సారా ఏరులై పారుతుందన్న

స్పీకర్ వ్యాఖ్యలపై స్పందించాలి ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు

అమరావతి,జ్యోతిన్యూస్ : లాక్ డౌన్ విధించినప్పటికి రాష్ట్రంలో సారా ఏరులై పారుతోందన్న స్పికర్ వ్యాఖ్యల పై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఏపి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. దీనికి ఎక్సైజ్ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తు తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అవసరమయిన నిత్యవసరాలు దొరకడం కష్టంగా ఉంటే మద్యం మాత్రం వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా పై ప్రజలకు భరోసానిస్తుంటే జగన్ మాత్రం తాడేపల్లికే పరిమితమయ్యారన్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటికి రాష్ట్రంలో క్వారంటైన్ కేంద్రాలలో కూడా పోలింగ్ బూత్ లు ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించేలా ఉన్నారని విమర్శించారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చాలామంది ఉఫాదికోల్పోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాబట్టి ఈ సమయంలో పంతాలు పట్టింపులకు పోకుండా అన్న క్యాంటిన్లు తెరచి పేదల ఆకలి తీర్చాలని విజ్ఞప్తి చేశారు.