షెల్టర్ హెూమ్స్ పై నివేదిక ఇవ్వండి
తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్: షెల్టర్ మామ్స్ పై నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యాచకులు, వలస కూలీలను షెల్టర్ హెమ్స్ కు తరలించాలన్న పిటిషన్ పై విచారణ
సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. యాచకులు, వలస కూలీలు కాలిబాటలపైనే ఉండడంపై న్యాయవాది ఎస్.నందా లేఖ రాశారు. యాచకులను, కూలీలను షెల్టర్ మామ్ కు తరలించాలని పిటిషనర్ తన లేఖలో కోరారు. దీన్ని సుమోటోగా హైకోర్టు స్వీకరించింది. షెల్టర్ హెూమ్ లపై మే 7
లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో షెల్టర్ హెూమ్ లు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఎంత మంది ఉన్నారు? వసతుల్లోని సదుపాయల గురించి చెప్పాలని హైకోర్టు
తన ఆదేశాల్లో పేర్కొంది.
కోర్టులకు సెలవులు రద్దు తెలంగాణలోని న్యాయస్థానాలకు వేసవి సెలవులు రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్ డౌన్ వల్ల కోర్టు కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యంలో సెలవులు రద్దు చేస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు సహా జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.