శ్రీలంకతో విడదీయరాని బంధం

  • శ్రీలంక ప్రధానితో మోడీ కీలక చర్చలు
  • పలు అభివద్ధి ప్రాజెక్టులపై ఒప్పందాలు

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :భారత్‌-శ్రీలంక దేశాల మధ్య వీడదీయని బంధమని, కొన్ని వేల ఏళ్ల్లనాటిదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్సతో శనివారం ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరు దేశాల అభ్యున్నతికి కీలక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య బౌద్ధ సంస్కతిని ప్రోత్సహించుకునేందుకు శ్రీలంకకు భారత్‌ 15 మిలియన్‌ డాలర్లు అందించనుంది. బౌద్ధ మఠాల పునరుద్ధరణ, ఇరు దేశాల మధ్య బౌద్ధ సంస్కతి అభివద్ధి, బౌద్ధ మతాధికారుల మద్దతుకు శ్రీలంక ఆ డబ్బును వినియోగించనుంది. పొరుగుదేశం 1.1 బిలియన్‌ డాలర్ల అభ్యర్థనపై భారత్‌ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబం ధాలపై వర్చువల్‌ రీతిలో చర్చిద్దామన్న తన ప్రతిపాదనను అంగీకరించినందుకు శ్రీలంక ప్రధాని రాజపక్షేకు ఆయన కతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని అయినందుకు రాజపక్షే ను అభినందించారు. శ్రీలంకతో సంబంధాలకు తాము ఎప్పుడైనా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ సం దర్భంగా రెండు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానులు ఇద్దరూ చర్చించారు. కరోనా పరిస్థితుల్లో సైతం భారత్‌ తమ దేశానికి అందించిన సహకారానికి కతజ్ఞతలు అని శ్రీలంక ప్రధాని వెల్లడించారు. ఎంటీ న్యూ డైమండ్‌ నౌకలో చెలరేగిన మంటలు ఇరుదేశాల మధ్య గొప్ప సహకారానికి అవకాశం కల్పించా యని రాజపక్షే అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా రానున్న ఐదేళ్లలో చేపట్టబోయే పలు అభివద్ది ప్రాజెక్టులపై ఓ అంగీకారానికి వచ్చాయి. ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలను భారత్‌ ప్రతిపాదించింది. కొలంబోలో పలు భారతీ య ఉత్పత్తుల దిగుమతిపై తాత్కాలిక ఆంక్షలను సడలిస్తారని ఆశిస్తున్నట్లు మోడీ తెలిపారు. పొరుగు దేశంతో సత్స ంబంధాలకు భారత్‌ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని వెల్లడించారు. శ్రీలంక తమిళుల సమస్యను పరిశీలించాలని రాజపక్సను ప్రధాని మోడీ కోరారు.