రాష్ట్రపతి భవన్లో కరోనా కలకలం

పారిశుధ్య కార్మికురాలి నుంచి విస్తరణ..ఐసోలేషన్లో 125 కుటుంబాలు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. అక్కడ పని చేసే పారిశుద్ధ్య కార్మికురాలి కోడలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రపతి భవన్లోని ఓ కాంప్లెక్స్ లోని 125 కుటుంబాలను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంచారు. ఆ కాంప్లెక్స్ ను శానిటైజ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికురాలి కోడలి తల్లి ఇటీవలే కరోనాతో మృతి చెందింది. దీంతో కార్మికురాలి కోడలు.. తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నది. ఈ క్రమంలో కోడలికి కరోనా సోకింది. ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. నాలుగు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కోడలు నివాసముంటున్న ఇంటితో పాటు ఆ కాంప్లెక్స్ ను అధికారులు సీజ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ రాష్ట్రపతి భవన్ వర్గాలే ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ 125 కుటుంబాలు బయటకు రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకొచ్చారు? కేంద్ర బృందాలకు షాక్ ఇచ్చిన మమత సర్కార్ న్యూఢిల్లీ: పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంతో ఢీకొంటున్నట్టే కనిపిస్తున్నారు! లాక్ డౌన్ అమలును పర్యవేక్షించేందుకు కోల్ కతాకు వచ్చిన కేంద్ర బ ఎందాలను క్షేత్రస్థాయికి వెళ్లనివ్వడం లేదని తెలుస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ సరిగ్గా అమలు కావడం లేదని, ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నగరాల్లో లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించేందుకు అంతర్ మంత్రిత్వ బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రకు పంపించింది. కాగా తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ లోనూ కేసులు పెరుగుతుండగా తమ రాష్ట్రంలోనే ఎందుకు పంపిచారో వివరణ ఇవ్వాలని ప్రధాని మోదీ, హెూం మంత్రి అమిత్ షోను మమత డిమాండ్ చేశారు. అప్పటి వరకు సహకరించబోమని బెదిరించారు. ‘ఈ రోజు మేం పర్యటించేందుకు సహకరిస్తామని మాటిచ్చారు. ఈ రోజేమో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. మమ్మల్ని బయటకు రానివ్వడం లేదు’ అని కోల్ కతా పర్యటన బృందానికి నేతృత్వం వహిస్తున్న అపూర్వ చంద్ర అన్నారు. ‘కేంద్ర బృందాలు ఇతర రాష్ట్రాలకూ వెళ్లాయి. వారికి పూర్తి సహకారం లభించింది. పశ్చిమ్ బెంగాల్ కు ఇచ్చినట్టే వారికీ నోటీసులు ఇచ్చారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులూ లేవు’ అని ఆయన మీడియాకు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లో లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తున్నారని నివేదికలు అందాయని ఇంతకుముందే కేంద్రం ఆ రాష్ట్రానికి రెండుసార్లు లేఖలు రాయడం గమనార్హం.