కరోనా పరీక్షలు రోజుకు లక్షకు పెంచండి
మోదీకి ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరీక్షలను వేగవంతం చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కరోనా పోరుకు ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించడం ఎంతో అవసరమని చెప్పారు. నిపుణులు సైతం ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారని రాహుల్ పేర్కొన్నారు. దేశంలో రోజుకు సగటున 40వేల కొవిడ్-19 పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయని, ఆ సంఖ్యను లక్షకు పెంచాలని కోరారు. పరీక్షలకు సరిపడా కిట్లు దేశంలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విషయంలో ప్రతిబంధకాలను అధిగమించి సత్వర చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీకి విన్నవించారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సైతం ఇదే విషయం స్పష్టంచేశారు