చైనా దుర్నీతి

  • – ఆక్రమణలకు పాల్పడుతోంది చైనానే..
  • – చైనా ఎత్తుగడులను గమనిస్తూ దీటుగా జవాబు
  • – రాజ్యసభలో ప్రకటన చేసిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
  • – ఆర్మీ వెంటే దేశం ఉంటుందన్న గట్టి సంతం       
  • – చైనాను నిలవరించడంలో కలసకట్టుగానే ఉంటాం
  • – దండయాత్రల చరిత్ర,సంస్కృతి భారత్‌కు లేదన్న వెంకయ్య
  • – చైనా సరిహద్దు సమస్యలపై రాజ్‌నాథ్‌ ప్రకటనకు సంఘీభావం

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :

చైనా చెప్పేదొకటి, చేసేదొకటని ంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. చైనా రెచ్చగొట్టే చర్యలకు దీటుగా జవాబిస్తామని అన్నారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. 1988 తర్వాత భారత్‌, చైనాల అనేక ఒప్పందాల చేసుకున్నాయని తెలిపారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనమని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఇది మంచి పద్దతి కాదని ఆయన చైనాకు హితవు పలికారు. 1962లో లద్దాఖ్‌లో చైనా 38వేల చదరపు కి.విూ మేర ఆక్రమించిందని స్పష్టంచేశారు. అదే సమయంలో పాకిస్థాన్‌ నుంచి 5వేల చ.కి.విూ భూమిని తీసుకొందని పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని వేల చ.కి.విూ భూభాగం తనదని చైనా వాదిస్తోందని అన్నారు. అయితే, ప్రస్తుతం లద్దాఖ్‌లో అనేక అభివృద్ధి పనుల జరుగుతున్నాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ రాజ్యసభకు తెలియజేశారు.అరుణాచల్‌ప్రదేశ్‌లోని వేల చదరపు కి.విూ. భూభాగం తమదని చైనా వాదిస్తోందని చెప్పారు. 1988 తర్వాత భారత్‌-చైనా అనేక ఒప్పందాల చేసుకున్నాయన్నారు. 1988 నుంచి 2003 వరకు రెండు దేశాల మధ్య సరిహద్దు ఒప్పందాల చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ ఒప్పందాలను చైనా ఉల్లంఘించడం సరికాదని రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఉండాలని భారత్‌ కోరుకుంటోందని, చైనా మాత్రం సరిహద్దుల్లో భారత్‌ను కవ్విస్తోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. చైనా బలగాల కవ్వింపులను భారత్‌ సైనికుల సమర్థవంతంగా అడ్డుకున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లద్దాఖ్‌ వెళ్లి భారత బలగాలకు భరోసా కల్పించారని చెప్పారు. చైనా బలగాల కదలికలపై నిఘా తీవ్రతరం చేశామన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

