అమరవీరులను మరిచిన పాలకులు !

దేశం కోసం ఎందరో రక్త తర్పణం చేశారు. ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. కానీ వారంతా కనుమరుగయ్యేలా చరిత్ర ను వక్రీకరించారు. వారి చరిత్రను భవిష్యత్‌ తరాలు స్ఫూర్తిగా తీసుకునేలా చేయడంలో ఆనాటి పాలకులు విస్మరిం చారు. మరుగున పడ్డ మహావీరులెందరో ఉన్నారు. వారందరి చరిత్రను మనమంతా మననం చేసుకోవాలి. అందులో ఎలాంటి వక్రీకరణలకు తావు లేకుండా చరిత్రను లిఖించుకోవాలి. స్వాత్య్ర పోరాటంలో ఒక్కొక్కరిదీ ఒక్కోవిధానం. అందులో అగ్రగణ్యులు భగత్‌ సింగ్‌. ఆయన పోరాటం అనన్య సామాన్యం. ఆయన దేశభక్తి అకుంఠితం. ఆయనను ఉరితీయకుండా ఆపేశక్తి ఆనాడు గాంధీకి ఉన్నా ఎందుకనో ఆయన మౌనం వహించారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. తన అహింసా సిద్దాంతానికి భగత్‌సింగ్‌ విప్లవ విధానాలు నచ్చకపోఇ ఉండవచ్చు. అందుకే భగత్‌సింగ్‌ ఉరితీతను మహాత్ముడు అడ్డుకోలేక పోయారన్న విమర్శలు ఉన్నాయి. వందేమాతరం, అహింస, సత్యాగ్రహం వంటి వాటితో స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న మహాత్ముడి ఆలోచనలకు భిన్నంగా భగత్‌సింగ్‌ ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అం టూ బ్రిటిష్‌ వారిని ఎదిరించిన ధీశాలి. ఆయనపై దేశద్రోహం కేసుతో పాటు అనేక కేసులు పెట్టి బ్రిటిష్ట ప్రభుత్వం వేధించినా ఏనాడూ బెదరలేదు. కోర్టు విచారణకు హాజరైన ప్రతిసారి భగత్‌సింగ్‌ బృందం అదే నినాదమిస్తూ ప్రవేశిం చేది. ‘విప్లవం వర్ధిల్లాలి’ అన్న ఆ మాటలు బ్రిటిష్‌ న్యాయమూర్తికి మింగుడు పడలేదంటే ఎంతగా బ్రిటిష్‌ పాలకుల కు కంట్లో నలుసుగా తయారయ్యారో అర్థం చేసుకోవచ్చు. భగత్‌సింగ్‌ పేరు చెబితేనే బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరు గెత్తేవి. దేశ స్వాతంత్య్రం కోసం ముందుగా బ్రిటిష్‌వారి పాలన నుంచి విముక్తి కల్పించాలన్న ఆకాంక్ష బలంగా ఉండే ది. అలాగే స్వాతంత్య్రం కోసం అహింస అనే ఆయుధాన్ని నమ్మడం సరికాదని భగత్‌సింగ్‌ భావించేవారు. అలా అని వ్యక్తిగత హింసకే పట్టం కట్టాలని అనుకోలేదు. అతి చిన్న వయసులోనే అపారమైన అనుభవం సాధించాడు. భారత ప్రజల విమోచనకు విప్లవపంథానే మార్గమని భగత్‌సింగ్‌ నమ్మాడు. దానిని అమల్లో పెట్టడం కోసం తన పంథాలో పోరాటం చేసిన గొప్ప వీరుడుగా ఇవాళ చరిత్ర పుటల్లో నిలిచి ఉన్నారు. అందుకే విప్లవానికే అంకితమైన కార్యకర్తలు ఉండాలని ప్రతిపాదించాడు. ఇలా బగత్‌సింగ్‌ లాగా ధన, ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన ఎందరో కనుమరు గయ్యారు. వారందరి చరిత్రలను మనం రాసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలా ఊరుకో వీరుడు కనిపిస్తాడు. భగత్‌ సింగ్‌ పేరు చెప్పగానే ప్రధానంగా పార్లమెంటులో బాంబు ప్రయోగం, ధైర్యంగా ఉరికంబం ఎక్కడం గుర్తుకు వస్తాయి. నిజానికి నెత్తి విూద టోపీతో మన మనసులలో స్థిరపడిన భగత్‌సింగ్‌ ఇమేజికన్నా ఆయన ఉజ్వల జీవితం ఎన్నో రెట్లు విశిష్టమైంది. ఆయన సమరశీల జీవితం ఆ కాలానికి అనితర సాధ్యమైనవి. ప్రత్యేకించి యువతకు అవి మార్గ దర్శకాలు. పాతికేళ్లు రాకుండానే ఉరికంబం ఎక్కిన యువ కిశోరం గనక ఆయన యువతకు మార్గదర్శకు డయ్యా డన్నది గుర్తుంచుకోవాలి. నిజానికి