మూడ్రోజుల….వర్షాల…
- – అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాల
- – పల జిల్లాల్లో పొంగుతున్న వాగుల వంకల
- – హైదరాబాద్‌లో కుండపోత వర్షం
- – గంటపాటు దంచి కొట్టిన వాన
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దయింది. పల జిల్లాల్లో ఇంకా వర్షాల కురుస్తూనే ఉన్నాయి. జోరు వానలకు వాగుల, వంకల పొంగిపొర్లుతున్నాయి. చెరువుల, కుంటల మత్తడి దుంకుతున్నాయి. పల చోట్ల రోడ్లు తెగిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. నాగర్‌కర్నూల్ జిల్లాను వర్షం ముంచెత్తింది. వంగూరు మండలంలోని డిండి చింతపల్లి వద్ద దుందుభి నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. తిమ్మాజిపేట మండలం లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో పల గ్రామాల్లో చెరువుల అలగుపారుతున్నాయి. కల్వకుర్తి మండలంలోని గుండూర్ గ్రామంలో ప్రధాన రహదారి తెగిపోయి రాకపోకల నిలిచిపోయాయి. పల గ్రామాలలో వరి, పత్తి పంటల కొట్టుకుపోయాయి. ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామంలో వర్షానికి ఓ ఇల్ల లిపోయింది. సిద్ది పేట జిల్లా లోని మండపల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి జిల్లాలో భారీ వర్షాలకు పంటల దెబ్బతినమే కాకుండా లోతట్టు ప్రాంతాల జలమయమ య్యాయి. నల్లగొండ జిల్లాలో డిండి ప్రాజెక్ట్ మత్తడ పోస్తున్నది. కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వానల దంచి రకకొట్టాయి. అల్పపీడన ప్రబావం ఇంకా కొనసాగడతంతో వర్షాల పడతాయని వాతావరణ అదికారుల తెలిపారు.
హైదరాబాద్‌లో కుండపోత వర్షం…
నగరవ్యాప్తంగా ఉరుముల, మెరుపులతో డిన భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అవిూర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్‌లో కుండపోత వాన పడింది. పంజాగుట్ట, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, మెహదీ పట్నం, అత్తాపూర్, షేక్‌పేట, అప్జల్‌గంజ్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, వనస్థలిపురం, మలక్‌పేట, సైదా బాద్, చంపాపేట్, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌లో భారీ వర్షం కురిసింది. లకడీకాపూల్, లంగర్‌హౌజ్, గోల్కొండ, కార్వాన్‌లో చిరుజల్లల పడ్డాయి. పలచోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ ట్విట్టర్ ద్వారా వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. నగరంలో వర్షం కురుస్తుందని, వాహనదారులందరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఇంటికి చేరుకోవాల్సిందిగా కోరారు. వర్షం కారణంగా రహదారుల జారుడు స్వభావం కలిగి ఉండొచ్చని కావునా మూలమలపుల్లో మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిందిగా సూచించారు. ఇదిలావుంటే ఎఎస్ రావు నగర్‌లో రోడ్డు కుంగింది. అందరూ చూస్తుండగానే భారీ గొయ్యి పడింది. భారీ వర్షం నేపథ్యంలో మాన్సూన్ బృందాల ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ అలర్ట్ చేశారు. వర్షానికి లోతట్టు ప్రాంతాల జలమయ మయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఎక్కడికక్కడ వాహనాల నిలిచిపోయాయి. ఇక పాదాచారుల తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగుల ఇంటిళ్లలేక ఇబ్బందిపడుతున్నారు. పల ప్రాంతా ల్లో కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాల జనాలంతా తీవ్ర భయంతో వణికిపోతున్నారు. వరద నీరు ఇళ్ళల్లోకి ప్రవేసిస్తుండట ంతో ప్రజల భయాందోళనలకు గురవుతున్నారు. భారీ వర్షానికి కొన్ని ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
