నిత్యావసరాలు…లాక్ ఆదాయ వనరులు ..డౌన్

కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు..అధిక ధరలతో సతమవమవుతున్న సగటు జీవులు

  • నెల రోజుల లాక్ డౌన్ తర్వాత ఉత్పన్నమవుతున్న సమస్యలు
  • నియంత్రణ లేని ధరలతో సామాన్యుల ఇక్కట్లు
  • సూల్ సేల్ దుకాణాలు లేక రిటైల్ లో తగ్గిపోతున్న సరుకులు
  • పట్టించుకోని ప్రజా పంపిణీ వ్యవస్థ
  • రెడ్ జోన్లలో పరిస్థితి మరింత జఠిలం
  • లాక్ డౌన్ కాలాన్ని పెంచితే మరిన్ని కష్టాలు
  • 20 నుంచి 30 శాతం అధిక ధరలతో విక్రయాలు 

హైదరాబాద్: కరోనాను కట్టడి చేయాల్సిందే. ఇందులో ప్రజలకు ఎలాంటి సందేహం లేదు. కానీ.. ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్న ఆంక్షల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులే కలవర పెడుతున్నాయి. సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లాక్ డౌన్ ప్రకటించే సమయానికి పరిస్థితులు సాధారణంగానే కనిపించినా..నెలల తరబడి చేరుకునే సరికి మునుపటిలా లేదు. ఎండల మాదిరే నిత్యావసరాల ధరలు కూడా దంచి కొడుతున్నాయి. ఆకాశమే హద్దుగా రేట్లు పెరిగిపోయాయి. నీళ్ల టిస్ దగ్గర నుంచి పాలు, కూరగాయలు, దుకాణాల్లో లభించే కనీస సరుకుల ధరలు ఏవీ అందుబాటులో లేవు. సంచినిండా డబ్బులు పట్టుకెళ్లితే.. చేతినిండా సరుకులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇదేంటీ.. ఇంత రేటా అని దుకాణదారుడిని అడిగే పరిస్థితి లేదు. వ్యాపారి చెప్పిన రేటుకు కొనుగోలు చేయాల్సిందే. లాక్ డౌస్ సమయంలో పలువురు వ్యాపారులు దోపిడీ వ్యవహారానికి తెరలేపారు. ఉన్న నాలుగు గంటల రద్దీ సమయంలోనే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. కిరాణా సామాన్ల పై ఇష్టారాజ్యంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఇక బేకరీలో విక్రయించే సరుకుల పై అడిగే నాథులే కరువయ్యారు. షాపులు తెరవకపోయినా రోడ్ల పై బేకరీ ఉత్పత్తులను పెట్టి అధిక ధరలకు అమ్ముతున్నారు. కొంతమంది వ్యాపారులైతే నేరుగా ఎమ్మార్పీ స్టిక్కర్లు మార్చేసి ధరలు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తుండడంతో జనం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో అవసరానికి సంబంధించిన నిత్యావసరాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఆయా షాపులకు అనుమతులు ఉండడంతో వ్యాపారులు దుకాణాలు తెరుస్తున్నారు. ఇంతవరకు బాగున్నా ధరల విషయంలో మాత్రం ఎంతో వ్యత్యాసాలు ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. అయితే ఒక్క సారిగా ధరలు పెరిగాయా? అంటే అదేమీ లేదు. కావాలనే పలువురు వ్యాపారులు ఎంతో కొంత పెంచి విక్రయాలు జరుపుతున్నారు. ఏవో నాలుగు రకాల సరుకులు కొనుగోలు చేసిన సదురు వ్యక్తి మొత్తంగా డబ్బులు చెల్లిస్తారు. దీనికితోడు షాపుల వద్ద పదుల సంఖ్యలో ప్రజలు నిరీక్షించడంతో ఎవరూ ధరల విషయం పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. పలువురు ఇంటికి వచ్చిన తర్వాత సామగ్రిని పరిశీలించగా కొంత ఎక్కువ సొమ్ము చెల్లించినట్లు నిర్ధారణకు వస్తున్నారు. వ్యాపారులు మాత్రం కిలో వద్ద రూ.ఐదు నుంచి పది రూపాయల వరకు అదనంగానే వసూలు చేస్తున్నారు. పప్పుదినుసుల పై మరీ ధరలు పెంచి అమ్ముతున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పులతో పాటు గోధుమపిండి, శనగపిండి, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ తదితర వాటి పై పది నుంచి 20 రూపాయల వరకు రేట్లు పెంచేసి వ్యాపారులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క పనులు లేక ఆదాయం రాక సతమతమవుతుంటే వ్యాపారులిలా అడ్డగోలుగా దోచుకోవడం సమంజసం వాదని వాపోతున్నారు. అధికారులు అధిక రేట్ల విక్రయిస్తే చర్యలు చేపడతామని హెచ్చరిస్తున్నా వ్యాపారులు పట్టించుకోకపోవడం గమనార్హం. చాలాచోట్ల