లవబుల్..లివబుల్ సిటీ’ గా హైదరాబాద్

  • ప్రపంచం మెచ్చిన నగరంగా అవతరణ
  • – మెట్రోతో రవాణాకు మార్గం సుగమం
  • – మరిన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరణ
  • – ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేలా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం
  • – హైదరాబాద్‌ అభివృద్ధి కోసం రూ. 67 వేల కోట్లకు పైగా ఖర్చు
  • – ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు ఊరట
  • – పాత పట్టాలకు ఆనాటి రేటు ప్రకారమే ఫీజుల
  • – జీవోను సవరిస్తామని ప్రకటించిన మంత్రి
  • – హైదరాబాద్‌ అభివృద్ది కాంగ్రెస్‌కు కనిపించడం లేదని ఎద్దేవా
  • – అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ప్రస్తావించిన మంత్రి టీఆర్‌

హైదరాబాద్‌,జ్యోతిన్యూస్‌ :

ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా హైదరాబాద్‌ నగరం అవతరిస్తోందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి టీ ఆర్‌ స్పష్టం చేశారు. లవబుల్‌ అండ్‌ లివబుల్‌ సిటీగా హైదరాబాద్‌ మారిందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనుల, మౌళిక వసతులపై శాసనసభలో మంత్రి టీఆర్‌ స్వల్పకాలిక చర్చ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మంత్రి టీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ ఖ్యాతిపై అనేకుల తమ అభిప్రాయాలను వెల్లడి ంచారని అన్నారు. అలాగే అనేక ప్రశంసల వచ్చాయని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో అత్యం త వేగంగా పట్టణీకరణ చెందిందని తెలిపారు. తెలంగాణ పట్టణీకరణ 42.6 శాతానికి చేరుకుంది. దేశ సగటు పట్టణ జనాభా 31.2 శాతం మాత్రమే. తెలంగాణలో అనేక పాలన సంస్కరణలను చేపట్టింది. పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా 74 కొత్త మున్సిపాలిటీల, 7 కొత్త మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 142 పురపాలికలకు రూపకల్పన జరిగింది. ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తూ ఉపాధి కల్పనను పెంపొందిస్తున్నాం. కట్టుదిట్టమైన శాంతి భద్రతలను అమల చేస్తున్నాం. ఈ క్రమంలో ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా హైదరాబాద్‌ అవతరిస్తోం దన్నారు. ప్రతి నెల జీహెచ్‌ఎంసీకి రూ. 78 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ. 70 కోట్లు విడుదల చేస్తున్నాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌ అభివృద్ధి కోసం రూ. 67 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్‌ది కీలక పాత్ర అని టిఆర్‌ స్పష్టం చేశారు. నగరంలో అనేక నూతన కార్యక్రమాల, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యల తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాఫిక్‌ రద్దీ ప్రాంతాల్లో ్గ÷÷-ల ఓవర్లు, అండర్‌ పాస్‌ల నిర్మించామన్నారు. రాబోయే రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తామని తెలిపారు. అన్ని పురపాలికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. రూపాయి ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇస్తున్నామని తెలి పారు. లాక్‌డౌన్‌ పరిస్థితులను అనులంగా మార్చుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవం తం చేశామని పేర్కొన్నా రు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు డిజాస్టర్‌ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేశామ న్నారు. నూతన మున్సిపల్‌ చట్టం ద్వారా అనుమతులను సులభతరం చేశామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో డీఆర్‌ఎఫ్‌ బృందాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. బస్తీల్లో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే ందుకు బస్తీ దవఖానాల ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డు వద్ద విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నామని టీఆర్‌ స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ రద్ధీ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ల నిర్మిస్తున్నామని మంత్రి టిఆర్‌ పేర్కొన్నారు. కరోనా వల్ల దేశంలో మౌలిక వసతుల కార్యక్రమాల నిలిచిపోయాయని, లాక్‌డౌన్‌ పరిస్థితులను అనులంగా మార్చుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవ ంతం చేశామని, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీకి ప్రత్యేక చర్యల తీసుకుంటున్నామని, రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ మెట్రోని మరింత విస్తరిస్తామని, బస్తీలో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని, జిహెచ్‌ ఎంసి పరిధిలోని బస్తీ దవాఖానాలను 350కి పెంచుతామని టిఆర్‌ హావిూ ఇచ్చారు. పేదల సొంతింటి కలను నిజం చేయడానికి డబుల్‌ బెడ్‌రూవ్‌ ఇండ్లను నిర్మిస్తున్నామని, జిహెచ్‌ఎంసి పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూవ్‌ ఇండ్లను నిర్మిస్తున్నామని మంత్రి టిఆర్‌ తెలిపారు. కొల్లూరులో రూ.1400 కోట్లతో 15 వేలకుపైగా డబుల్‌ బెడ్‌రూవ్‌ ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని ప్రశంసించారు. జవహర్‌నగర్‌లో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఎ÷-లాంట్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఒక్క హైదరా బాద్‌ లోనే నాలగు లక్షల 58 వేల కు పైగా ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేశామని, ఐదు లక్షల సిసి మెరాలతో భాగ్య నగ రంలో తొలి స్థానంలో ఉందన్నా రు. ప్రపంచంలోనే అత్యంత డైనమిక్‌ నగరంగా హైదరాబాద్‌ను జెఎల్‌ఎల్‌ సంస్థ గుర్తించిందన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు ఊరట