వనపర్తి జిల్లాలను ముంచెత్తిన వాన
వనపర్తి జిల్లాను వర్షం ముంచెత్తింది. అల్పపీడనంతో కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. వరదకు చెరువుల నిండి అలగుల పారుతుండగా, లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి. జిల్లా ంద్రంలోని రాంనగర్, శంకర్‌నగర్, బ్రహ్మణవీధి, శ్వేతనగర్, రామ థియేటర్ ప్రాంతాల్లోని వరద నీరు రోడ్లపై ప్రవహించింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరడంతో స్థానికుల తీవ్ర ఇబ్బందుల పడ్డారు. అలాగే జిల్లా ంద్రానికి నాగర్‌కర్నూల్, గద్వాల నుంచి రాకపోకల నిలిచిపోయాయి. అలాగే రేవెల్లి మండలంలోని కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. చిన్నబావి మండలంలో పల పంట పొలాల నీటముగిశాయి. గోపాల్‌పేట పెద్ద చెరువు అలగుపారడంతో ప్రధాన రహదారిపైకి నీళ్లు చేరడంతో రవాణా స్తంభించింది. పెబ్బేరు మండలం కంచిరావు పల్లి వద్ద చాపలవాగు పొంగడంతో రాకపోకల నిలిచిపోయాయి. అలాగే పల మండలాల్లోనూ వర్షాల కురిసిన వర్షాల కు చెరువుల జలకళను సంతరించుకున్నాయి. వీపనగండ్ల మండల ంద్రం సవిూపంలోని బీమా కాలవ ప్యాజీ నంబర్ 16, డిస్టిబ్యూట్రర్ 11 నాల్ తెగిపోవడంతో పంట పొలాల నీటమునిగాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా గోపాలపేట మండలంలో 145.5 మిల్లీ విూటర్లు, ఘణాపూర్‌లో 126.5, పనగల్‌లో 126.6 మిల్లీవిూటర్ల వర్షం కురిసింది. అలాగే జిల్లా ంద్రంలో 110.8 మిల్లీ విూటర్లు, కొత్తకోటలో 93, వీపనగండ్లలో 110 మి.విూటర్లు, అలాగే పల మండలాల్లోనూ మోసర్తు వాన కురిసింది.
గోదావరికి వరదపోటుతో కుదిర్తి వద్ద పరవళ్లు
జిల్లాలో భారీ వర్షాలకు రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. గోదావరి ఉగ్రరూపం దాలస్తూ..మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తుండటంతో పురాతన శివాలయం నీటిలో మునిగిపోయింది. శివాలయం పైనుంచి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారుల అప్రమత్తం చేశారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికల జారీ చేశారు. ఉభయ జిల్లాల వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షం కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనేక జలాశయాల కొంగొత్త అందాల సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతానికి మించి వానల కురిశాయి. నిజామాబాద్ జిల్లాలోని రెండు మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, మిగిలిన 27 మండలాల్లో సాధారణ వర్షపాతానికి ఎక్కువగానే వానల పడ్డాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి గేట్లు ఎత్తగా… నిజాంసాగర్ ప్రాజెక్టు మాత్రం వరద లేక బోసిపోతోంది. కామా రెడ్డి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల పొంగి పొర్లుతున్నాయి. కళ్యాణి, సింగీతం, పోచారం, కౌలాస్ నాలా ప్రాజెక్టుల గేట్లు సైతం ఎత్తగా దిగువకు భారీగా వరద కొనసాగుతోంది. మూడు రోజులగా కురిసిన వానలతో మంజీర నదిలో మరోమారు జలకళ ఉట్టిపడుతోంది. భారీ వర్షపాతంతో ఆయా మండలాల్లో చెరువుల, కుంటల మత్తడి పారుతు న్నాయి. ఒ సీజన్‌లో వందలాది చెరువుల రెండు, మూడు సార్లు మత్తడి దుంకుతుండడం ప్రాధాన్యతను సంతరిం చుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరుసగా రెండో ఏడాది గేట్లు తెరుచుకోవడంతో ప్రజల్లో హర్షాతిరేకాల వ్యక్తం అవుతున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి సెప్టెంబర్ రెండో వారాని గేట్లు తెరవడం ప్రాధాన్యతను సంతరించు కుంది. మరోవైపు