వానలే…వానలు…
- – అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాల
- – పొంగుతున్న వాగులతో జలకళ
- – ఏడుపాయల వద్ద జలజాతర
- – ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ,కాగ్నా నదుల
- – హైదరాబాద్‌లో మేఘావృతం..భారీ వర్షం
- – భారీ వర్షాలతో అన్నదాతలకు తీరని నష్టం
- – చేతికొచ్చిన వేరువనగ పంట సర్వనాశనం
- – సాగర్‌లోకి భారీగా చేరుతున్న వరద
- – 12 గేట్లు ఎత్తి కిందికి నీటిని వదిలిన అధికారుల
- – శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు
- – ఎగువన వర్షాలతో సింగూరుకు జలకళ
- – ఒక్కరోజులోనే 5 టిఎంసిల నీరు చేరిక
- – పెద్ద చెరువు తెగడంతో గ్రామంలోకి నీరు
హైదరాబాద్,
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాల్లో విస్తారంగా వానల దంచి కొడుతున్నాయి. విస్తారంగా కురున్నవర్షాలకు తెలంగాణ జలకళను సంతరించుకుంది. పల చోట్ల పంటల నీటమునిగాయి. మొదక్ జిల్లాలో జు తెల్లవారుజాము నుంచి వన దుర్గా ప్రాజెక్ట్ పొంగిపొర్లుతున్నది. ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారి ఆలయం ముందు నుంచి నీరు పరవళ్లు తొక్కుతూ నిజాంసాగర్ వైపు పరుగుల పెడుతున్నది. సింగూరులోకి డా వరదనీరు చేరుతోంది. వికారాబాద్ జిల్లాలో గత రెండు రోజులగా కురుస్తున్న వర్షాలకు మూసీ, కాగ్నా నదుల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోటిపల్లి ప్రాజెక్టు అలగు పారుతున్నది. భారీ వర్షాలకు ధారూర్ మండలంలోని దోర్నాల్, నాగసమందర్, మంచన్ పల్లి వద్ద తాత్కాలిక వంతెనల మరోసారి కొట్టుకుపోయాయి. సంగారెడ్డి జిల్లాలో వాగులో పడి ఇద్దరు మృతి చెందారు. గురువారం ఉదయం డా హైదరాబాద్‌లో పల ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బుధవారం రాత్రి వలం 2 గంటల్లోనే 11 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆకాశానికి చిల్ల పడిందేమో అన్నట్టు జడివాన కురిసింది.ఉరుముల, మెరుపులతో, గాలి తోడుగా వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలను నీళ్లతో నింపేసి, రహదారులను ముంచేసి నగరవాసులను బెంబేలెత్తించింది. వరద ధాటికి హకీంపేట్, టోలిచౌకీ తదితర ప్రాంతాల్లో వాహనాల కొట్టుకుపోయాయి. రాజధానిలో ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీళ్లు నిండాయి. వాన ప్రభావానికి కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోయింది. మరో ఐదు రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాల కురిసే అవకాశాలన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజల ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే గ్రేటర్‌లో నాలాల వద్ద రెస్క్యూ సిబ్బంది క్లీన్ చేసే పనిలో పడ్డారు. భారీ వర్షానికి పల చోట్ల రహదారులపై వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ చెరువలను తలపించాయి. గ్రేటర్‌లోని పాతబస్తీ బహదుర్‌పురా, చందూలాల్‌బరాదరిలో అత్యధికంగా 11సెంటీవిూటర్ల వర్షపాతం నమోదవ్వగా పటాన్‌చెరు, మహేశ్వరంలో అత్యల్పంగా 1 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారుల వెల్లడించారు. ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడనుండడంతో రాగల ఐదు రోజుల గ్రేటర్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాల కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ ంద్రం అధికారుల హెచ్చరికల జారీచేశారు.
వాగులో పడి ఇద్దరు యువకుల మృతి
సంగారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలకు పొంగి పొర్లిన వాగులో పడి ఇద్దరు యువకుల మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం గ్రామ పరిధిలో భారీ వర్షం కురిసింది. గ్రామానికి చెందిన రాజు (40), హద్నూర్ గ్రామానికి చెందిన రాజు (40) వాగులో పడి కొట్టుకుపోయారు. గురువారం ఉదయం గ్రామ శివారులోని ముళ్ల పొదల మధ్యలో మృత దేహాలను గుర్తించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసుల, రెవెన్యూ అధికారుల మృత దేహాలను జహీరాబాద్ దవాఖానకు తరలించారు.
