కేథార్నాథ్ తలుపులు తెరుచుకున్నాయి

సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పాల్గొన్న 16 మంది, పూజారులు

న్యూఢిల్లీ : ఆరునెలల పాటు మూసివున్న కేథార్ నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. మంత్రోచ్చరణల మధ్య ఆలయ తలుపులను వేద పండితులు తెరిచారు. బుధవారం ఉదయం సరిగ్గా
6 గంటల 10 నిముషాలకు ఆలయం తలుపులు ఓపెన్ చేశారు. అంతకుముందు పవిత్ర పంచముఖి డోలి యాత్ర జరిగింది. ఉత్తరాఖండ్ లోని గడ్డస్టల్ వద్ద ప్రారంభమైన యాత్ర .. గౌరీకుండ్ వరకు వాహనంలో సాగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కాలినడకన… కేదారనాథున్ని డోలి యాత్ర ద్వారా ఆలయానికి తీసుకువచ్చారు. ఏటా దాదాపు కుమావో బెటాలియన్ ఆర్మీ
నేతృత్వంలో యాత్ర జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై.. శివనామస్మరణతో గిరులను మారుమోగిస్తారు.
కానీ ఈ ఏడాది కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా భక్తులు ఎక్కడికీ కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో కేవలం ఐదుగురు
పూజారులు మాత్రమే డోలీ యాత్రలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆలయానికి భక్తులు ఎప్పుడు అనుమతిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఆలయ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా మళ్లీ ఆలయాన్ని నవంబర్ లో
మూసివేస్తారు.