లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ఏం చేద్దాం?

ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సలహాలు అడిగిన మోదీ 

  • కాన్ఫరెన్స్ లో పాల్గొన్న 9 రాష్ట్రాల సీఎంలు
  • సమావేశానికి కేరళ సీఎం గైర్హాజరు
  • లాక్ డౌన్ ఎత్తివేత పై సీఎంల భిన్నాభిప్రాయాలు
  • జోన్లవారీగా ప్రణాళికలు సిద్ధం చేయమన్న ప్రధాని
  • మే 3 తర్వాత కీలక నిర్ణయం పై ప్రధాని ప్రకటన
  • ఈ వారంలో జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
  • ఆర్థిక సమస్యలపై సీఎంలకు భరోసా 
  • లాక్ డౌన్ ఫలితాలపై సంతృప్తి వ్యక్తంచేసిన మోదీ 

న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో కూడా కోవిడ్ ప్రభావం కనిపించవచ్చని, ఫేస్ మాస్క్ లు, ఫేస్ కవర్లు ధరించడం మన జీవితంలో ఒక భాగం కావచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్-19 పై పోరాటం సాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితి, సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ చర్చించారు. ‘ఇంతవరకూ మనం రెండు లాక్ డౌన్లు చూశాం. ప్రస్తుతం మనం ఏవిధంగా ముందుకు వెళ్లాలనేది ఆలోచించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా వైరస్ ప్రభావం రాబోయే నెలల్లోనూ కనిపిస్తుంది. మునుముందు కూడా రోజువారీ జీవితంలో అంతా మాస్క్ లు ధరించడం అనివార్యం కావచ్చు’ అని మోదీ అన్నారు. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వేలాది ప్రాణాలు కాపాడగలిగాం… లాక్ డౌన్లో సానుకూల ఫలితాలు వచ్చాయని, గత నెలన్నరగా వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగామని మోదీ చెప్పారు. పలు దేశాల జనాభా అంతా కలిపితే ఎంతో భారత్ జనాభా అంతని అన్నారు. మార్చి ప్రారంభంలో ఇండియాతో సహా చాలా దేశాల్లో పరిస్థితి దాదాపు ఒకేలా ఉందని చెప్పారు. అయి ఎతే, భారత్ లో సకాలంలో చర్యలు తీసుకోవడంతో ఎందరో ప్రాణాలను కాపాడగలిగామని అన్నారు. ఇంతమాత్రంతో సరిపోదని, వైరస్ ప్రమాదం పై నిరంతర నిఘా చాలా అవసరమని ప్రధాని ఉద్ఘాటించారు. ‘ప్రస్తుత పరిస్థిత్లో ప్రతి ఒక్కరూ శీఘ్రగతిన స్పందించడం ముఖ్యం. చాలా మంది ప్రజలు దగ్గు, జలులు, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందిస్తున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం’ అని ప్రధాని అన్నారు. సాంకేతికతను సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని, కోవిడ్ 19 పై సమర్ధ పోరాటానికి ఊతం ఇస్తూ ఆరోగ్య సేతు యాపను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ పై పోరాటంలో ప్రజలు కూడా యూనివర్శిటీలతో భాగస్వాములై కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలకు బాసటగా నిలబడాలన్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేయండి.. హాట్ స్పాట్ లు, రెడ్ స్పాట్ ల విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలని కూడా ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు. విదేశాల్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చే అంశం పై ప్రధాని మాట్లాడుతూ, ఇందువల్ల ప్రవాస భారతీయులకు ఎదురయ్యే ఇబ్బందులు, వారి కుటుంబాలు రిస్క్ లో పడే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన అనంతరం ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ జరపడం ఇది నాలుగోసారి. గతంలో మార్చి 20, ఏప్రిల్ 2, ఏప్రిల్ 11 తేదీల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ లు జరిగాయి. మరో వారంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ముగియాల్సి ఉన్నందున సోమవారంనాడు మరోసారి మోదీ ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో అన్నట్లు సమాచారం. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్ స్పాట్ ప్రాంతాలు, కొత్తగా బయట పడుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. దేశంలో కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అంశం పై హెూంమంత్రి అమిత్ షాతో కలిసి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మొత్తం 9 మంది సీఎంలు ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. లా డౌన్ ముగింపునకు ఐదుగురు సీఎంలు మొగ్గు చూపగా.. పొడిగించాలని నలుగురు సీఎంలు కోరినట్లు సమాచారం. పరిస్థితులను సమీక్షించి మే 3 తర్వాత లా డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎంలతో ప్రధాని అన్నట్లు సమాచారం. అయితే కొవిడ్ ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పరిస్థితి సమీక్షించి మినహాయింపులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా ప్రణాళికలను తయారు చేయాలని ప్రధాని సీఎంలకు సూచించారు. గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్ల వారీగా ఈ ప్రణాళికలు ఉ ండాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి ఎక్కువ, తక్కువగా ప్రాంతాలను జోన్ల వారీగా విడదీసి ముందుకెళ్లాలని మోదీకి సూచించారు. గ్రీజోన్లలో పూర్తి సడలింపు ఇచ్చి.. రెడ్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగించాలని కొందరు ముఖ్యమంత్రులు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చర్యలు తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే లాక్ డౌక్ కారణంగా ఆదాయ మార్గాలు పూర్తిగా మూతపడటంతో.. రాష్ట్రాలకు ఆర్థిక ఉద్దీపన నిధులివ్వాలని ప్రధాని మోదీని కోరారు. ఆర్థికంపై ఆందోళనొద్దు కరోనా పై పోరుకు మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావం చూపుతున్నాయని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. లాక్ డౌన్ ప్రభావం చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. వేలమందిని రక్షించడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యమని, నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉపాధి హామీ, కొన్ని పరిశ్రమలు పనులు ప్రారంభమయ్యాయని, ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందొద్దని సూచించారు. మన ఆర్థిక వ్యవస్థ బాగుందని ఈ సందర్భంగా సీఎంలతో పేర్కొన్నట్లు సమాచారం. కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం ఇక వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. లా డౌన్లో సానుకూల ఫలితాలు వచ్చాయని అన్నారు. ‘లాక్ డౌన్ కారణంగా వేల మంది ప్రాణాలను కాపాడుకోగలిగాం. తక్షణ స్పందన మన లక్ష్యం కావాలి. దో గజ్ దూరీ (2 గజాల దూరం) మంత్రం కావాలి. కరోనాతో పోరు కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వాలి. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం కనిపిస్తుంది. అందుకే మాస్కులు, ఫేస్ కవర్లు జీవితంలో భాగం కావాలి. దేశం ఇప్పటికే 2 లాక్ డౌన్లు చూసింది. ఇక ముందు ఏం చేయాలన్న విషయం పై దృష్టి పెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానం ఉ పయోగించుకుంటూ సంస్కరణలు తీసుకురావాలి. హాట్‌స్పాట్ – రెడ్ జోన్లలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలి. రెడ్ జోన్లను ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషి చేయాలి’ అని అన్నారు.