వలస కూలీల కన్నెర్ర సంగారెడ్డి

కంది ఐఐటీ వద్ద పోలీసులపై తిరగబడ్డ కార్మికులు

హైదరాబాద్: వలస కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 1600 మంది కార్మికులు లా డౌన్ కారణంగా గత నెలరోజులకు పైగా అక్కడే చిక్కుకు పోయారు. యజమాని సంగారెడ్డి కంది ఐఐటీ వద్దే కార్మికులను ఉంచారు. గత నెలరోజులుగా ఉపాధి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అసహనానికి
గురయ్యారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు
సన్నద్ధమయ్యారు. తమను సొంతూళ్లకు పంపాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. అక్కడి చేరుకున్న పోలీసులపై రాళ్లు, కట్టెలతో దాడికి యత్నించారు. కార్మికుల రాళ్ల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంస మయ్యాయి. రాళ్లు, కట్టెలు పట్టుకుని తిరుగుతూ.. బీభత్సం సృష్టించారు.
ఘటనా స్థలికి పోలీసు బలగాలు భారీగా చేరుకోవడంతో కార్మికులు వెనక్కి తగ్గారు. ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వలసకూలీల ఆందోళనతో కంది ఐఐటీ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. సామాజిక దూరం పాటించాలని పాటించాలని పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా
పట్టించుకోకుండా వందలాది మంది కూలీలు ఓకే చోటకు చేరారు.