ఉద్యోగ నియామకాల్లో విప్లవాత్మక మార్పులు
- ప్రజాస్వామ్యయుతంగా ఉద్యోగ నియామక ప్రక్రియ
- – జాతీయ నియామక సంస్థ ఏర్పాటుతో నిరుద్యోగులపై తొలగనున్న భారం
- – వెబినార్ లో టి.ఎస్.పి.ఎస్.సి ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
జాతీయ నియామక సంస్థ(ఎన్ ఆర్ ఏ) ఏర్పాటుతో ఉద్యోగ నియామక ప్రక్రియలో విప్లవాత్మక మార్పుల రానున్నాయమని తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. నిరుద్యోగులపై ఆర్థిక, ప్రయాణ భారాలను తగ్గించడమే కాకుండా మరింత ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా ఉద్యోగ నియామకాల చేయడానికి కొత్త సంస్థ ద్వారా అవకాశం ఏర్పడబోతోందని వివరించారు. నియామకాలలో పారదర్శకతతోపాటు అభ్యర్థులలో విశ్వసనీయత పెరగడానికి దోహదం చేస్తుందని చెప్పారు. గురువారం పత్రికా సమాచార కార్యాలయం(పీఐబీ), ప్రాంతీయ ఔట్రీచ్ బ్యూరో(ఆర్వోబీ) ఆధ్వర్యంలో.. జాతీయ నియామక సంస్థపై నిర్వహించిన వెబినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పీఐబీ సంచాలకుల సతిపాటిల్ అధ్యక్షత వహించగా పీఐబీ దక్షిణాధి ప్రాంత డైరెక్టర్ జనరల్ ఎస్.వెంకటేశ్వర్ ప్రారంభించారు. అనంతరం ప్రొఫెసర్ చక్రపాణి మాట్లాడుతూదేశవ్యాప్తంగా ప్రభుత్వరంగంలో 20కిపైగా ఉద్యోగ నియామక సంస్థల వివిధ నోటిఫిషన్లు ఇచ్చి పరీక్షల నిర్వహిస్తున్నాయని, అవన్నీ ఇప్పుడు ఒ గొడుగు కిందకు వస్తాయని తెలిపారు. దీని వలన నిరుద్యోగ అభ్యర్థుల ఒ అర్హత, ఒ రకమైన సిలబస్ తో నిర్వహించే వేరు వేరు ఉద్యోగ నియామక పరీక్షలకు వేరు వేరుగా దరఖాస్తుల చేసుకోవడం, ఫీజుల చెల్లించడం ఉండబోదన్నారు. అలానే పరీక్షల కోసం అనేకసార్లు సన్నద్ధం కావడం, శిక్షణ పొందడం, పరీక్షలకు హాజరవడానికి ప్రయాణ ఖర్చుల తదితర కారణాలతో ఆర్థిక భారం పడుతోందనీ, సమయం వధా అవుతోందని, దీని కారణంగా అవకాశాల కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక అంచనా ప్రకారం నిరుద్యోగ అభ్యర్థులపై ఏడాదికి దాదాపు రూ.600 కోట్ల ఆర్థిక భారం తప్పుతుందని ఆయన తెలిపారు. జాతీయ నియామక సంస్థ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా క్లరికల్, నాన్ టెక్నికల్, నాన్ గెజిటెడ్ స్థాయిలలో ఉద్యోగ నియామకాల కోసం ఒ అర్హత పరీక్ష అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ పరీక్షలో ఒకసారి అర్హత సాధిస్తే మూడేళ్ల వరకు చెల్లబాటవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల నియామకాలకు ఇది ఒక అర్హతగా ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో ఈ అర్హత వివరాలను ప్రైవేటు సంస్థల డా నియామకాలకు ఉపయోగించుకొనే అవకాశం ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలను తొలిసారి ప్రాంతీయ భాషల్లో నిర్వహించడం, ప్రతిజిల్లాలలోనూ పరీక్ష ంద్రం ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల అభ్యర్థులకు అవకాశం కలిగిందన్నారు. దీని ద్వారా ఉద్యోగ నియామక విధానంలో ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి అవకాశం ఇచ్చినట్లయ్యిందన్నారు. స్థానికంగా పరీక్ష ంద్రం ఏర్పాటుతో మహిళలకు ఇబ్బందుల తొలగిపోతాయనీ, ఉద్యోగ నియామక పరీక్షలకు పూర్తి విశ్వాసంతో స్వేచ్ఛగా హాజరవుతారని అన్నారు. జాతీయ నియామక సంస్థ నిర్వహించే ఆన్లైన్ అర్హత పరీక్షతో నియామక ప్రక్రియ సులభతరం అవుతుందనీ, పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతుందని తెలిపారు. కంప్యూటర్ ఆధారిత దరఖాస్తుతోపాటు డాటా అంతా అందుబాటులో ఉండటం వలన సమయాభావం లేకుండా పరీక్షల నిర్వహించి త్వరగా ఫలితాల వెల్లడించవచ్చు అని చెప్పారు. మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించవచ్చన్నారు. దీని వలన అభ్యర్థులలో విశ్వసనీయత పెరుగుతుందన్నారు. అభ్యర్థులపై ఆర్థికభారం తగ్గడమే కాకుండా నియామక సంస్థలపై డా ఆర్థికభారం తగ్గుతుందన్నారు.