ఉల్లి…లొల్లి…!!

  • మళ్లీ ఉల్లి ధరల మోత
  • – వర్షాలకు తోడు పడిపోయిన ఉత్పత్తి
  • – ఆందోళనలో సామాన్య జనం
  • – ఎగుమతులను నిషేధించిన ంద్రం
  • – దేశంలో ఉల్లి కొరత తీరు

హైదరాబాద్‌,జ్యోతిన్యూస్‌ :

రాష్ట్రంలో ఉల్లి పంటల సాగు తక్కువగా నమోదు కావడంతో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  ఆలంపూర్‌, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లోనే సాగు ఎక్కువ. ఇవి రాష్ట్ర అవసరాల తీర్చే అవకాశం లేకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధప్రదేశ్‌లోని కర్నూల నుంచి దిగుమతి అయ్యే ఉల్లిపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటోంది. గత ఏడాది వర్షాలకు పంట దెబ్బతినడంతో దేశ వ్యాప్తంగా కిలో ఉల్లి ధర రూ.160కి చేరింది. తెలంగాణలో గరిష్టంగా రూ.170కి విక్రయాల జరిగాయి. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఉల్లి ఎగుమతులపై ఆంక్షల విధించడం, యాసంగిలో ఉల్లి సాగు గణనీయంగా పెరగడంతో ధరల నియంత్రణ సాధ్యమైంది. దేశంలో లాక్‌డౌన్‌ విధించే నాటికి కిలో ఉల్లి ధర రూ.10 -15కి మధ్యకి చేరింది. లాక్‌డౌన్‌ సమయంలోనూ రగాయల ధరల పెరిగినా ఉల్లి ధర మాత్రం కిలో రూ.20 దాటలేదు. అయితే కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల్లో.. ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాలతో పంటల మళ్లీ దెబ్బతిన్నాయి. దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో నెల రోజుల కింద బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.15నుంచి 20 పలికిన ధర ప్రస్తుతం రూ.35-40కి చేరింది. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా క్రమంగా తగ్గుతోంది. దీంతో దేశవ్యాప్తంగా మళ్లీ ఉల్లి ధరల ఘాటెక్కిస్తున్నాయి. నెల రోజులగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉల్లి సాగు గణనీయంగా చేస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో  పంటల దెబ్బతినడంతో ధరల అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే నెల రోజుల కిందటితో పోలిస్తే ధర రెట్టింపయ్యింది. కిలో రూ.40 మేర పలకుతోంది. పొరుగు నుంచి రావాల్సిన సరఫరా సగానికి తగ్గడమే ధరల పెరగడానికి కారణమని మార్కెట్‌ వర్గాల అంటున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో విదేశాలకు ఉల్లి ఎగుమతులపై ంద్రం నిషేధం విధించింది. ఉల్లి ధరల నియంత్రణకు అవసరమైతే మరిన్ని చర్యల తీసుకునేందుకు డా ంద్రం సిద్ధమవుతోంది.  మహారాష్ట్ర నుంచి వచ్చిన మేల రకం ఉల్లి ఏకంగా క్వింటాకు రూ.3,600 పలికింది. రాష్టీయ్రంగా వస్తున్న ఉల్లి సైతం ఈ నెల ఒకటిన హోల్‌సేల్‌లో క్వింటాకు రూ.700-800 ఉండగా, అది ఇప్పుడు రూ.2000కు చేరింది. ఈ ధరలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్‌లో ధర కిలో రూ.20 నుంచి రూ.40కి చేరింది. ప్రస్తుతం రాష్టాన్రికి సరఫరా తగ్గుతున్న క్రమంలో ధరల్లో పెరుగుదల ఉండవచ్చని మార్కెటింగ్‌ శాఖ వర్గాల చెబుతున్నాయి. రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఉల్లి ధరల పెరుగుతున్నాయి. దీంతో ంద్రం గత ఏడాది మాదిరి ధరల పెరగకుండా నియంత్రణకు ముందస్తు చర్యల చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు ంద్ర వాణిజ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) ఉత్తర్వుల జారీ చేసింది. ంద్రం నిర్ణయంతో బంగ్లాదేశ్‌, శ్రీలంకలకు ఉల్లి ఎగుమతుల తక్షణమే నిలిచిపోతున్నాయి. ఇక ధరల పెరుగుదలను బట్టి ఉల్లి నిల్వలపైనా ఆంక్షల విధించే అవకాశం ఉంది. ధరల భారీగా పెరిగితే వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు 50 వేల టన్నుల బఫర్‌ స్టాక్‌ను ంద్రం దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచే అవకాశాలను పరిశీలిస్తోందని ఆ వర్గాల చెబుతున్నాయి.