రైతు సమస్యల పై ఉపవాస దీక్ష
గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్
హైదరాబాద్: రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఉపవాస దీక్ష చేపట్టారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పట్టకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఐకేపీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. దళారీ వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని, అధికారులే దళారీలుగా మారారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. సిరిసిల్లలో రైతులు ధాన్యాన్ని తగుటబెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ నింబంధనలు పాటిస్తూ నిరసన తెలిపినా రైతులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంఘీభావంగా సాయంత్రం 5గంటల వరకు ఉపవాస దీక్ష చేయనున్నట్లు బండి సంజయ్ తెలిపారు.