పంచాయతీ వ్యవస్థతోనే ప్రజాస్వామ్యం బలో పేతం

ఎంపికచేసిన సర్పంచులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ 

  • కరోనా కట్టడి పై సర్పంచులనుంచి ఆరా
  • కరోనా కట్టడిలో సర్పంచులదే కీలక పాత్ర
  • సర్పంచులను అభినందించిన మోదీ
  • కరోనా పై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలి
  • రహదారులు, పారిశుధ్యం పై చర్యలు తీసుకోవాలి
  • కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది
  • మెరుగైన పనితీరును కల్పించిన గ్రామ పంచాయతీలకు అవార్డులు
  • ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తాం 

న్యూఢిల్లీ: పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తల పై సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు ఎనలేని కృషి చేస్తున్న సర్పంచులకు ధన్యవాదాలు తెలిపారు. మెరుగైన సేవలు అందించి పురస్కారాలు పొందిన సర్పంచులకు అభినందనలు తెలిపారు. ఏటా మెరుగైన పనితీరు కనబర్చిన గ్రామపంచాయతీలకు పురస్కారాలు అందిస్తామని మోదీ ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు సరిపడా ఆహారధాన్యాలు అందించాలని సూచించారు. విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు. “గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఎంతో కృషి చేస్తోంది. పంచాయతీ వ్యవస్థ ఎంత బలపడితే ప్రజాస్వామ్యం అంతగా బలపడుతుంది. ప్రస్తుతం లక్షా 25వేల పంచాయతీల్లో బ్రాండ్ బ్యాండ్ సేవలు అందుతున్నాయి. కరోనా మహమ్మారి మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. కష్ట సమయంలో ఆత్మ సైర్యంతో ఉండాలి. ఈ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలి. మనం వెళ్లే దారిలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. కరోనా పై గ్రామ ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాలి” అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్ ను ప్రధాని ప్రారంభించారు. స్వీయ నిర్బందంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో ఆత్మ ఫైర్యంతో ఉండాలని ప్రధాని సూచించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, ఇతరులపై మనం ఆధారపడకూడదని, స్వయం సంవృద్ధి సాధించాలని అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్ ను ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ గ్రామాల్లో సుపరిపాలన కోసం పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంతో ఉ పయోగపడుతుందన్నారు. కరోనా కట్టడికి తమవంతు కృషి చేస్తున్న అందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో విద్యుత్, రహదారులు, పారిశుద్ధ?్యం పై చర్యలు చేపట్టాలని, అలాగే కరోనా వైరస్ నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో అలాగే పేదలకు ఆహార సదుపాయాలు అందించాలని కోరారు. మెరుగైన పనితీరు కలిగిన గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. రైతు రాజ్యం ..ఆదరణ పూజ్యం రైతు పండించిన ప్రతి విత్తునూ కొంటాం. ప్రతి గింజకూ కనీస మద్దతు ధర కల్పించి తీరతాం’ అని ప్రభుత్వాధీశులు అదే పనిగా వర్ణించగా, ఆచరణలో మాటలన్నీ గాలిలో పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు తయారయ్యాయి. రైతు రాజ్యం అని భుజకీర్తులు తగిలించుకున్న వైసిపి ప్రభుత్వంలోనూ ఎప్పటికిమల్లే వరి ధాన్యం పండించిన అన్నదాతలకు ‘మద్దతు’ ధర దక్కలేదు. ఒకవేళ మద్దతు ధరకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసినా సకాలంలో పైకం చెల్లించలేదు. ధాన్యం ఇచ్చిన రైతులు రోజులు, నెలల పర్యంతం రొక్కం కోసం నిరీక్షించాల్సిన దుర్గతి దాపురించింది. రూపాయికి కిలో బియ్యం, అంత్యోదయ, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇత్యాది సంక్షేమ పథకాల కోసం పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తుంది. రైతులకు మద్దతు ధర, ప్రభుత్వ పథకాలకు కావాల్సిన బియ్యం సేకరణ ప్రభుత్వ బాధ్యత. దానిలో భాగంగానే రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, మార్కెట్ యార్డులు, నోటి ఫై చేసిన ప్రైవేటు ధాన్యం మిల్లులను అధికారిక ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ప్రతి