పోలవరం కోసం పోరాడండి !

  1. ` ప్రత్యేకహోదాపై పార్లమెంట్‌లో నిలదీయండి
  2. ` జీఎస్టీ బకాయిులు, కేంద్ర పథకాల నిధులను రాబట్టాలి
  3. `పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనకు కృషి చేయాలి
  4. ` ఎంపీలతో సీఎం జగన్‌ వర్చువల్‌ మీటింగ్‌
  5. `  పార్లమెంట్‌ అజెండాపై ఎంపికు దిశానిర్దేశం

అమరావతి,సెప్టెంబర్‌14(ఆర్‌ఎన్‌ఎ): ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని వైకాపా ఎంపిలకు సిఎం జగన్‌ సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిులు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనకు పోరాడాలని అన్నారు.పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలతో  వర్చువల్‌ విూటింగ్‌ ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్రానికి  రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ సాధనపై ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం చేశారు.  అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా ఎంపీలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఏపీకి సంబంధించిన కరోనా  నియంత్రణ చర్యలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాపై చర్చించాని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి స్పీకర్‌ను కోరిన సంగతి తెలిసిందే.పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత మిధున్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ.. సీఎంతో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు బకాయిులు కేంద్రం నుంచి వచ్చేలా చూడమని చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలా ఒత్తిడి చేయమని కోరారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేశాము. ఈ అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రులను కులుస్తాము. జీఎస్టీ పెండింగ్ బకాయిలను వచ్చేలా అధికారులతో కులుస్తాం. గరీబ్‌ కళ్యాణ్‌ కింద నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ మెడికల్‌ కాలేజ్‌ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరారు. సాలురిలో గిరిజన విశ్వవిద్యాయం ఉంటే గిరిజనులకు లాభం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని నిందులు వేస్తున్నారు. అంతర్వేది ఘటనపై నిజాల నిగ్గు తేలాలి. మతకహాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాం. సీఆర్‌డీఏ, ఫైబర్‌ గ్రిడ్‌పై వెంటనే సీబీఐ దర్యాప్తు జరపాన్నారు. దిశా బిల్లు, కౌన్సిల్‌ రద్దు బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెపాల్సి ఉందని మిధున్‌ రెడ్డి చెప్పారు.

రఘురామపై వేటుకు డిమాండ్‌

రఘురామకృష్ణంరాజుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి గౌరవం ఇచ్చింది. అయితే ఆయన ప్రతిపక్షా ఎజెండా ప్రకారం నడుచుకుంటున్నారు. ఆయనపై త్వరితగతిన అనర్హత వేటు వేయాలిని మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు పూర్తిగా ప్రతిపక్ష ప్రభావంలో ఉన్నారని, స్పీకర్‌ను కలిసి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతామని  వైసీపీ ప్లోర్‌ లీడర్‌ మిథున్‌రెడ్డి తెలిపారు. వైసీపీ ఎంపీతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకహోదా, పోలవరం నిధులు, ఆర్‌ ఎండ్‌ ఆర్‌ ప్యాకేజి నిధులు కోరుతామని తెలిపారు. జీఎస్టీ, సివిల్‌ సప్లయ్‌ నిధులి పెండిరగ్‌లో ఉన్నాయని, ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు కేంద్ర సాయం కోరుతామని చెప్పారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై నిందులు వేస్తున్నాయని, రథం విషయంలో మతకహాలు సృష్టించేలా మాట్లాడుతున్నారని మిథున్‌రెడ్డి తప్పుబట్టారు.