తల్లీగీ జమాతే చీఫ్ పై హత్య కేసు నమోదు

ఏ క్షణమైనా అరెస్టుకు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సిద్ధం 

న్యూఢిల్లీ: తల్లీగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి కారకులయ్యారంటూ జమాతే పై కూడా ఐపీసీ 304 ప్రకారం హత్య కేసు నమోదు చేశారు. ఇప్పటికే మౌలానా సాద్ సెల్ఫ్ క్వారంటైన్ సమయం పూరైంది. దీంతో ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ సాదు పోలీసులు రెండు నోటీసులు పంపారు. ఢిల్లీ నిజాముద్దీన్లో గత నెలలో జరిగిన తల్లీగీ జమాతే మర్కజ్ సదస్సుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చినవారి నుంచి సదస్సులో పాల్గొన్న మిగతావారికి కరోనా సోకినట్లుగా అధికారులు తేల్చారు. అనేక రాష్ట్రాల్లో జమాతే సభ్యుల ద్వారా కరోనా వ్యాపించినట్లు గుర్తించారు. తల్లీగీ జమాతే కార్యాలయంలో తనిఖీలు చేసిన ఢిల్లీ పోలీసులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.