ఏడాదికి లాగానే ఈ మారు కూడా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1,710 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 41 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొన్నది. రూ.7,400 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటే, రూ.5,300 కోట్లు, అదీ ఎలాగొలా అందించగలిగింది. ఇంకా రూ.2 వేల కోట్లకు పైగా బకాయి పడింది. రైతు ధాన్యం అమ్ముకున్న 48 గంటల్లో నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్ లో సొమ్ము జమ చేస్తామన్న ప్రభుత్వ హామీని నమ్మిన అన్నదాతలు సర్కారీ కొనుగోలు కేంద్రంలో కచ్చితంగా మద్దతు ధర లభిస్తుందన్న ధీమాతో ధాన్యాన్ని ఇచ్చారు. 48 గంటలు కాదు 48 రోజులకు కూడా దబ్బు అందకపోతే రైతులు ఏం ఆలోచిస్తారు? మద్దతు ధర రాకపోయినా వెంటనే డబ్బులిచ్చే ప్రైవేటు వ్యాపారుల వంక చూడరా? ఈ చర్య ప్రభుత్వమే దళారులను ఆశ్రయించి నష్టపోవాలని రైతులను ప్రోత్సహించడం కాదా? ఈ తడవ ఖరీఫ్ ను అతివృష్టి, అనావృష్టి, వరదలు మూకుమ్మడిగా దెబ్బతీశాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి నీరు రావడంతో గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాల్లో, వంశధార పరీవాహక ప్రాంతంలో వరి సాగైంది. ఖరీఫ్ చివరిలో కురిసిన వానలు పంటలకు అనుకూలించాయి. అన్ని అవాంతరాలనూ దాటుకొని రైతులు ధాన్యాన్ని పండిస్తే, గిట్టుబాటు సంగతేమో సర్కారు ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎపి) సైతం దక్కని దారుణం నెలకొంది. ఒక క్వింటాలు ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి స్వంత భూమి కలిగిన రైతుకు తక్కువలో తక్కువ రూ.2,400 ఖర్చవుతుందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అదే కౌలు రైతుకైతే ఖర్చు రూ.3 వేలు. ప్రాంతానికీ, ప్రాంతానికి ఈ ఖర్చు మారుతుంది. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ఉత్పత్తి వ్యయానికి యాభై శాతం కలిపి ఎంఎస్ పి ప్రకటిస్తే కనీసం రూ.3,600 అవుతుంది. కానీ కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రకటించింది. సాధారణ రకానికి రూ.1,815, ఫైన్ రకానికి రూ.1,835. ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరగ్గా, నిరుటికి ఈ ఏటికి ఎంఎపి పెరిగింది కేవలం రూ.65. కాగా తాము రైతులకు ప్రత్యేకంగా మద్దతు ధరలు ప్రకటిస్తామన్న వైసిపి సర్కారు, కేంద్ర ధరలనే అమలు చేస్తోంది. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలు క్వింటాలుకు అదనంగా రూ.నాలుగైదొందల బోనస్ ఇస్తుండగా ఇక్కడ అదేం లేదు. సర్కారు తన హామీ మేరకు ఎంఎస్ పి అయినా రైతులకు ఇప్పించిందా అంటే అదీ లేదు. కొనుగోలు కేంద్రాలు తెరవడం మినహా సరైన సన్నద్ధత లేదు. సిబ్బంది లేరు, నిధుల్లేవు, తేమ శాతం కొలిచే యంత్రాల్లేవు, గోనె సంచుల్లేవు, ధాన్యం ఆరబోసుకోడానికి పట్టాల్లేవు. పైగా కొనుగోలు కేంద్రాలన్నీ మిల్లర్లు, దళారుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దీనికి తోడు ఆలస్యంగా సొమ్ము చెల్లిస్తుండటంతో రైతులు చాలా వరకు అయిన కాడికి కళాల్లో, ఇంటి వద్దనే వ్యాపారులకు తెగనమ్ముకున్నారు. రైతువారీగా 77 కిలోల బస్తాకు ఎంఎస్ పి రూ.1,370 రావాల్సి ఉండగా రూ.వెయ్యి, 1,100 రావడం గగనమైంది. కొంతమందే కొనుగోలు కేంద్రాల దాకా వెళ్లారు. ఇప్పుడు ప్రభుత్వం బకాయిపడ్డ సొమ్ములో అత్యధిక భాగం రైతుల పేరుతో వ్యాపారులవే. ఖరీఫ్ లో 79 లక్షల టన్నుల ధాన్యం లభిస్తుందని ప్రభుత్వ రెండవ ముందస్తు అంచనా వెల్లడించింది. పౌర సరఫరా లెక్కల మే రకు 41 లక్షల టన్నులు కొన్నారు. ఉత్పత్తిలో సగానికి సగం ధాన్యం రైతుల వద్దనైనా ఉండాలి. లేదంటే వ్యాపారులకు తెగనమ్ముకొనైనా ఉండాలి. ఉత్పత్తికి, కొనుగోలుకు మధ్య ఇంత వ్యత్యాసం ఉండగా, ప్రతి విత్తు కొన్నామని, ప్రతి గింజకు ఎంఎస్ పి దక్కిందని ప్రభుత్వం ఎలా చెబుతుంది? ప్రజలకు రేషన్లో సన్న బియ్యం ఇస్తామన్న సర్కారు, అంతలోనే నాణ్యమైన బియ్యం అని నాలుక మడత పెట్టింది. ప్రభుత్వ భరోసాతో సన్న బియ్యం రకాలను పండించిన రైతుల పరిస్థితి ఏం కావాలి? ఇన్ని వైఫల్యాలు పెట్టుకొని రైతులకు ధర, రొక్కం