జిఎస్టీ వాటా నిధులు ఇవ్వకుండా కేంద్రం కిరికిరి
- – బోర్ల కాడ విూటర్లు పెడతామంటే ఓట్లేస్తారా?
- – మీటర్లు వద్దనుకుంటే టిఆర్‌ఎస్‌కు ఓటేయండి
- – దుబ్బాక ప్రచారంలో మంత్రి హరీష్ రావు
సిద్దిపేట,జ్యోతిన్యూస్ :
తెలంగాణకు జిఎస్టీ కింద హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. హక్కుగా రావాల్సిన కోటా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మాయమాటలు చెబుతున్నదని హరీశ్ రావు కేంద్రంపై ధ్వజమెత్తారు. తెలంగాణ వాటాగా జీఎస్టీ, 14వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు. రాయపోల్ మండల కేంద్రంలోని మధు సూదన్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో మండలంలోని 266 మంది రైతులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజ శర్మతో కలిసి.. మంత్రి పట్టాదారు పాసు పుస్తకాలు, వర్షాలకు కూలిన ఇండ్లకు నష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. వారి సంక్షేమమే లక్ష్యం పని చేస్‌తోందని, ఆరేండ్లుగా రైతుల కోసమే పని చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం బాగు చేయకుండా రైతులపై బాంబులు వేస్తున్నదని పేర్కొన్నారు. బాయిల కాడ, బోర్ల కాడ విూటర్లు పెట్టి బిల్ కలెక్టర్ల తో.. బిల్లు వసూళ్లకు పెడతారట. విూటర్లు కావాలంటే.. బీజేపీకి ఓటు వేయండి. విూటర్లు వద్దం టే.. మన కేసీఆర్ సారూ.. టీఆర్‌ఎస్ కారు గుర్తుకే ఓటు వేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని పేర్కొన్నారు. కానీ సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా ఓట్ల కోసం వచ్చే వారెవ రో.. గుర్తించాలని కోరారు. రైతులు కొత్త పట్టాదారు పాసు పుస్తకాల కోసం గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందు లు పడేవారని, అయినా పాసు పుస్తకాలు పొందేవారు కారన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో రైతుల సమస్యలు తీరిపోతాయన్నారు. మండలంలోని 11,317 ఖాతాలకు 10,022 ఖాతాలు క్లియ రెన్స్ చేసినట్లు.. వాటిలో ఇప్పటికే 9,756 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసుకున్నామని తెలిపారు. మిగిలిన పట్టాదారు పాసు పుస్తకాలను త్వరితగతిన క్లియరెన్స్ చేసి రైతులకు అందివ్వాలని ఆర్డీవోను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఎప్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీవో విజయేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ చట్టంతో దశాబ్దాల భూసమస్యలకు పరిష్కారం
నూతన రెవెన్యూ చట్టంతో దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్నవారికి దేశంలోనే తొలిసారిగా పట్టాదార్ పాస్‌పుస్తకం జారీచేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని రాయపోల్ మండల కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా.. రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీని మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానిక కృషి చేస్తుందన్నారు. బీజేపీ రైతు వ్యతికరేక ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి యేటా పెట్టుబడి సాయం కింద 10వేల రూపాయలు సాయం చేస్తున్నదని గుర్తు చేశారు. ఈ విధంగా దేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా.. అంటూ మంత్రి ప్రశ్నించారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాన్ని అమలు చేస్తున్న విధానం నచ్చకనే.. ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీకి చెంది న అకాలీదళ్ మంత్రి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులకు పూర్తిరక్షణ కల్పిం చాలన్నదే కొత్త రెవెన్యూ చట్టం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. భూవివాదాలు, ఘర్షణలను నివారించి ప్రజల ఆస్తులకు పక్కా హక్కులు కల్పించేందుకే ఈ పాస్‌పుస్తకాలు జారీచేస్తున్నట్టు పేర్కొన్నారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన విప్లవాత్మక మార్పు అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో భూముల పరస్పర కొనుగోళ్ల మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయడానికి సిఎం కెసిఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
రైతు కష్టం తెలిసిన సిఎం కెసిఆర్
సీఎం కేసీఆర్ రైతు శ్రేయోభిలాషి, రైతు కష్టం తెలిసిన మనిషిగా రైతుల కోసం ఆలోచన చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో గురువారం మండలంలోని 546 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 70 ఏండ్లలో జరగని పనిని ఆరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో పూర్తి చేసుకున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు రైతుబంధు పథకం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల గుండెల్లో రెండు బాంబులు వేసిందని పేర్కొన్నారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ మక్కలు కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేశారని, ఎవరి ప్రయోజనం కోసం చేశారో సమాధానం చెప్పాలని బీజేపీ పార్టీని ప్రశ్నించారు. అలాగే బాయికాడ, బోర్లకాడ విూటర్లు పెట్టి కరెంట్ బిల్లులు వసూళ్లు చేయాలని రైతులకు అన్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని విమర్శించారు. వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసి కార్పొరేటీ కరణకు తెరలేపి నయా జవిూందారు వ్యవస్థను తెస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం యేటా 45 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 56 వేల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. బీడీ కార్మికులకు పెన్షన్స్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే అందజేస్తుందన్నారు.