అధికారుల అంచనాలకు భిన్నంగా మహారాష్ట్ర నుంచి వరద భారీగా రావడంతో నాలగు గేట్లు ఎత్తారు. వరద ఉధృతి పెరగడంతో 26 గేట్లు ఎత్తి వరదను నియంత్రించారు. ఎస్సారెస్పీ గేట్ల నుంచి పాల పొంగులా ఎగిరి దుంకుతున్న జలాలను చూసి ప్రజల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో ఉరకల వేస్తూ వరద దిగువకు పరుగుల తీస్తోంది. కామారెడ్డి జిల్లాలోని మరో చారిత్రక ప్రాజెక్టు నిజాంసాగర్ మాత్రం నీళ్లు లేక బోసి పోతోంది. ఎగువ నుంచి వరద స్వల్పంగానే కొనసాగుతోంది. సింగూరు నుంచి వరద అంతగా రావడం లేదు. కామారెడ్డి జిల్లాలోని మధ్యతరహా జలాశయాల మూడు రోజులగా కురుస్తున్న వానలతో ఉప్పొంగాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వానలతో వరద వస్తుండడంతో కౌలాస్ నాలా ఒ సారి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారుల గేట్లు ఎత్తి దిగువకు వరదను వదిలి పెట్టారు. కౌలాస్ ప్రాజెక్టు నుంచి వరద వదలడంతో అనేక గ్రామాలకు రాకపోకల నిలిచిపోయాయి. జుక్కల్, పిట్లం మండలాల్లో జన జీవనానికి ఇబ్బందుల తలెత్తాయి. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు సైతం జలకళను సంతరించుకోగా ఈ సీజన్‌లో రెండో సారి గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోచారం ప్రాజెక్టు సైతం పూర్తి స్థాయి నీటి మట్టంతో సరికొత్త అందాలను సంతరించుకుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత రాత్రి పల చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వాగుల వంకలన్ని పొంగిపొర్లుతున్నాయి. చెరువుల కుంటల అలగు పారుతుండగా ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తుండడంతో అధికారుల గేట్లు ఎత్తారు. కరీంనగర్ సవిూపంలోని లోయర్ మానేరు డ్యావ్‌కు వరద పోటెత్తింది. మోయతుమ్మెద వాగు ద్వారా 47 వేల ్యసెక్కుల వరద, విూడ్ మానేర్ నుంచి 19 వేల ్యసెక్కుల నీరు ఎల్‌ఎం డీకి చేరుతుంది.దీంతో అధికారుల 20 గేట్లు ఎత్తి 57,652 ్యసెక్కుల నీటిని మానేరు వాగులోకి, మరో రెండు వేల ్యసెక్కుల వాటర్‌ను కాకతీయ కాలవకు వదులతున్నారు. మిడ్ మానేర్‌కు ఎస్సారెస్పీ వరద కాలవ ద్వారా 15 వేల, మూలవాగు ద్వారా మరో 8వేల ్యసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఎంఎంఆర్‌కు చెందిన 6 గేట్లు ఎత్తి 19వేల ్యసెక్కుల నీటిని దిగువ మానేరు డ్యావ్‌కు వదులతున్నారు. ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలగు పారుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్‌ఆర్ ఎస్పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా 52వేల ్యసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 15గేట్లు ఎత్తి 1,43,865 ్యసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులతున్నారు. కాళేశ్వ రం ఎత్తిపోతల పథకంలో భాగంగా మంథని నియోజకవర్గంలో నిర్మించిన సుందిళ్ల పార్వతి బ్యారేజ్, అన్నారం సర స్వతి బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లకు భారీగా వరద వస్తుండడంతో ఆయా బ్యారేజీల గేట్లన్ని ఎత్తి దిగువకు లక్షలాది ్యసెక్కుల నీటిని వదులతున్నారు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో అటు గోదావరి మానేరు వాపుల ఉదృత ంగా ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను అధికారులతో పాటు మంత్రి గంగుల కమలాకర్ అప్రమత్తం చేశారు. వర్షం వరదల అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలతో నీట మునిగి పంట నష్టపోయిన రైతుల ఇప్పుడిప్పుడే కోలకుంటుండగా మరోసారి వర్షం వరదల అపార నష్టాన్ని మిగిల్చాయి.