పాలమూరుకు కర్నూలుతో పొంచివున్న ప్రమాదం

ఇప్పటిదాకా అన్నీ బాగానే ఉన్నా ఏపీలో దడపుట్టిస్తున్న కర్నూలు కేసులు

  • 14 రోజులుగా నమోదు కాని కొత్త కేసులు
  • కట్టడి ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు
  • 9 తర్వాత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం
  • ఏపీలోని కర్నూలు కు పూర్తిగా రాకపోకలు కట్
  • ఇప్పటిదాకా ఆరెంజ్ జోన్లోనే ఉన్న జిల్లా
  • కేసులు నమోదైన ప్రాంతాలలో ఇళ్లకే నిత్సావసరాలు
  • రహస్య మార్గాల ద్వారా కర్నూలుకు వెళుతున్న ప్రజలు
  • సరుకుల కొనుగోళ్ల హెూల్ సేల్ సెంటర్ కావడంతో డిమాండ్ తెలంగాణ 

మహబూబ్ నగర్: పాలమూరులో కరోనాను కట్టడి కట్టుదిట్టంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.. 14 రోజుల క్రితం ఒక కేసు నమోదైంది. అప్పటినుంచి కొత్త కేసు నమోదు కాలేదు.. కట్టడి ప్రాంతాల పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రైమరీ, సెంకెండ్ కాంటాక్ట్ లను క్వారంటైన్, హెూం క్వారంటైన్ చేయడంలో అధికార యంత్రాంగం సక్సెస్ అయింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు జడ్చర్ల పరిధిలో కాగా, తొమ్మిది జిల్లా కేంద్రంలో నమోదయ్యాయి. ఈ నెల 9న చివరి కేసు నమోదైంది. జిల్లాలో ఆరు కట్టడి ప్రాంతాలను గుర్తించారు. ఆరెంజ్ జోన్లో జిల్లాను చేర్చగా, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రెమారాజేశ్వరి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ లాక్ డౌనను సమర్ధవంతంగా నిర్వహించడంం కారణంగా కొత్త కేసులు నమోదు కావడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. మరికొద్ది రోజులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడం వల్ల కొత్త కేసులు నమోదు కాకపోతే జిల్లా గ్రీన్ జోన్ లోకి వెళ్లే అవ కాశాలున్నాయి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నుంచి తెలంగాణకు కరోనా వ్యాప్తి చెందుతున్నది. తెలంగాణ సరిహద్దులోని ఈ ఒక్క జిల్లాలోనే 234 పాజిటివ్ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్ వద్దకు వెళ్లి వచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడికి కూడా వైరస్ పాజిటివ్ గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆర్ఎంపీతో కాంటాక్ట్ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కర్నూలులో కరోనా పాజిటివ్ వచ్చిన మరో వైద్యురాలి వద్దకు చికిత్సకోసం వెళ్లిన వారికి కూడా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇలా వైద్యం కోసం వెళ్లినవారు ఇంకా కొంతమంది ఉన్నట్టు సమాచారం ఉండటంతో వారికోసం అధికారులు గాలిస్తున్నారు. మొత్తం ఐదుగురికి కర్నూలు నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అదే సమయంలో కర్నూలు నుంచి తెలంగాణకు వైరస్ వ్యాప్తి చెందినట్టు అక్కడి అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ పేర్కొన్నారు. ప్రజల వద్దకు నిత్యావసరాలు… – జనాలను బయటకు రాకుండా చేయడం, ఉదయం 10 గంటల తరువాత దుకాణాలు మూసివేయడం, రోడ్ల పైకి వచ్చే వాహనదారులపై చర్యలు తీసుకోవడం, భౌతిక దూరం పాటించేలా వ్యాపారులకు, ప్రజలకు అవగాహ న కల్పించడం వంటి చర్యల కారణంగానే కేసుల ఆగిపోయాయన్న విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా కట్టడి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా వేయడం, ఈ ప్రాంతాల్లో బ్లీచింగ్, నిరంతరం సోడియం హైపో క్లోరైడ్ లో ప్లే చేయడం వంటి చర్యలు ఫలితాలిస్తున్నాయి. ఇక జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా వారి వద్దకే నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు సరఫరా చేస్తున్నారు. వాహనాలకు మైళ్లు పెట్టి వాటి ద్వారా కట్టడి ప్రాంతాలకు సరుకులు పంపించడం, టెలి మెడిసిన్ విధానం ద్వారా అత్యవసరం అయిన వారికి మందులు ఇవ్వడం, వైద్యం అందించడం, ఎం3 ఫ్రెష్ విధానం ద్వారా ఆర్డర్ చేసిన వారికి నేరుగా వెళ్లి కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు అందజేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు కట్టడి ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పర్యవేక్షించడంతో పాటు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా వలస కార్మికులను గుర్తించి వారిని క్వారంటైన్ చేయడంతో పాటు వారికి భోజనం, సరుకులు అందజేస్తూ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో క ృషి చేయడం సత్ఫలితాలనిస్తోంది. సరిహద్దులు దాటుతున్న జనం కరోనా వ్యాప్తి నివారణకు 25 రోజుల కిందటే సరిహద్దులను మూసివేశారు. మన రాష్ట్రంలోని అలంపూర్ ప్రాంతానికి చెందిన వారంతా సరుకులు, వ్యాపారాల నిమిత్తం కర్నూలుకే వెళ్లివస్తుంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సరిహద్దులు మూసివేసినా నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల కోసం వ్యాపారులు అక్కడికే వెళ్లి తీసుకొస్తున్నారు. కర్నూలులో ఎక్కువగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నా వ్యాపారులు మాత్రం ఆగడం లేదు. మరోవైపు తుంగభద్ర తీరం వెంట కొన్ని నడకదారులు, బండ్ల దారులున్నాయి. పోలీసులు రహదారులపై నిఘా పెంచి, మూసివేస్తే చాలామంది అడ్డదారుల్లో వెళ్తున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రైవేట్ దవాఖానల నుంచి వ్యాప్తి? కర్నూలులోని ఓ ప్రైవేట్ దవాఖాన నిర్వాహకుడైన ఇస్మాయిల్ ఇటీవల కరోనాతో మృతిచెందాడు. ఆయన వద్దకు ఈ మధ్యే రాజోలికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వెళ్లి వచ్చారు.