వాగులో కొట్టుకుపోఇన మహిళ మృతి
అల్పపీడ ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా కురుస్తున్న వర్షాలకు వాగుల, వంకల పొంగిపొర్లుతున్నాయి. వరదలకు రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. వికారాబాద్ జిల్లా అంతటా విస్తారంగా వర్షాల కురుస్తున్నాయి. మర్పల్లి మండలంలో కురిసిన వర్షానికి షాపూర్ వాగులో కొట్టుకుపోయిన అనితా బాయి అనే మహిళ మృతి చెందింది. అధికారుల ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
కాలవలో చిక్కున్న రైతుల క్షేమం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, సిద్దాపూర్ దిండి కాలవలో చిక్కుకున్న ఇద్దరు రైతు దంపతులను ఎన్డీఆర్‌ఎఫ్ బృందం రక్షించింది. పొలంలో పనికోసం వెళ్లిన రైతు దంపతుల వాగు మధ్యలో చిక్కుకుపోయారు. ఒడ్డుకు చేరలేక ఇబ్బంది పడ్డారు. విషయం తెలసుకున్న అధికారుల వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయి శేఖర్, ఉన్నతాధికారుల చేరుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
సాగర్‌లోకి భారీగా చేరుతున్న వరద
నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,45,651 ్యసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారుల సాగర్ 12గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు నెలల్లో మూడోసారి నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌కు ఇన్‌ప్లో 2,45,651 ్కసెక్కులగా ఉంది. అవుట్‌ప్లో 2,17,984 ్యసెక్కులగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 310.2522 టీఎంసీలగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులకు చేరుకుంది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండడం, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి నీరు వచ్చి చేరుతోంది. అదనపు నీటిని క్రస్టుగేట్లు, జలవిద్యుత్ ంద్రం, కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ప్లో ఆధారంగా క్రస్టుగేట్లను పెంచుతూ తగ్గిస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ప్లో కొనసాగింది. మరోవైపు దుందుభి నదికి వరద పోటెత్తడంతో డిండి జలాశయం అలగుపోస్తున్నది. మూడు రోజులగా వరద రాకతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ప్రాజెక్టు ఎత్తు 36అడుగుల కాగా పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 2.45టీఎంసీల. నీటిమట్టం బుధవారం ఉదయం ఆరు గంటలకు 36.6చేరడంతో అలగు ప్రవహించింది. దుందుభి నది నుంచి సుమారు పది వేల ్యసెక్కుల ఇన్‌ప్లో వస్తున్నట్లు అధికారుల తెలిపారు. ఏడేండ్ల తర్వాత ప్రాజెక్టు అలగు పోస్తుండడంతో ఆయకట్టు రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఈ వానకాలం సీజన్‌లో డిండి ప్రాజెక్టు ఆయకట్టులో సుమారు పన్నెండు వేలకు పైగా ఎకరాల్లో వరి సేద్యానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టుకు నీటి విడుదల సమయంలో ప్రాజెక్టులో 26అడుగుల మేర నీరు నిల్వ ఉండగా.. క్రమంగా తగ్గి 20అడుగులకు చేరింది. ఆగస్టు 12నుంచి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు నీటి ప్రవాహం ప్రారంభమై ప్రస్తుతం 33.6అడుగులకు చేరింది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు
తెలంగాణతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాల దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వరద పోటెత్తింది. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల నిండు కుండలా మారాయి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఎ÷-లో 2,22,625 ్యసెక్కుల కాగా, ఔట్ ఎ÷-లో 3,14,730 ్యసెక్కులగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగుల కాగా, ప్రస్తుత నీటిమట్టం 885 అడుగుల. పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీల కాగా, ప్రస్తుతం నిల్వ 215.80 టీఎంసీల. శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు జల విద్యుత్ ంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఎగువన వర్షాలతో సింగూరుకు జలకళ
