విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్

  • కన్జ్యూమర్ మూవ్ డ్రాఫ్ట్ సిద్దం

మోడీ ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారులకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. కొత్త విద్యుత్‌ చట్టం తీసుకుని వచ్చే వేళ విమర్శల ఎదురవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బిల్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ దశలో ప్రజల్ల భరోసా కల్పించే ప్రయత్నాలకు పూనుకుంటున్నారు.  దీపావళి నాటి కల్లా గుడ్‌ న్యూస్‌ అందించబోతోందన్న వార్తను ప్రచారం చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్ల కోసం కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు ంద్ర విద్యుత్‌ శాఖ తెలిపింది. దీని కోసం ఇప్పటి డ్రాప్ట్ రూపొందించామని పేర్కొంది. ప్రోకన్సూమర్‌ మూవ్‌ డ్రాప్ట్ ఎలక్ట్రిసిటీ పేరుతో ఈ డ్రాప్ట్ను తీసుకువచ్చింది. కొత్త డ్రాప్ట్ ప్రకారం.. వినియోగదారుల కొత్త కనెక్షన్‌ కోసం ఎక్కువ రోజుల వేచి చూడాల్సిన పని లేదు. వలం రెండు డాక్యుమెంట్లతోనే 10 డబ్ల్యూ లోడ్‌ కనెక్షన్‌ పొందొచ్చు. ఇంకా 150 డబ్ల్యూ కనెక్షన్‌ వరకు ఎలాంటి డిమాండ్‌ చార్జీల చెల్లించాల్సిన పని లేదు. మెట్రో నగరాల్లో అయితే 7 రోజుల్లో కనెక్షన్‌ అందించాలి. మున్సిపల్‌ ఏరియాల్లో 15 రోజుల్లోగా, గ్రావిూణ ప్రాంతాల్లో అయితే 30 రోజుల్లోపు కొత్త కనెక్షన్‌ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా కరెంటు బిల్లను చెల్లించేందుకు క్యాష్‌, చెక్‌ బుక్‌, డెబిట్‌ కార్డు, డ్రిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ఇలా అన్ని పేమెంట్‌ ఆప్షన్స్ అందుబాటులో ఉండాలి. ఇక  బిల్ల రూ.1,000 దాటితే ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బిల్ల 60 రోజుల ఆలస్యంగా వస్తే అప్పుడు బిల్ల మొత్తంలో 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.