అమెరికాకు పొంచివున్న మరో ముప్పు
కరోనా వైరసకు తోడు ఫ్లూ కూడా వ్యాపించే అవకాశం: సీడీసీ డైరెక్టర్
వాషింగ్టన్: ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతమంది బాధితులు లేరు. ఇదిలా ఉండగా, రాబోయే రోజుల్లో అమెరికాలో వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అక్కడి వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) డైరెక్టర్ రాబర్డ్ రెడ్ ఫీల్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న శీతాకాలంలో వైరస్ విజృంభించే ప్రమాదముందని, దీంతోపాటు ఫ్లూ కూడా విస్తరించే ముప్పు పొంచి ఉందన్నారు. కాగా అమెరికాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 1738 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. బుధవారం 2,751 మంది మ తిచెందిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజుల వ్యవధిలో అగ్రరాజ్యంలో కరోనా మృతుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటం స్వల్ప ఊరటనిచ్చింది. ఇప్పటి వరకు ఆ దేశంలో 8,52,703 మంది వైరస్ బారిన పడగా, 47,750 మంది మృతిచెందారు. జార్జియా గవర్నర్‌ను సమర్థిస్తూనే ట్రంప్ విమర్శలు… కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌనను సడలించే క్రమంలో జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు విమర్శలు చేశారు. శ్వేతసౌధంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ‘ జార్జియా గవర్నర్‌కు ఏది సరైంది అనిపిస్తే అది చేయొచ్చు, అయితే.. అతను తీసుకున్న పలు నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’ అని ట్రంప్ అన్నారు. జార్జియా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపర్చడానికి లాక్ డౌన్ ఆంక్షలను సడలించే క్రమంలో గవర్నర్ కెంప్ తొలి దశలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్పాలు, బ్యూటీపార్లర్లు, హెయిర్ సెలూన్లు, టాటూ కేంద్రాలను తెరిచేందుకు అనమతించారు. దీంతో తొలి దశలోనే ఆయా కేంద్రాలను తెరవడం సరైంది కాదని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు కొత్త కరోనా పేషంట్లకు పరీక్షలు జరపడానికి రాష్ట్రం ఇబ్బంది పడుతోంది. అలాగే బాధితులు ఎవరెవర్ని కలిశారో గుర్తించడంలోనూ విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో జార్జియాలో ఆంక్షలను సడలిస్తే వైరస్ తీవ్రత మరింత పెరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జార్జియాలో ఇప్పటివరకు 21 వేల మంది వైరస్ బారిన పడగా, 836 మంది మ తిచెందారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మున్ముందు మరింత ఎక్కువగా కల్లోలం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న శీతాకాలంలో తమ దేశంలో వైరస్ ఇంకా విజృంభించే ముప్పుందని.. దానికి ఫ్లూ కూడా తోడై పరిస్థితులు భయానకంగా మారొచ్చని అమెరికాలోని ‘వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) డైరెక్టర్ రాబర్డ్ రెడ్ ఫీల్డ్ తాజాగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మరోవైపు, అమెరికాలో నిషేధాల సడలింపు అంశం పూర్తిగా రాజకీయ రంగును పులుముకుంటోంది. దేశాధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు రిపబ్లికన్ గవర్నర్లు ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నారని, డెమోక్రాట్ల నేతృత్వంలోని రాష్ట్రాల్లో మాత్రం గవర్నర్లు నిషేధాజ్ఞలను మరింత కఠినతరం చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. లాక్ డౌనన్ను సడలించాలంటూ ట్రంప్ మద్దతుదారులు నిరసనలు కొనసాగిస్తున్నారు. వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు జన సంచారం పై ఆంక్షల సడలింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. అమెరికాలో కొవిడ్ బాధితుల సంఖ్య 8.2 లక్షలు దాటింది. ఆ దేశంలో ఇప్పటికే 46 వేలమందికి పైగా ప్రాణాలను మహమ్మారి బలి తీసుకుంది. రానున్న శీతాకాలంలో కరోనాతోపాటు ఫ్లూ ఏకకాలంలో విజృంభించే ముప్పుందని రెడ్ ఫీల్డ్ తెలిపారు. ఫలితంగా దేశ ఆరోగ్య వ్యవస్థ పై ఊహకందని స్థాయిలో ప్రతికూల ప్రభావం పడొచ్చని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదేందుకుగాను దాదాపు 50 వేల కోట్ల డాలర్ల ప్యాకేజీకి సెనేట్ తాజాగా ఆమోదం తెలిపింది. ఆస్పత్రుల్లో మెరుగైన వసతుల కల్పనకు, కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేసేందుకు కూడా ఈ నిధులను ఉపయోగించనున్నారు. తమకు వ్యక్తిగత రక్షణ పరికరాలను సమకూర్చాలని కోరుతూ శ్వేతసౌధం వద్ద పలువురు నర్సులు తాజాగా నిరసనకు దిగారు. అంతకంటే ముందు నుంచే విజృంభణ అమెరికాలో కరోనా విజృంభణ గతంలో ఊహించినదానికంటే చాలా ముందుగానే మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఆ దేశంలో ఈ వైరస్ దెబ్బకు తొలి మరణం ఈ ఏడాది ఫిబ్రవరి 29న వాషింగ్టన్‌లో నమోదైందని ఇన్నాళ్లూ భావించారు. అయితే- కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలో అదే నెల 6, 17 తేదీల్లో మరణించిన ఇద్దరు వ్యక్తులకు కూడా కరోనా ఉందని తాజాగా అధికి ప్రకటించాయి.