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు 131 జీవోను సవరించి.. కొత్త  జీవోను విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి టీఆర్‌ శాసనసభ వేదికగా ప్రక టించారు. ఈ సందర్భంగా టీఆర్‌ మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజల పట్ల గౌరవం ఉన్నది కాబట్టే మొన్న తీసుకువచ్చిన 131 జీవోను సవరిస్తామన్నారు. గతంలో ఎప్పుడైతో వారు రిజిస్టేష్రన్‌ చేసుకున్నారో వాటి విలవకు అనుగుణంగానే సవరించిన జీవోను గురువారం విడుదల చేస్తామని టీఆర్‌ ప్రకటించారు. రిజిస్టేష్రన్‌ సమయంలో ఉన్న మార్కెట్‌ విలవ ప్రకారమే రుసుం వసూల చేస్తామని టీఆర్‌ స్పష్టం చేశారు. అనధికారిక లే అవుట్లలో తెలి యక ప్లాట్లను కొనుగోల చేసిన వారంతా ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. పట్టణ, గ్రావిూణ ప్రాంతా ల్లో ఇప్పటివరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఇదే మంచి అవకాశమని మంత్రి టీఆర్‌ ఇటీవలే చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌ 15వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీవ్‌ని సద్వినియోగం చేసుకుంటే.. యాజమానుల భూములపై సర్వహక్కులతోపాటు ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాలను పొంద డానికి అర్హులవుతారని వివరించారు. వచ్చే అక్టోబర్‌ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణ ఫీజు ను వచ్చే ఏడాది జనవరి 31లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలాల, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ మిగుల భూముల, దేవాదాయ భూముల, చెరువుల శిఖం భూముల్లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీవ్‌ వర్తించదని స్పష్టం చేశారు.

అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ పార్టీ అవమానించింది అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి టీఆర్‌ స్పష్టం చేశారు. తమకు అంబేడ్కర్‌ పై గౌరవం లేదని భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. అది వారి చెల్లతుందన్నారు. అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్‌ పార్టీనే. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో అంబేడ్కర్‌ ను ఓడించింది కాంగ్రెస్‌ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ను పార్లమెంట్‌లో అడుగు పెట్టనివ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ కుట్ర చేసిందన్నారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్‌ నేతల.. ఆయన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంబేడ్కర్‌ ను గౌరవిస్తున్నాం కాబట్టే.. బోరబండలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ వద్ద దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని 28 ఫీట్ల ఎత్తులో పెట్టాం. ట్యాంక్‌బండ్‌ వద్ద 125 ఫీట్ల ఎత్తులో అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెట్టబోతున్నాం. అంబేడ్కర్‌ ఆశయాలను అనుసరించి ఉంటే ఆ పార్టీ ఎప్పుడో బాగుపడేది. తమ పార్టీ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుళ్తుందని టీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై మంత్రి టీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష సభ్యుడైన భట్టి విక్రమార్క నిర్మాణాత్మకమైన సలహాల, సూచనల ఇవ్వలేదు. హైదరాబాద్‌ అభివృద్ధి తామే చేశామని భట్టి విక్రమార్క చెప్పారు. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏమిటో భట్టి మాట్లాడింది వింటే అర్థమయిందన్నారు. కొత్త విషయం చెప్పలేదు. తెలంగాణ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటే.. కాంగ్రెస్‌ నేతలకు పట్టదు. తెలంగాణ అభివృద్ధి చెందుతు ంటే కాంగ్రెసోళ్లకు కడుపు మండిపోతోందన్నారు. హైదరాబాద్‌ బెస్ట్ సిటీ అని అనేక సర్వే సంస్థల చెబుతున్నాయి. ప్రపంచంలోనే హైదరాబాద్‌ మోస్ట్ డైనమిక్‌ సిటీ అని జేఎల్‌ఎల్‌ చెప్తుంటే.. వీరేమో పట్టించుకోవడం లేదన్నారు. వేలకోట్లు ఖర్చుపెట్టి అభివృద్ది చేస్తుంటే కనీసం చూసి డా గుర్తించరా అని అన్నారు. కోటి మంది ఉండే హైదరాబాద్‌లో ఎలాంటి మౌలిక సదుపాయాల కల్పించలేదు. పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించలేదు. బస్తీ దవఖానాల పెట్టలేదు. పేదల గురించి ఆలోచించలేదు అంటే సరిపోదని అన్నారు. కరెంట్‌ కోసం ఇందిరా పార్కు వద్ద పారిశ్రామికవేత్తల కాంగ్రెస్‌ హయాంలోనే జరిగింది కదా? శాంతిభద్రతల మెరుగుపడ్డాయి. ఆరు కోట్ల మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ సెంటర్లు నగరంలో ప్రతి మూలన కనిపిస్తాయి. గాంధీ భవన్‌లో ర్చుంటే కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గాంధీ భవన్‌ దివాళా తీసింది. రేపో మాపో టూలెట్‌ బోర్డు పెట్టుకోవాల్సి వస్తది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణను అభివృద్ధి చేసి ఉంటే.. 2014, 2018 ఎన్నికల్లో ఎందుకు గెలవలేక పోయారు? అని అడిగారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ఎంత ఖర్చు పెట్టింది? 2014-20 వరకు తెలంగా ణ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలసుకోవాలి. తమ ప్రభుత్వం.. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 67 వేల 130 కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం పది సంవత్సరాల కాలానికి రూ. 4,636 కోట్లు ఖర్చు పెట్టిందని గుర్తు చేశారు. భారతదేశంలోనే ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. రూ. 18 వేల కోట్లతో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. వీటిలో రూ. 9,714 కోట్లతో హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణం చేస్తున్నాం. మొత్తం లక్ష ఇండ్లు డిసెంబర్‌ వరకు పూర్తి చేసి పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వ కృషిని అభినందించ అక్బరుద్దీన్‌

