కొనసాగుతున్న ఉధృతి
భారత్ లో 21వేల కేసులు, 681 మరణాలు,, 24 గంటల్లో 41 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1409 పాజిటివ్ కేసులు నమోదవడంతోపాటు 41మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,393కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 681మంది మ త్యువాతపడ్డారు. మొత్తం బాధితుల్లో 4258మంది కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 16,454మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకుంటున్నవారి శాతం 19.36గా ఉందని ప్రభుత్వం తెలిపింది. గత కొన్ని రోజులులగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్ లలో వైరస్ విజృంభణ… మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరతో 269మంది మృత్యువాతపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 5652కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గుజరాత్ లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ ఈ వైరస్ బారినపడి 103మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 2407కి చేరింది. మధ్యప్రదేశ్ లోనూ కరోనాతో 80మంది మరణించారు. దిల్లీలో కరోనా వైరస్లో మొత్తం 48మంది మ రణించారు. కేసుల సంఖ్య 2248కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన తీవ్రత… ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతూనే ఉంది. నిన్న 60 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 821కి చేరింది. మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో 24మంది మరణించారు. ఇక తెలంగాణలో నిన్న 15 కేసులు నిర్ధారణ కాగా మొత్తం కేసుల సంఖ్య 943కి చేరింది. ఈ వైరస్ బారినపడి 23మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 194మంది కోలుకున్నారు.