స్వీట్స్, బేకరీకి సంబంధించిన షాపులు తెరవడం లేదు. కానీ పలు రకాల పిండి వంటలు, చేగోడీలు వంటి పలు రకాల సరుకులు ప్యాకింగ్ చేసి బహిరంగంగానే రోడ్డు పై పెట్టి విక్రయిస్తున్నారు. ఆయా సరుకులకు సంబంధించి నేరుగా ప్యాకింగ్ గతంలో కంటే 20 రూపాయలు అదనంగా ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నారు. మరికొందరు వ్యాపారులైతే మరో అడుగు ముందుకేసి ఏకంగా ఎమ్మార్పీ ధరల స్టిక్కర్లను మార్చేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్రెడ్ చిన్నది. మామూలు రోజుల్లో చిన్నది. రూ.15, రూ.20 ఉంటే ఇప్పుడేమో రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. ఇదేంటని అడిగినా దాని ధర నలభై రూపాయలు బాబూ.. కొంటే కొనండి, లేకపోతే మానేయండి అంటూ బదులిస్తున్నారు. రిలయన్స్ ఫ్రెష్ లాంటి పెద్ద పెద్ద మార్కెట్లలో కూడా ఈ దోపిడీ సాగుతోంది. కరోనాకు ముందు వరకూ ఒకటి కొంటే ఒకటి ఉచితం (బై వన్ గెట్ వన్), రెండు కొంటే మూడోది ఉచితం, 10 నుంచి 50 శాతం రాయితీ అంటూ ఆఫర్లు ప్రకటించి అమ్మకాలు జరిపిన వస్తువులనే నేడు కరోనా దోపిడీ ధరలకు విక్రయిస్తుండడం గమనార్హం. బయట మార్కెట్ కు, ఈ షాపుల్లోని ధరలకూ అసలు పొంతనే ఉండడం లేదు. ఇలాంటప్పుడు జేసీల నాయకత్వంలో ధరల నిర్ణయ కమిటీలు ఎందుకున్నట్లో అర్ధం కావడం లేదు. ఇలా చాలా రకాల నిత్యాసరాలు, తినుబండారాల పై పలువురు వ్యాపారులు తమదైన శైలిలో చిలక్కొట్టుడుకు పాల్పడుతున్నారు. అధిక ధరలకు విక్రయాలు జరిపితే కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నా, కరోనా సమయంలో ఫిర్యాదులు ఏమి చేస్తాములే అనే ధోరణిలో చాలామంది ప్రజలు ఆ జోలికి వెల్లడం లేదు. కానీ పలుచోట్ల మాత్రం ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులు వెళ్లి పరిశీలించి, జరిమానాలు విధించడం జరుగుతోంది. అందువల్ల జనం చైతన్యవంతులై అక్రమ వసూళ్లకు పాల్పడే వ్యాపారులపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడితే మంచిది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు పొంతన లేదా? నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయా? పాలు నుంచి కూరగాయలు, ఉప్పు, పప్పుల వరకూ ఏవీ సామాన్య ప్రజలు కొనేలా లేవా? ఇదే ఛాన్స్ గా వ్యాపారులు ఉన్న సరుకును బ్లాక్ చేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారా? దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మూడోవారంలోకి ప్రవేశిస్తున్న సమయంలో పరిస్థితులు విషమిస్తున్నాయా? దేశం మొత్తం ఇదే దుస్థితి ఉంది. సామాన్యులు ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు. లాక్ డౌన్ ప్రకటనకంటే ముందు ఉన్న రేట్లు పది నుంచి 20 శాతం వరకూ పెరిగిపోయాయి. పోనీ అత్యవసరం కాబట్టి కొందామన్న నిత్యావసరాలు దొరికని ప్రాంతాలు కూడా ఉన్నాయి. రేట్లను పెంచొద్దని.. అలా పెంచితే వ్యాపారుల పై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు చేసిన హెచ్చరికలు మాటలకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ధరల దోపిడీని ఎవ్వరూ అడ్డుకోలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలులో ఉన్నా.. నిత్యావసరాల రవాణాకు ఎలాంటి ఆటంకం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా.. అసలు లారీలు, ఇతర వాహనాలు కదిలితే ఒట్టు. రోడ్లపై లారీలు.. సరుకు రవాణా వాహనాలు కనిపిస్తే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సైతం సరుకు రవాణా పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రవాణా వ్యవస్థ స్తంభించడం. సాగు విస్తీర్ణం తగ్గడం కూడా కూరగాయల రేటు పెరగడానికి కారణం అవుతోంది. టమోటా, మిర్చి, బెండకాయ. వంకాయ. దొండకాయ. బంగాళాదుంపలు వేటిని చూసినా భారీగానే అమ్ముతున్నారు. ఎటు చూసినా ధరలు మంట