భారత్ లో సహస్రం
క్షేమశాఖ వెలమత్తం బాధితుల సంత కొత్తగా 1897
కరోనాతో వెయ్యి మరణాలు దాటిన భారత్, 24 గంటల్లో 72 కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఈ వైరతో దేశవ్యాప్తంగా అత్యధికంగా 73మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా సోకి
మరణించిన వారి సంఖ్య 1007కి చేరింది. అంతేకాకుండా కొత్తగా 1897 పాజిటివ్ కేసులు
నిర్ధారణ కావడంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 31,332కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం బాధితుల్లో 7696 మంది కోలుకోగా మరో
22,629 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో వైరస్ బారినపడి కోలుకుంటున్న వారిశాతం 24.56గా ఉంది.త్యధికంగా మహారాష్ట్రలో 9,318 కరోనా కేసులు నమోదు కాగా,
400 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్ లో 3,744, ఢిల్లీలో 3,314, మధ్యప్రదేశ్ లో 2,387, రాజస్తాన్లో 2,364, తమిళనాడులో 2,058, ఉత్తరప్రదేశ్ లో 2,053 కరోనా కేసులు
నమోదయ్యాయి.
మహారాష్ట్రలోనే 400 మంది మృత్యువాత.. దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ ఉద్దృతి మహారాష్ట్రలో కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 31 మరణాలతోపాటు 728 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9318 చేరగా 400మంది మృత్యువాతపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. ఇక అధిక తీవ్రత ఉన్న గుజరాత్ లో మొత్తం కేసుల సంఖ్య 3744కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 181మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లోనూ కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2387 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 120మంది మరణించారు. దేశ రాజధాని దిల్లోలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3314 మందికి కరోనా సోకగా 54మంది
మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లో 1259, తెలంగాణలో 1009.. ఆంధ్రప్రదేశ్ లో వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 1259 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1009కి చేరగా 25మంది మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం
వెల్లడించింది.