విజ్ఞాన భారతం కావాలి

  • – జాతీయ విద్యావిధానంలో ఓ మైలరాయి
  • – 21వ శతాబ్దపు లక్ష్యాలను అందుకునేలా ఉంది
  • – నూతన ఎడ్యుషన్‌ పాలసీపై రాష్ట్రపతి రావ్‌నాథ్‌ కోవింద్‌

21వ శతాబ్దపు లక్ష్యాలను అందుకునే విధంగా కొత్త జాతీయ విద్యావిధానం రూపుదిద్దుకుందని, ఇది మొత్తం  విద్యావ్యవస్థను మార్చివేస్తుందని  రాష్ట్రపతి రావ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. జాతీయ విద్యా విధానంపై రాష్ట్రపతి రావ్‌నాథ్‌ కోవింద్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు.  ఎన్‌ఈపీ 2020.. ఉన్నత విద్య అంశంపై జరిగిన విజిటర్స్ కాన్ఫరెన్స్ సదస్సులో ఆయన వర్చువల్‌ సందేశం ఇచ్చారు. నాణ్యమైన విద్యను అందిస్తూ సమాన, ఉత్తేజపూరిత సమాజాన్ని స్థాపించేందుకు ఎన్‌ఈపీ పనిచేస్తుం దన్నారు. మార్క్ల, గ్రేడ్లు, పాత బోధనా విధానాలను నిరుత్సహపరిచేందుకు కొత్త ఎన్‌ఈపీ ఉపయోగ పడుతుందని రాష్ట్రపతి కోవింద్‌ తెలిపారు. ఎన్‌ఈపీతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతందన్నారు. ప్రాచీన కాలంలో విద్యా క్షేత్రంగా భారత్‌కు ప్రపంచ వ్యాప్తంగా పేరుందన్నారు. తక్షశిల, నలంద వర్సిటీలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదన్నారు. కానీ నేటి ఉన్నత విద్యా సంస్థలకు మాత్రం గ్లోబల్‌ ర్యాంకింగ్స్లో మంచి పొజిషన్‌ రావడం లేదన్నారు. ఎన్‌ఈపీ ద్వారా బోధనకు భారత్‌ మళ్లీ ంద్రంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  2035 లోగా ఉన్నత విద్యలో ఎన్‌రోల్మెంట్‌ను 50 శాతానికి పెంచాలని ఎన్‌ఈపీ టా÷-గ్గం÷ట్‌లో ఉందన్నారు. టెక్నాలజీతో ఈ లక్ష్యం సాధ్యమే అని ఆయన తెలిపారు.