సమన్వయంతో సమర్థవంతంగా విధుల్లో భాగస్వామ్యం అవుదాం
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ జస్టీస్ వి.కనగ రాజ్
విజయవాడ,జ్యోతిన్యూస్ : ఒకరి కొకరం సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం అవుదామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి. కనగ రాజ్ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం విజయవాడ ఆర్ అండ్ బి భవన్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ వి. కనగ రాజ్ మాట్లాడుతూ, ఎన్నికల ను ఎప్పుడు నిర్వహించాల్సి వొచ్చినా అందుకు సర్వ సన్నద్ధం గా ఉ ండాలని సూచించారు. రాష్ట్రంలో, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితి నెలకొంది అని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన లో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకమైన పాత్ర పోషింస్తుందన్నారు.చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలని, స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మునిసిపల్, జడ్పిటిసి, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ లకు ఎన్నికల ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అందుకు అధికారులు, సిబ్బంది సర్వసన్నధంగా ఉండాలని తెలిపారు.సమయానికి అనుగుణంగా కార్యచరణ ప్రణాళికలు ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందన్నారు. చక్కటి అవగాహన తో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పేరు ను తీసుకుని రావడం లో అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలు అందించాలని తెలియ చేశారు. అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యాదార్ధ స్థితిని అధికారులు కమిషనర్ కి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి ఎస్.రామసుందర రెడ్డి జాయింట్ సెక్రటరీ ఎ వి సత్య రమేష్ , జెడి సాయి ప్రసాద్, ఎ ఎస్ సాంబ మూర్తి, పీఎస్ రామారావు, లు పాల్గొన్నారు.