ఆకాశ వీధుల్లో….
- – కరోనా వేళ ఇస్రో అద్భుత ప్రతిభ
- – దిగ్విజయంగా ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ49 రాకెట్
- – నింగిలోకి దూసుకెళ్లిన పది ఉపగ్రహాలు
- – ప్రయోగం విజయవంతం అయ్యిందన్న ఇస్రో ఛైర్మన్
- – త్వరలోనే మరో నాలుగు ప్రయోగాలు ఉంటాయని వెల్లడి
శ్రీహరికోట,జ్యోతిన్యూస్ :
కరోనా మహమ్మారి నేపథ్యంలో.. అంతరిక్ష పరిశోధనలు నిర్వహించడం అసాధ్యం. కానీ ఆ అద్భుతాన్ని ఇస్రో తన ఖాతాలో వేసుకున్నది. అంతరిక్ష పరిశోధనల్లో వర్క్ ఫ్రమ్ ¬మ్ కుదరదు, కానీ అద్వితీయంగా, అసాధారణ రీతిలో ఇస్రో .. పీఎస్‌ఎల్వీ సీ49 రాకెట్‌ను దిగ్విజయంగా ప్రయోగించింది. శనివారం ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్వీ సీ49 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్లను ప్రయోగించారు. 575 కిలోవిూటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి శాటిలైట్లను ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన ఇక్షా-01తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను ప్రయోగించారు. శ్రీహరికోట పరీక్షా కేంద్రం నుంచి మధ్యాహ్నం 3.10 నిమిషాలకు పీఎస్ ఎల్వీ సీ49 రాకెట్ నింగికి ఎగిరింది. ఈ రాకెట్‌తో ఈఓఎస్-1 శాటిలైట్‌తో పాటు మరో 9 కస్టమర్ శాటిలైట్లు నింగిలోకి దూసుకువెళ్లాయి. పీఎస్ 1 పర్ఫార్మెన్స్ నార్మల్‌గా సాగింది. పీఎస్2 కూడా నార్మల్‌గా కొనసాగింది. పేలోడ్ ఫేరింగ్ కూడా అనుకున్నట్లే సపరేట్ అయ్యింది. పీఎస్‌ఎల్వీ బరువు 290 టన్నులు. అన్ని దశలు అనుకున్న రీతిలో పూర్తి అయ్యాయి. తొమ్మిది ఉపగ్రహాల్లో అమెరికా, లగ్జంబర్గ్, లుథివేనియా దేశాలకు చెందిన ఉన్నాయి. అమెరికాకు చెందిన లీమర్ ఉపగ్రహాలను.. మల్టీ మిషన్ రిమోట్ సెన్సింగ్ కోసం వినియోగించనున్నారు. లగ్జంబర్గ్‌కు చెందిన శాటిలైట్లను మారిటైమ్ అప్లికేషన్ల కోసం వాడనున్నారు. టెక్నాలజీ డెమానిస్టేష్రన్ కోసం లుథివేనియా ఉపగ్రహాలు వినియోగించనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఉదయం పీఎస్2 రెండవ దశలో ఆక్సిడైజర్ ఫిల్లింగ్ పక్రియను ప్రారంభించారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇక్షా-01తో.. వ్యవసాయం, అటవీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్లికేషన్లు పరిశీలించనున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కస్టమర్ శాటిలైట్లను ప్రయోగించారు. అయితే కరోనా నేపథ్యంలో శ్రీహరికోటలో కఠిన ఆంక్షలు అమలు చేశారు. విూడియాకు ఆహ్వానం లేదు. లాంచ్ వ్యూవింగ్ గ్యాలరీని మూసివేశారు. శ్రీహరికోటలోని షార్‌లో ఉన్న మొదటి ప్రయోగ వేదిక నుంచి ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-01తో పాటు అమెరికా, లక్సెంబర్గ్ దేశాలకు చెందిన ఉపగ్రహాలు నాలుగు చొప్పున, లిథువేనియా దేశానికి చెందిన ఒక ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా విలువైన కాలాన్ని నష్టపోయామన్నారు. శ్రీహరికోట షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌ను ప్రయోగించారు. అన్ని ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేవపెట్టిన తర్వాత షార్ కేంద్రంలో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఒకరినొకరు అభినం దించు కుంటూ.. ఉత్సాహంగా గడిపారు.. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఇస్రో చైర్మన్.. ఈ ప్రయోగం విజయవంతం అయినట్టు ప్రకటించారు. 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాం అని ఆనందాన్ని వ్యక్తం చేశారు… ఇక, కోవిడ్ కారణంగా విలువైన కాలాన్ని నష్టపోయామన్న ఇస్రో చైర్మన్… తక్కువ మంది సిబ్బందితో పీఎస్‌ఎల్వీ సీ-49 ప్రయోగం చేపట్టినట్టు వెల్లడించారు. మరో నాలుగు ప్రయోగాలు త్వరలోనే ఉంటాయని ప్రకటించారు. పీఎస్‌ఎల్వీ-సీ50, జీఎస్‌ఎల్వీ ఎఫ్ 10లను త్వరలోనే ప్రయోగిస్తామని వెల్లడించారు.