చెల్లింపుల పై అధికారులను బాధ్యులను చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి. పాలకులు మారినా అన్నదాతల అగచాట్లు తీరవా? ప్రభుత్వాలు మారినా రైతుల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం? రైతన్నకు అన్నీ కష్టాలే. సాగుబడి నుంచి మొదలెడితే.. ధాన్యం అమ్మిన సొమ్ము చేతికందే వరకూ వారు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. అన్ని కష్టాలను అధిగమించి పండించిన పంటను అమ్ముకుంటే వచ్చిన సొమ్ము అక్కరకు రాకుండా బ్యాంక్ ఖాతాలో మూలుగుతోంది. నగదు కొరత కారణంగా బ్యాంక్ ల నుంచి డబ్బులు తీసుకోలేని పరిస్థితి ఉంది. సాగుబడి ఖర్చులు, వరికోత, హమాలీ ఛార్జీలు చెల్లించడం, కనీస అవసరాలకు ఉపయోగపడని పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. ఈ యాసంగి సీజన్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు నేరుగా ఆయా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నాయి. బహిరంగ మార్కెట్ లో విక్రయించిన రైతులకు కూడా నగదు కొరతతో మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లు చెక్కులు మాత్రమే ఇస్తున్నారు. ఖాతాలో డబ్బులు జమవుతున్నా బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో చాలిచాలని డబ్బులు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పలు ప్రాంతాల్లో మినహా ఉమ్మడి నల్గొండ జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధాసంగా యాదాద్రి భుపసగిరి జిల్లాలో సగదు ఖాళీ అయింది. పింఛన్, ఉపాధిహామీ కూలీలకు కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో బ్యాంకర్లు ఉన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు రూ.కోట్లలో చెల్లించాల్సి ఉంది. యాదాద్రి భువనగిరితోపాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కొనుగోలు సంస్థల్లోనే రోజూ వేల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 30 వరకు నల్గొండ జిల్లాలో 148 కేంద్రాల ద్వారా రూ.313 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రూ.160 కోట్లు ఆయా రైతుల అకౌంట్లలో జమ చేశారు. సూర్యాపేట జిల్లాలోనూ 107 కేంద్రాల్లో రూ.145 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలుచేసి రూ.65 కోట్లు జమ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.98 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.30.63 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. కొనుగోలు, చెల్లింపులు కొంత మేరకు సాఫీగానే జరుగుతున్నా చిక్కంతా నగదు కొరతతోనే వచ్చింది. నగదు చేతికి రాకపోవడంతో పంట అమ్మిన రైతులకు సంతోషం లేకుండా పోయింది. వారి ఖాతాలన్నీ దాదాపు గ్రామీణ, సహకార బ్యాంకుల్లోనే ఉన్నాయి. వీటిల్లోనే నగదు కొరత తీవ్రంగా ఉంది. బ్యాంకర్లు ఒక్కోచోట రూ.10వేల నుంచి రూ.50వేల వరకు మించి ఇవ్వడం లేదు. రోజు నగదు జమ అధికంగా ఉన్న బ్యాంకుల్లో మాత్రం రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. మధ్యతరహా, పెద్ద రైతులకు మాత్రం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో చెల్లింపుల సంక్షోభం తీవ్రంగా ఉంది. భువనగిరి పట్టణంలోని ఎస్ బీఐ లాంటి చెస్ట్ బ్యాంక్ లోనే గరిష్ఠంగా రూ.20వేలకు మించి చెల్లించని పరిస్థితి నెలకొంది. మండల కేంద్రాల్లో రూ.10వేలకు మించి ఇవ్వడంలేదు. ఆలేరు, అడ్డగూడూరు, మోత్కూర్ ప్రాంతాల్లో రైతులు తమ బ్యాంకుల్లో జమైన సొమ్మును తీసుకునేందుకు రోజూ చక్కర్లు కొడుతున్నారు. పండించడం, అమ్ముకోవడం ఒక ఎత్తయితే.. సొమ్ము చేసుకోవడం అంతకు మించిన భారమవుతోంది. వరికోత యంత్రాలు, హమాలీ ఛార్జీలు, పెట్టుబడి డబ్బులు ఎలా చెల్లించాలి, వ్యక్తిగత అవసరాలు ఎలా తీర్చుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చెక్కుల ద్వారా చెల్లింపులు చేసుకొమ్మని బ్యాంకర్లు ఇస్తున్న సలహాలపై రైతులు మండిపడుతున్నారు. ఖాతా నిర్వహణే కష్టమైన పరిస్థితుల్లో చెక్కులు ఎలా ఇవ్వగలమని ప్రశ్నిస్తున్నారు. కనీసం ప్రభుత్వ సంస్థల్లో ధాన్యం విక్రయించిన రైతులకు అమ్మిన మొత్తానికి ఒకే దఫాలో మొత్తం డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.