ఇచ్చింది సడలింపులే..
లాక్ డౌన్ అమలులోనే ఉంది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో కొవిడ్ నియంత్రణలోనే ఉందని కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మినహాయింపులు నేటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కిషన్ రెడ్డి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొవిడ్ విషయంలో ప్రజలు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కూలీలు, కార్మికుల ఒత్తిడి దృష్ట్యా కంటైన్మెంట్, రెడ్ జోన్, హాట్ స్పాట్ లేని ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇచ్చినట్లు చెప్పారు. సడలింపులు ఇచ్చినా లాక్ డౌన్ లక్ష్యాలను ప్రజలు గుర్తించాలని.. అదేవిధంగా సడలింపులు ఇచ్చిన ప్రాంతాల్లో ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని కోరారు. అదేవిధంగా పంట కోతలు ఉ న్నప్పుడు నరేగా పనులు ఇవ్వడానికి వీల్లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ కార్మికులను పంట కోతలకు ఉ పయోగించుకోవాలని సూచించారు. 30 శాతం సిబ్బందితో కేంద్ర కార్యాలయాలు నడవాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.