లబ్ధిదారులను గుర్తించండి

  • – డబుల్‌ ఇళ్లకు లబ్దిదారులను ఎంపిక చేయండి
  • – స్థానికుల ప్రాధాన్యం ఇచ్చేలా కలెక్టర్లతో చర్చించాలి
  • – ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో సమీక్షించిన మంత్రి టీఆర్‌
  • – లక్ష డబుల్‌ ఇళ్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం : తలసాని
  • – లక్ష ఇళ్లు చూపే వరకు నగరంలో తిరుగుతా : సిఎల్పీ నేత భట్టి

హైదరాబాద్‌,జ్యోతిన్యూస్‌ :

నగరంలో నిర్మిస్తున్న డబుల్‌ ఇళ్లకు లబ్దిదారుల ఎంపిక పక్రియ చేపట్టాలని అధికారులను మంత్రి టీఆర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో కలిసి ఎంపిక చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాల జారీ చేశారు. గతంలో అందిన వారికి మరోసారి ఇళ్లు రాకుండా చూడాలన్నారు. లబ్దిదారుల ఎంపిక పక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మిస్తున్న చోట పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను టీఆర్‌ ఆదేశించారు.  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిపై మంత్రుల టీఆర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, పురపాలక, గృహ నిర్మాణ శాఖ అధికారుల హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు త్వరలోనే పూర్తవుతా యని అధికారుల అన్నారు. డబుల్‌ బెడ్‌ రూవ్‌ ఇల్ల నిర్మాణం పూర్తి కావడానికి గడువు సవిూపిస్తున్న నేపథ్యంలో లబ్దిదారుల ఎంపికకు సంబంధించిన ఈ పక్రియ చేపట్టాలని మంత్రి టీఆర్‌ అధికారుకు ఆదేశాల జారీ చేశారు. హౌసింగ్‌ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషనర్‌ నగర పరిధిలో ఉన్న ఇతర జిల్లాల కలెక్టర్‌లతో కలిసి సంయుక్తంగా లబ్దిదారుల ఎంపిక చేయాలని సూచించారు. అయితే ఇప్పటి జీహెచ్‌ఎంసీలో లక్ష డబుల్‌ బెడ్‌ రూవ్‌ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని, త్వరలోనే ఇవన్నీ పూర్తవుతాయని అధికారుల మంత్రులకు తెలియజేశారు. దీనిపై స్పందించిన మంత్రుల లబ్దిదారుల ఎంపిక పైన ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ కోసం ఇతర జిల్లాల పరిధిలో కడుతున్న ఇళ్లలో పది శాతం లేదా 1000 మించకుండా స్థానికులకు ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు లబ్దిదారుల ఎంపిక పక్రియ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లబ్దిదారుల ఎంపికపైన కసరత్తు చేయాలని, గతంలో ఇల్ల అందిన వారికి మరోసారి డబుల్‌ బెడ్‌ రూవ్‌ ఇల్ల రాకుండా చూడాలని మంత్రుల సూచించారు.