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు ఇన్ ప్లో పెరిగింది. ఇటీవలి వర్షాలతో సింగూరుకు చుక్కనీరు రాలేదు. తాజాగా కురిసన వర్షాలతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.99 టీఎంసీ ల కాగా ప్రస్తుతం 8.520 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్ట్ లోకి 45,282 ్యసెక్కుల ఇన్ ఎ÷-లో వచ్చింది. వర్షాకాలం ముందు వరకు వలం అర టీఎంసీ లెవల్ కి వాటర్ పడిపోయిన విషయం తెలిసిందే. కాగా, బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో దాదాపు 5 టీఎంసీల నీరు చేరింది. తాగునీటి సరఫరా ఇబ్బందుల ఏర్పడుతున్న సమయంలో ఇన్ ప్లో రావడం స్థానికంగా ఊరట నిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి అన్ని ప్రాజెక్టుల జలకల సంతరించుకోగా సింగూరుకు ఇప్పుడు ఇన్ ప్లో పెరుగుతున్నది. ఇన్ ప్లో కొనసాగుతున్న నేపథ్యంలో నీటిమట్టం మరింత పెరగనున్నదని జలవనరుల శాఖ అధికారుల తెలిపారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల ఉమ్మడి మెదక్ జిల్లాను ముంచెత్తగా.., వాగుల పారుతున్నాయి, చెరువుల, కుంటల మత్తడి దుంకుతున్నాయి. పల ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాల కురిశాయి. అలాగే, మంజీరా నదిలో నీటి ప్రవాహం పెరగడంతో పుల్కల్ మండలం శివ్వంపేట బ్రిడ్జి వద్ద నిర్మించిన చెక్‌డ్యాం మత్తడి దుంకింది. పాపన్నపేట మండల పరిధిలోని కందిపల్లి చెరువు అలగు పారుతుండడంతో రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగల్‌గిద్ద మండలంలో కురిసిన వర్షానికి ఎస్గీ-ఔదత్‌పూర్ గ్రామాల మధ్య వాగుపై నిర్మించిన వంతెన తెగిపోయింది. జహీరాబాద్ పట్టణంలో కురిసిన వర్షానికి ప్రధాన రహదారి వరద నీటితో మునిగిపోయింది. అలాగే, జిల్లా సరిహద్దు ప్రాంతం గుండా ప్రవహించే మంజీర నదిలో భారీగా వరద చేరుకున్నది. హుస్నాబాద్ డివిజన్ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు నీటి వనరుల నిండుకుండల్లా మారాయి. హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, ప్లలెచెరువుల జోరుగా మత్తడి పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలంలో అత్యధికంగా 108.5 మి.విూ వర్షపాతం నమోదయ్యింది. కాగా, రామాయంపేట పట్టణంలోని హనుమచెరువు సుమారు 20 ఏండ్ల తర్వాత అలగు పారుతుండడంతో స్థానికుల సంతోషం వ్యక్తం చేశారు.
పెద్ద చెరువు తెగడంతో గ్రామంలోకి నీరు
రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామంలో పెద్ద చెరువు తెగి.. నీరు ఇళ్లల్లోకి చేరింది. దీంతో ప్రజల భయభ్రాంతులకు గురవుతున్నారు. రేవెల్లి ఎస్‌ఐ, అధికారుల గ్రామస్తులను తరలించేందుకు యత్నిస్తుండగా… గ్రామస్తుల నిరాకరించారు. పీఆర్‌ఎల్‌ఐ నీళ్లు డా గ్రామం దగ్గరికి చేరుకోవడంతో దిక్కుతోచని స్థితిలో గ్రామస్తుల ఉన్నారు. పిఆర్‌ఎల్‌ఐలో బండ రాయిపాకుల గ్రామం ముంపునకు గురైంది.
భారీ వర్షాలతో అన్నదాతలకు తీరని నష్టం
అనంతపురం జిల్లాలో అతివృష్టి అన్నదాతల కొంప ముంచింది. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయింది. కొద్ది రోజులగా కురుస్తున్న వర్షాలకు అనంతపురంలో వేరుశనగ రైతుల తీవ్రంగా నష్టపోయారు. ఎడితెరిపి లేని వర్షాలతో పొలాల్లోనే పంటల కుళ్లిపోయే పరిస్థితి నెలకొంది. లక్షల పెట్టుబడుల పెట్టి సాగు చేసిన పంట వర్షాలకు నేలపాల కావడంతో అన్నదాతల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పంటల ఎండిపోయి కరువు ఛాయల కమ్ముకునే అనంతపురం జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాల రైతులను నిండా ముంచాయి. దీంతో వేరుశనగ, అరటి రైతుల తీవ్రంగా నష్టపోయారు. మడకశిర, పెనుకొండ, రాప్తాడు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్ల, తాడిపత్రి నియోజకవర్గాల్లో లక్షల ఎకరాల్లో పంటల నీట మునిగాయి. వరి, పత్తి పంటల డా నీట మునగడంతో రైతుల లక్షల్లో పెట్టుబడుల కోల్పోయారు. అకాల వర్షాలతో నిండా మునిగిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నేతల డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పంటల దెబ్బతిన్నాయని కోత సమయంలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు రైతులకు అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. వరినాట్లు వేసిన వారం రోజుల నుంచి నీటిలో మునగడంతో కుళ్లిపోయాయని పత్తి ఇతర పంటలకు జిల్లాల్లో పెద్దఎత్తున నష్టం వాటిళ్లిందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమకు న్యాయం చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.