లాక్ డౌన్ సరే..నిరు పేదల సంగతి?

మోదీ ప్రకటన పై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం విమర్శలు

న్యూఢిల్లీ: లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేసిన వెంటనే కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చివరకు ప్రజల్ని వారిని వారే సంరక్షించుకోవాల్సిన స్థితిలో వదిలేశారని విమర్శించారు. లాక్ డౌన్ నిర్ణయానికి మద్దతునిస్తూనే.. ఆయన ఈ విమర్శలు చేయడం గమనార్హం. “తప్పనిసరి పరిస్థితుల్లో లా డౌన్ ని పొడిగించడాన్ని మేం అర్థం చేసుకోగలం. ఈ నిర్ణయానికి మేం మద్దతునిస్తున్నాం. కానీ, నిధుల కోసం ముఖ్యమంత్రులు చేసిన అభ్యర్థనను ఏమాత్రం పట్టించుకోలేదు. మార్చి 25న ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు. రాఘురాం రాజన్ నుంచి జీన్ డ్రెజ్, ప్రభాత్ పట్నాయక్ నుంచి అభిజిత్ బెనర్జీ వరకు.. అందరి సలహాల్ని పెడచెవిన పెట్టారు. 210 19 రోజుల పేదలు వారిని వారే రక్షించుకోవాల్సిన స్థితిలో వదిలేశారు. నిధులు, ఆహార ధాన్యాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం వేటినీ విడుదల చేయదు. ఇక నా దేశం ఏడవాల్సిందే” అని చిదంబరం ట్వీట్ చేశారు. లాక్ డౌన్ సంక్షోభం నుంచి పేదలు ఎలా బయటపడతారనే దాని గురించి ప్రధాని ఏమీ చెప్పలేదు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేసిన ఆర్థిక సాయం పై ఎలాంటి స్పందన లేదు. మార్చి 25న ప్రకటించిన ప్యాకేజీకి ఒక్క రూపాయి కూడా అదనంగా జోడించలేదని చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పర్యవసానంగా దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవన చర్యలేవీ మోదీ ప్రస్తావించలేదని నిరాశ వ్యక్తం చేశారు. రాష్ట్రాలు రుణాలు తీసుకుంటే, ఖర్చు చాలా ఎక్కువగా ఉ ంటుంది. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం, కేంద్రం అప్పు తీసుకొని రాష్ట్రాలకు రుణాలు ఇవ్వాలని చిదంబరం సలహా ఇచ్చారు. ఈ విషయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సహా, జీన్ డ్రేజ్, ప్రభాత్ పట్నాయక్, అభిజిత్ బెనర్జీ లాంటి ఆర్థిక నిపుణుల సలహాలేవీ ప్రధాని చెవికి చేరకపోవడం శోచనీయమన్నారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత అభి షేక్ మను సింఘ్వీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం బాగానే ఉ న్నా.. పేద, మధ్యతరగతి ప్రజల ఇక్కట్లను తొలగించేందుకు ఎలాంటి ప్రకటన లేకపోవడం విచారకరమన్నారు. తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగానికి ఎలాంటి ఊతమివ్వలేదని విమర్శించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం లాక్ డౌనను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ప్రజలు ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాలని కోరారు. కరోనా పై విజయం సాధించాలంటే మరికొంత కాలం సహనం వహించక తప్పదని స్పష్టం చేశారు. అలాగే అందరూ పాటించాల్సిన ఏడు సూత్రాలను సూచించారు.