ఆ విషయంలో ఆందోళన వద్దు

లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్ర హెూంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించడానికే మరికొన్ని రోజులపాటు లాక్ డౌన్ పొడిగించారని కేంద్ర సంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. భారతీయుల రక్షణ కోసం ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపత్కాల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరిస్తున్న విధానం ప్రశంసనీయమని అమిత్ షా పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని, సమన్వయాన్ని కొనసాగిస్తూ లాక్ డౌనను మరింత పకడ్బందీగా అమలుపరచాలని సూచించారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు ఇస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు. ప్రస్తుతం దేశంలో తగినంత నిత్యావసర వస్తువులు, మందులు ఉ న్నాయని.. ప్రజలు దీనిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని అమిత్ షా భరోసా ఇచ్చారు. అయితే లాక్ డౌన్ సమయంలో కొందరు పేదలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమన్నారు. ఈ సమయంలో ధనవంతులు తమ సమీపంలో ఉండే పేదవారికి సహాయం చేయాలని అభ్యర్థించారు. ఈ మహమ్మారి పై చేస్తున్న పోరాటంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సహకారం ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తోందని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. 500కు చేరువలో కేసులు ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో తాజాగా మరో 34 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 473కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన 34 కేసుల్లో గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు 14 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 450కి చేరింది. ఇక గుంటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. ఇప్పటి వరకు గుంటూరులో 109 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 91, నెల్లూరులో 56, ప్రకాశంలో 42, కృష్ణా 44, వైఎస్సార్ జిల్లాలో 31, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీకి వెళైచ్చిన వారిలో 200 మందికి, వారితో కాంటాక్ట్ అయిన 189 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.