రద్దుతో తగ్గిన ఉగ్రవాదం

  • – 370 ఆర్టికల్‌ రద్దుతో కాశ్మీర్‌లో తగ్గిన ఉగ్ర కార్యకలాపాల
  • – పెద్ద ఘటన ఏవీ జరగలేదన్న కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల తగ్గుముఖం పట్టాయని ంద్ర హోంశాఖ ప్రకటించింది.  గతేడాది ఆర్టికల్‌ 370 రద్దు తరవాత ఇటీవలి వర ఒక్క మేజర్‌ అటాక్‌ డా జరగలేదని ంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. ఆర్టికల్‌ 370 ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌ లో ఉగ్రవాద పరిస్థితిపై పార్లమెంట్‌లో సభ్యులడగడంతో కిషన్‌ రెడ్డి పై విధంగా ప్రకటించారు. ఆగస్టు 5,2019 తర్వాత జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాద దాడుల క్రమంగా తగ్గుముఖం పట్టాయని ఆయన తెలిపారు.2019 ఆగస్టు కంటే ముందు 455 ఉగ్రవాద సంఘటనల జరిగాయని, ఆ తర్వాత మాత్రం 211 సంఘటనల మాత్రమే జరిగినట్లు ఆయన తెలిపారు. రళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్‌, రాజస్థాన్‌, యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఐసిస్‌ కార్యకలాపాల అత్యంత క్రియాశీలకంగా ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తన రిపోర్టులో పేర్కొందని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.  జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఉగ్రవాద కార్యకలాపాల గణనీయంగా తగ్గాయని ంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రశ్నకు ంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) కార్యకలాపాల క్రియాశీలకంగా ఉన్న రాష్టాల్రకు సంబంధించిన ప్రశ్నకు కిషన్‌ రెడ్డి బదులిచ్చారు. నేషనల్‌ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ప్రకారం రళ, కర్ణాటక, ఆంధప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌లో ఐఎస్‌ ఉగ్రవాదుల క్రియాశీలకంగా ఉన్నట్లు చెప్పారు. అసోం ఒప్పందంలోని 6వ నిబంధనపై ంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను అస్సాం ప్రభుత్వానికి సమర్పించిందని, ఈ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని సంబంధిత ప్రశ్నకు కిషన్‌ రెడ్డి జవాబు ఇచ్చారు.

 భారత్‌, చైనా సరిహద్దులో చొరబాట్లు లేవు

భారత్‌, చైనా సరిహద్దులో గత ఆరు నెలలగా ఎలాంటి చొరబాట్లు లేవని ంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు బుధవారం తెలిపింది. ంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘భారత్‌, చైనా సరిహద్దులో చొరబాట్లను నియంత్రించేందుకు ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అవలంబించింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట బహుళ-అంచెల విస్తరణ, మెరుగైన నిఘా, సమన్వయం, సరిహద్దులో ఫెన్సింగ్‌, సాంతిక పరిష్కారాలను అమల చేయడం వంటి అనులమైన చర్యల ఇందులో ఉన్నాయని రాయ్‌ చెప్పారు. మరోవైపు పాకిస్థాన్‌ సరిహద్దులో చొరబాట్లపైనా ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఫిబవ్రరి నుంచి జూన్‌ వరకు 47 చొరబాటు ఘటనల జరిగాయని తెలిపారు. పాక్‌ సరిహద్దులో ఏప్రిల్‌ నెలలో గరిష్ఠ సంఖ్యలో ఉగ్రవాదుల చొరబాట్లు జరిగినట్లు రాజ్యసభకు సమాధానమిచ్చారు.