ప్రపంచంలోనే హైదరాబాద్‌ అద్భుత నగరం అని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ స్పష్టం చేశారు.  గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనుల, మౌళిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఓవైసీ మాట్లాడారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకు పోతోందన్నారు. హైదరాబాద్‌ భారతదేశానికి న్యూయార్క్ లాంటిందని చెప్పారు. మొజంజాహీ మార్కెట్‌ను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిందని తెలిపారు. పాతబస్తీకి మెట్రో రైల ఎప్పుడు వస్తుందో చెప్పాలని కోరారు. పాతబస్తీలో రహదారుల వెడల్ప పనుల చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆక్రమణల డా తొలగించాలని సూచించారు. పాతబస్తీలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కారించాలన్నారు. మూసీ సుందరీకరణ పనుల చేపట్టాలని ప్రభుత్వానికి ఓవైసీ విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో జీహెచ్‌ఎంసీ సేవల మరువలేనివి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయ ంలో అన్నపూర్ణ క్యాంటీన్లు పేదల ఆకలిని తీర్చాయని ఎమ్మెల్యే ఓవైసీ స్పష్టం చేశారు. ఈ చర్చలో భట్టి విక్రమార్క, వివేకానంద తదితరుల పాల్గొన్నారు.

గ్రేటర్‌లో పన్నుల పెంచలేదు: టిఆర్‌

త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్‌ నియామకాల చేపడతామని పురపాలకశాఖ మంత్రి టీఆర్‌ ప్రకటించారు. మొదటి మూడేండ్లు ప్రొబేషనరీ కాలపరిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస్‌ కార్యాలయాల డా నిర్మిస్తామని తెలిపారు. కార్పొరేటర్‌, వార్డు ఆఫీసర్‌ కలిసి పనిచేస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి సంబంధించి సభ్యు ల అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి అన్ని చర్యల తీసుకుంటున్నామని చెప్పారు. ంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిల ఇవ్వకున్నా, రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్‌ కార్పొరేషన్‌కు క్రమంతప్పకుండా నిధులను ఇస్తున్నదని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకు ఆస్తిపన్ను, నీటి పన్ను పెంచలేదని, పైగా పన్నుల తగ్గించామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో ఎస్‌ఆర్‌డీపీ ద్వారా పెద్దఎత్తున అభివృద్ధి పనుల చేపట్టమన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల చేశామని వెల్లడించారు. అక్టోబర్‌ 2 వరకు 11 వేల పబ్లిక్‌ టాయిలెట్స్ నిర్మాణాల పూర్తిచేస్తామని తెలిపారు.