అరికట్టాలి..
- – ఆలయాల ధ్వంసంపై ఏడురోజుల పాటు నిరసనల
- – భక్తుల నమ్మకాలను వమ్ము చేసే అధికారం జగన్‌కు ఎవరిచ్చారు
- – ఆలయాల మీద దాడుల ఘటనలపై సీబీఐ విచారణ జరపాలి
- – టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్
అమరావతి,జ్యోతిన్యూస్ :
ఆలయాల ఘటనలపై సీఎం జగన్మోహన్ రెడ్డి తొలిరోజే స్పందిస్తే బాగుండేదని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ భక్తుల నమ్మకాలను వమ్ము చేసే అధికారం జగన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏం చేసినా చెల్లతుందన్న గర్వంతో ముందుళ్తున్నారని, ప్రశ్నించినవారిపై ఎదురుదాడి చేస్తూ.. అక్రమ సుల బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల ఊరుకోరని, ప్రజల తిరుగుబాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం పారిపోక తప్పదని హెచ్చరించారు. వైసీపీ మంత్రుల పద్ధతి, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆలయాల ధ్వంసంపై ఏడురోజుల పాటు నిరసనల తెలపుతామని చంద్రబాబు అన్నారు. ఏపీలో జరిగిన ఆలయాల విూద దాడుల ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడి, అభివృద్ధికి పాటుపడ్డామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూలేని వింత పోకడల చూస్తున్నామని, అంతర్వేది ఘటనలో భక్తుల జైలలో ఉన్నారని, నిందితుల బయట ఉన్నారని అన్నారు. మెజార్టీ ఉందని ప్రజలపై దాడుల చేస్తారా? అని ప్రశ్నించారు. అరాచక శక్తులపై పోలీసుల ఉక్కుపాదం మోపాలన్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలపై ప్రజల గళం విప్పాలని చంద్రబాబు పిలపు ఇచ్చారు. దేవాలయ భూములపై హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, నిజాయితీగా పనిచేసే అధికారులను మార్చేస్తోందని ఆరోపించారు. టీటీడీ ఆస్తుల అమ్మకంపై… దేశవ్యాప్తంగా ఆందోళనల చెలరేగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. వినాయకచవితి ఉత్సవాలకు అనుమతివ్వలేదు కానీ.. వైఎస్ జన్మదిన వేడుకలకు మాత్రం అనుమతిస్తూ జీవో ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రైవేటు కార్యక్రమాల చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ రాజీనామా చేశారన్నారు. శారదాపీఠం కార్యక్రమాలకు శ్రీవారి సొమ్ము ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఆలయాల, చర్చిలపై దాడుల జరిగితే కఠినంగా వ్యవహరించా మన్నారు. ఆలయాల్లో సీసీ టీవీ మెరాల ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. తప్పుడు పనుల చేయడానికి సీసీ మెరాల తొలగించారన్నారు. దుర్గగుడి ఘటనపై ఈవో ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని బాబు ప్రశ్నించారు. శ్రీశైలంలోనూ సంప్రదాయాలను మంటగలిపారని, ఉదయం 6గంటలకు చేయాల్సిన కార్యక్రమం…మంత్రి రాలేదని రాత్రి 9గంటలకు చేయడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.