లక్ష డబుల్‌ ఇళ్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం : తలసాని

లక్ష ఇళ్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. లక్ష ఇండ్లు చూపించే వరకు భట్టి విక్రమార్క వెంబడి తిరిగి చూపిస్తానని మంత్రి తేల్చిచెప్పారు. నగరంలోని జియగూడ, గోఢా ఖబీర్‌, ఇందిరాగాంధీ కాలనీ, బన్సీలాల్‌పేట, క్టటెలమండిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను భట్టి విక్రమార్కకు మంత్రి తలసాని, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కలిసి చూపించారు. అనంతరం మంత్రి తలసాని విూడియాతో మాట్లాడారు. పేద వర్గాల గొప్పగా బతకాలనే ఉద్దేశంతోనే సీఎం సీఆర్‌ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల టాయిస్తున్నామని చెప్పారు. ఈ ఇండ్లను సీఎం సీఆరే డిజైన్‌ చేశారని గుర్తు చేశారు.  హైదరాబాద్‌లో మొత్తం 60 ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇవాళ చూసింది చాలా తక్కువ అని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.  ఒక్కో ఇంటి విలవ రూ. కోటి వరకు ఉంటుందన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాల లేకుండా నిర్మిస్తున్నామని చెప్పారు. లక్ష ఇండ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. కొల్లూరులో 15 వేల ఇండ్లు నిర్మించాం. అవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ ఇండ్లను పూర్తి చేసి పేదవారికి పంపిణీ చేయాలని ప్రభుత్వం ముందుళ్తుందన్నారు. లబ్దిదారుల ఎంతో సంతోషంగా ఉన్నారు. బస్తీల సమక్షంలోనే ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇండ్ల పంపిణీలో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. డిమాండ్‌ ఉన్న చోట భవిష్యత్‌లో ఇలాంటి ఇండ్లను నిర్మిస్తామన్నారు. ఏ పార్టీలైనా పేదల సంక్షేమమే కోరుకుంటుందని మంత్రి తలసాని చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూవ్‌ ఇండ్లను పశుసంవర్ధకశాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి సీఎల్‌పి నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపి వి.హన్మంతరావు పరిశీలించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తోన్న రెండుపడకల ఇండ్ల విషయంలో శాసన సభలో జరిగిన చర్చలో భట్టి విక్రమార్క చేసినసవాల్‌ను మంత్రి తలసాని స్వీకరించారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూవ్‌  ఇండ్లు ఎక్కడ కట్టారో చూపించాలని భట్టి డిమాండ్‌ చేశారు. దీనికి స్పందించిన మంత్రి తలసాని అబిడ్స్ క్టటెల మండిలో నిర్మిస్తున్న ఇళ్లను వారికి చూపించారు. ప్రభుత్వానికి ఎన్నికల్లోనే డబుల్‌బెడ్‌రూవ్‌ ఇళ్లు గుర్తుకు వస్తాయని భట్టి విమర్శించగా ఆ సవాల్‌ను స్వీకరించిన మంత్రి తలసాని నగరంలో జరుగుతున్న ఇండ్లనిర్మాణం ఏ విధంగా జరుగుతోందో భట్టి, విహెచ్‌లకు వివరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఇతర ఉన్నతాధికారుల ఉన్నారు.

లక్ష ఇళ్లు చూపే వరకు నగరంలో తిరుగుతా :  భట్టి

లక్ష డబుల్‌ బెడ్‌రూవ్‌ ఇల్ల నిర్మాణం జరిగిందని ప్రభుత్వం చెప్పినందున వాటిని మొత్తం చూసే వరకు నగరంలో తన పర్యటన కొనసాగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. అన్ని ఇల్లను చూస్తానని అన్నారు. అలాగే ఎంతమంది పేదవారికి అందినదీ ఆరా తీస్తామని అన్నారు. నగరంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూవ్‌ ఇళ్లను గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ చూపించగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూవ్‌ ఇళ్లు కొత్తవాళ్లకు ఇచ్చింది తక్కువేన్నారు. లక్ష ఇళ్లు అంటున్నారు.. ఎక్కడ కట్టారో చూడాలన్నారు. ఇవాళ 3,428 ఇళ్లను పరిశీలించామన్నారు. కొత్తగా 400 మందికి మాత్రమే డబుల్‌ బెడ్‌ రూవ్‌ ఇళ్లు ఇచ్చారని ఆయన తెలిపారు. శుక్రవారం డా ఇళ్లను పరిశీలించాలనుకుంటున్నామని చెప్పారు. ఇళ్ల నాణ్యతను క్వాలిటీ విభాగం పరిశీలిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. కాగా హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌ రూవ్‌ ఇళ్లపై బుధవారం అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లను చూపాలని అసెంబ్లీలో భట్టి సవాల్‌ చేశారు. ఆ సవాల్‌ను మంత్రి తలసాని స్వీకరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 3,428 డబుల్‌ బెడ్‌రూవ్‌ ఇళ్లు పరిశీలించాం. ఉదయం నుంచి ఇళ్లను పరిశీలిస్తున్నాం. 2 లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. ఇవాళ నాలగు చోట్ల తిరిగాం. రేపు ఎల్లండి ఇళ్లను పరిశీలిస్తాం. మంత్రి తలసాని, మేయర్‌తో కలిసి ఇళ్లను పరిశీలించాం. డబుల్‌ బెడ్‌రూవ్‌ ఇళ్ల క్వాలిటీపై ఇంజినీరింగ్‌ బృందం పరిశీలిస్తోంది. మొత్తం ఇళ్లు చూశాక నా నిర్ణయం ప్రకటిస్తా. రాజీవ్‌ గృహ ల్ప ఇల్ల చాలా ఏళ్లయింది. వాటికి వీటికి తేడా చూడాలని  అన్నారు.