దండయాత్రల చరిత్ర,సంస్కృతి భారత్‌కు లేదన్న వెంకయ్య

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారత్‌ .. ఎన్నడూ మరో దేశంపై దండయాత్ర చేయలేదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తెలిపారు. దాడుల చేసిన చరిత్ర సంస్కృతి భారత్‌కు లేదన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేసిన తర్వాత వెంకయ్య మాట్లాడారు. భారతీయ పరంపర, సంస్కృతి వసుదైక కుటుంబం అని, సర్వే జనా సుఖినోభవంతో అని మన ఇతిహాసాల పేర్కొంటాయన్నారు. వేల సంవత్సరాల ఏళ్ల నుంచి మన దేశం .. ఏ దేశంపైనా దాడి చేయలేదన్నారు. అంతర్జాతీయ విూడియాలో భారత్‌పై వస్తున్న దుష్పచ్రా రాలను ఆయన కొట్టిపారేశారు. భారత్‌లో మత బేధాల ఉన్నట్లు వచ్చిన వార్తలను వెంకయ్య తప్పుపట్టారు.  ఓ అంతర్జాతీయ మ్యాగ్జిన్‌లో వచ్చిన కథనాన్ని ఆయన తన మాటల్లో ప్రస్తావించారు. చాలా అనర్థమైన విషయాలను ఆ కథనంలో రాసినట్లు వెంకయ్య తెలిపారు.  మన దేశం నుంచి, మన సభ నుంచి ఇలాంటి సందేశం వినిపించారదన్నారు. మన అందరం కలిసి కట్టుగా సైన్యం వెంట ఉన్నామని చైర్మన్‌ వెంకయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు సూచన చేశారు. ఎవరైనా సభ్యుల కానీ, అధికారుల కానీ ఈ అంశం గురించి చర్చించాలనుకుంటే.. వారితో వీలైతే ఏకాంతంగా డా మాట్లాడా లన్నారు. దేశ ఐక్యత, సమగ్రత అంశంలో అందరూ ఆసక్తిగా ఉంటారన్నారు. వాస్తవంగా ఎల్‌ఏసీ వద్ద ఉన్న పరిస్థితి ఏంటో తెలియాలని విపక్షాలకు ఉంటుందని, వారికి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని వెంకయ్య సూచించారు. విపక్ష సభ్యులను విశ్వాసంలోకి తీసుకుని వారికి ప్రభుత్వ విధానం తెలియచేయాలన్నారు. చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న విషయంలో రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాల ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై విపక్ష సభ్యుల డా తమ గళం వినిపించారు.  ఆర్మీ వెంటే దేశం ఉంటుందని కాంగ్రెస్‌ ఎంపీ ఆనంద్‌ శర్మ అన్నారు. ఈ విషయంలో అందరం కలిసి కట్టుగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకుంటే, అప్పుడు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. సైనిక దళాలకు అండగా ఉంటామని డా ఇతర రాజ్యసభ ఎంపీల తెలిపారు. ఐక్యత, సార్వభౌమత్వం విషయంలో దేశం ఒకటిగా ఉంటుందని రాజ్యసభ విపక్షనేత గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. సియాచిన్‌ సైనిక పోస్టులను గతంలో చాలా సార్లు తాను విజిట్‌ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. చైనా దళాల తమ స్వంత స్థానానికి వెళ్లిపోవాలని ఆయన కోరారు. ఈ అంశంలో రాజ్యసభ సభ్యులందరూ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వివిధ పార్టీ ఎంపీల సంఘీభావం ప్రకటించడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. నేను విూకు థ్యాంక్స్ చెప్పాలని భావించడం లేదు, ఎందుకంటే మనం అంతా ఒక్కటే అన్న సందేశాన్ని వినిపంచారన్నారు.  మాజీ రక్షణమంత్రి ఏ ఆంటోనీ చేసిన వ్యాఖ్యలకు రాజ్‌నాథ్‌ సమాధానం ఇస్తూ.. భారత దళాలను పెట్రోలింగ్‌ చేయకుండా చైనా అడ్డుకుంటుందన్నారు. అయితే తాము పెట్రోలింగ్‌ పద్ధతులను మార్చడం లేదని, మన భూభాగంలో పెట్రోలింగ్‌ నిర్వహించకుండా మన సైనికులను అడ్డుకునే శక్తి ఏదీ లేదన్నారు. కానీ చర్చల మాత్రం కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఎలక్టాన్రిక్‌ విూడియా వల్ల సరిహద్దుల్లో యుద్ధం లాంటి వాతావరణం నెలకొన్నదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రవి ప్రకాశ్‌ వర్మ ఆరోపించారు. దేశం యావత్‌ సైనిక దళాల వెంట ఉన్నదని, అయితే సార్వభౌమత్వం కాపాడుకుంటామని రక్షణ మంత్రి చెప్పడంలో అర్థం ఏముందని ఏ ఆంటోని ప్రశ్నించారు.