యువతకు అలాంటి ఆవేశం కావాలి. అది దేశం కోసం కావలి. దేశంలో స్వార్థపూరి తమైన ధన రాజకీయాలు వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి మహానుభావుల చరిత్రలు మనకు పనికివస్తాయి. భిన్నమైన విశాల రాజకీయాలను లోతైన సిద్దాంత దృష్టిని ప్రదర్శిం చిన భగత్‌సింగ్‌ ఆదర్శప్రాయుడని గుర్తించాలి. ఆయన చేసిన సాహసాలు నిరంతర మననం కావాలి. ఆయ న స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భాగస్వా మి. ఆయన చైతన్యం ఆనాటి బ్రిటిష్‌ పాలకులకు వణుకు పుట్టించేం ది. విప్లవానికి ఆధారం ఆయుధాలు, దౌర్జన్య కర చర్యలు కావని, ప్రజా బలమేనని చాటి చెప్పాడు. నిజమైన విప్లవకారులు అంటే ఏమిటో తన ఆచరణలో చూపా డు. ప్రజల కోసం పని చేయడంలోనే అత్యధిక త్యాగం ఉన్నదని భగత్‌ సింగ్‌ ఎపస్పుడూ చెప్పేవారు. సుఖాల కోసమే జీవితం కాదు, లక్ష్య సాధనకు అంకితం కావాలని ఆయన అనేక చోట్ల సందేశమిచ్చారు. పుస్తక పఠం కూడా భగత్‌సింగ్‌ను రాటుదేలేలా చేసింది. తనను ఉరి తీస్తారని తెలిసిన తర్వాత కూడా పుస్తకాలు ఆపకుండా చదవేవాడు. ఈ విషయం లో భగత్‌సింగ్‌ మృత్యువును లెక్క చేయని ధీరత్వం ప్రదర్శిం చాడు. సోక్రటీస్‌ కూడా మరో అరగంటలో ఉరి తీస్తారనగా ఇంతటి ధీరత్వంలోనే ఉన్నారని చెబుతారు. చివరి వరకు ఏదో నేర్చుకోవాలన్న తపన సోక్రటీస్‌లో ఉండే ది. అలాగే భగత్‌సింగ్‌ కూడా తన ప్రాణాల ద్వారా అయినా స్వాతం త్య్రం సిద్దించాలని ఆకాంక్షించే వారు. అం దుకే ఆయన ఉరికపంబాన్ని ముద్దాడారు. భగత్‌సింగ్‌ జీవితంలో ఘటనలు పరిశీలిస్తే ఆయన వ్యక్తిత్వం ఎంత దృఢమైం దో అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితులలోనూ పోరాడాలే గాని ప్రాణాలు తీసుకోవడం తప్పన్న భావనలో ఉండే వాడు. జలియన్‌ వాలాబాగ్‌ ఘటన భగత్‌సింగ్‌ను బాగా కలచివేసింది. అందుకే అక్కడికి వెళ్లి పిడికెడు మట్టి జేబు లో వేసుకుని వచ్చిన భగత్‌సింగ్‌ స్వాతంత్య్ర ఆకాంక్ష ఎంతటి బలమైనదో గుర్తించుకోవాలి. ఇలా భగత్‌సింగ్‌తో అనేక మంది పోరాడారు. అనేకమంది ఆనాటి తెల్లవారి తూటాలకు బలయ్యారు. విప్లవ పథంలో అడుగిడినప్పుడే నా ప్రాణాలర్పించి దేశమంతటా ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ ..విప్లవం వర్థిల్లాలి అనే నినాదాన్ని వ్యాపింప చేయగలిగితే జీవితం ధన్యమైపోతుందనుకున్నాడు. జైలు గదిలో కూర్చున్నప్ప టికీ కోట్లాది మన ప్రజల కంఠం నుండి వెలువ డుతున్న ఆ నినాదాన్ని వినగలుగుతున్నాను. ఈ నా నినాదం స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఉద్దీపింపచేసే శక్తిగా ప్రజ్వరి ల్లి బ్రిటిష్‌ పాలకులను తరిమి కొడుతుందని ధైర్యంగా చెప్పిన ధీశాలి మన భగత్‌సింగ్‌. అలాంటి వీరుడిని కన్నందు కు ఈ దేశం ఎంతో గర్విస్తుంది. భగత్‌సింగ్‌ మాటలు, జీవితం కోట్ల మంది యువతకు నాటికీ నేటికీ ప్రేరణగా కొన సాగుతున్నాయి. దేశంలో అవినీతి,అక్రమాలు రాజ్యమేలు తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కో భగత్‌సింగ్‌ అవతారమె త్తాల్సిందే. మరుగున పడ్డ మన యువకిశోరాల చరిత్రను వెలికి తీయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. అది చేస్తే దేశం కోసం త్యాగం చేసుకున్న వారిని స్మరించుకునే అవకాశం పెరుగు తుంది.