పుట్టిస్తున్నాయి. జనతా కర్ఫ్యూ కంటే ముందు రోజు… అంటే శనివారం మార్కెట్లలో కిలో టమోట ధర 10 రూపాయలు ఆ తరువాత 80 నుంచి 100 రూపాయలకు కిలో విక్రయిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే… లాక్ డౌన్లో మిగిలిన రోజుల్లో ఎలా ఉంటుందో అనే ఆందోళన నెలకొంది. లాక్ డౌన్ కారణంగా నిత్యవసర సరుకులతోపాటు పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పప్పుదినుసులు వంటింట్లో వినియోగించే ప్రతి వస్తువు ధర చుక్కలను అంటుతున్నాయి. గత నెలతో పోల్చుకుంటే ధరలు రెట్టింపు అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు వైద్యులు సూచిస్తున్నారు. అయినా మాంసం కోసం, మరోవైపు కూరగాయలు, నిత్యవసరాలు, ఇంకోవైపు రేషన్ బియ్యం, కందిపప్పు కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. లాక్ డౌన్ వల్ల మేకలు, పొట్టేళ్ల సరఫరా లేదంటూ కిలో 800 నుంచి 900 రూపాయల వరకు మాంసం అమ్మారు. ధరలు ఎంత పెరిగినా మాంసప్రియులు మాత్రం ఎగబడి కొన్నారు. ఇక చేపల మార్కెట్ లో కిలో రకాన్ని బట్టి కిలో 50 నుంచి కిలో 250 రూపాయల వరకు ధరలు పలికాయి. లాక్ డౌన్ వల్ల టోకు వర్తకుల వద్ద సరుకు నిల్వలు అయిపోనట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో బ్రాండెడ్ సరుకులు కాకుండా నాసిరకానివి అమ్ముతున్నారు. కొన్నిచోట్ల పామాయిల్ లీటరు 90 రూపాయలు, సఫ్లవర్ లీటరు 105 రూపాయలు, వేరుశెనగ నూనె 140 రూపాయలు, బొంబాయి రవ్వ కిలో 32 నుంచి 42 రూపాయలు, గోధుమ రవ్వ కిలో 32 నుంచి 44 రూపాయలు, కందిపప్పు కిలో 80 నుంచి 100 రూపాయలు, చెక్కర కిలో 30 నుంచి 40 రూపాయలు, బెల్లం కిలో 40 నుంచి 60 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఒకపక్క కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించినా కొంత మంది వర్తకులు వినియోగదారులను ధరల రూపంలో దోచుకోవడం పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, రేషన్ సరుకులతోపాటు ఫ్రూట్స్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సీజన్ లో లభించే పండ్లతో పాటు యాపిల్స్, ఆరెంజ్, పుచ్చకాయ, కర్భుజా, గ్రేప్స్ ధరలు కూడా రెట్టింపు చేసి వ్యాపారులు విక్రయిస్తున్నారు. . రాబోయే రోజులు కూడా కిరాణా షాపుల్లో సరుకులు నిండే అవకాశం లేదని, ఇతర రాష్ట్రాల నుంచి కంటైనర్లు వస్తే తప్ప పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం లేదు. లాలూకు కరోనా టెన్షన్ కరోనా బాధితుడికి వైద్యం చేసిన లాలూ వ్యక్తిగత వైద్యుడు పాట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్రోడీ) అధినేత, బిహర్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు కరోనా భయం పట్టుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి చికిత్స అందించిన వైద్యుడే లాలూ ప్రసాద్ కు కూడా చికిత్స చేయడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇదే హాస్పిటల్ లో లాలూ కూడా చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా గత మూడు వారాలుగా లాలూకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉమేష్ ప్రసాద్ కరోనా బాధితుడికి కూడా వైద్యం చేశారు. దీంతో కోవిడ్ రోగికి వైద్యం అందించిన ఉమేష్ ప్రసాద్ తో పాటు, అతని బృందంలోని అందరినీ క్వారంటైన్ కు పంపుతున్నట్లు రిమ్స్ ప్రకటించింది. అంతేకాకుండా వీరిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే, లాలూ ప్రసాద్ కి కూడా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే లాలూను పెరోల్ పై విడుదల చేసే ప్రతిపాదనను జార?ండ్ అడ్వకేట్ జనరల్ కు సీఎం హేమంత్ సోరెస్ పంపించారు. కాగా 7 సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష ఉన్న ఖైదీలను మాత్రమే పెరోల్ పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే