మీడియాకు పాకిన కరోనా
చెన్నై ఛానల్ లో పనిచేస్తున్న సిబ్బందిలో 27 మందికి పాజిటివ్
చెన్నై : తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో విధులు నిర్వర్తిస్తున్న 27 మంది జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. న్యూస్ ఛానల్ లో రిపోర్టర్లతోపాటూ డెస్క్ లో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఎడిటర్లకు కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. 24 ఏళ్ల జర్నలిస్ట్ కి కరోనా పరీక్షల్లో తొలుత పాజిటివ్ రావడంతో సదరు న్యూస్ ఛానల్ లో పని చేస్తున్న మొత్తం 94 మందికి కరోనా పరీక్షలు జరిపించారు. మంగళవారం వచ్చిన ఫలితాల్లో 26 మందికి కరోనా సోకినట్టు తేలింది.. తొలుత కరోనా వ్యాధి సోకిన 24 ఏళ్ల జర్నలిస్ట్ తండ్రి ఎన్ఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి సూచనల మేరకు కుటుంబం మొత్తం కరోనా పరీక్షలు చేపించుకోగా, జర్నలిస్టు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో న్యూస్ ఛానల్ లో పని చేస్తున్న మిగతా వారికి పరీక్షలు జరిపించగా 26 మందికి కరోనా పాజిటివ్ గా ఫలితాలు వచ్చాయి. దీంతో వెంటనే వారిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ముంబైలో కూడా రిపోర్టర్లు, కెమెరామెన్లు కలుపుకుని మొత్తంగా 53 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, తమిళనాడులో టీవీ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా రాష్ట్రాలు కూడా అలర్జెయ్యాయి. జర్నలిస్టులకు టెస్టులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ముంబైలో 171 మంది జర్నలిస్టులకు టెస్టులు నిర్వహించగా.. వారిలో దాదాపు 53 మందికి పాజిటివ్ వచ్చింది. అంతే కాకుండా తమిళనాడులో కూడా టీవీ జర్నలిస్టులు కూడా కరోనా బారినపడ్డారు. అసలు విషయం ఏంటంటే పాజిటివ్ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు లేనివారు కావడం మరింత కలవర పెడుతోంది. దీంతో ఒక్కసారిగా మీడియాలోకం ఉ లిక్కిపడింది. కరోనా నేపథ్యంలో ఇపుడు దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ప్రాణాలను ఫణంగా పెట్టి .. రోడ్ల పై విధులు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా వారందరికీ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ ఢిల్లీలో పని చేస్తున్న జర్నలిస్టులకు సామూహికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అటు కర్ణాటకలోనూ జర్నలిస్టులకు టెస్టులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.