుపెట్టిందంటున్నారు.