షరతులతో కూడిన అనుమతులుంటాయి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: ఏప్రిల్ 20 నుంచి కొన్నింటికి షరతులతో కూడిన అనుమతులు ఉంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్ డౌనను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్రస్థాయిలో లేకపోయినా కొన్నిచోట్ల కేసులు ఎక్కువగానే ఉ ంటున్నాయని అన్నారు. కరోనాను నియంత్రిస్తే ప్రజల ప్రాణాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దవచ్చని చెప్పారు. ఒక్కసారి పాజిటివ్ వచ్చి ఆ తర్వాత తగ్గినప్పటికీ బాధితులు ఇళ్లల్లో సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ఈ నెల 20 వరకు అన్ని ప్రాంతాల్లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాల్సిందేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో ఇంతవరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కిషన్ రెడ్డి తెలిపారు.ఎవరికైనా ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చి తగ్గినా బాధితులు ఇళ్లల్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈ కేసులు దేశంలో తీవ్రస్థాయిలో లేకపోయినా కొన్ని చోట్ల కేసులు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. “కరోనాను నియంత్రిస్తే ప్రజల ప్రాణాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థనూ చక్కదిద్దవచ్చు. ఈ నెల 20 వరకు అన్ని ప్రాంతాల్లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాల్సిందే. ఆ తర్వాత కొన్నింటికి షరతులతో కూడిన అనుమతులు ఉంటాయి. 46 జిల్లాల్లో ఇంత వరకు ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాల్లో మినహాయింపులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి” అని చెప్పారు.