నడుస్తున్నది.. కరోనా శకం
క్రీస్తు పుట్టిన 2 వేల సంవత్సరాల తర్వాత చరిత్ర గతినే మార్చేస్తున్న కరోనా
- 90 శాతం దేశాల పై కరోనా ప్రభావం
- ఇంకా ఎంతకాలం ఉంటుందో చెప్పలేని స్థితి
- సరైన వ్యాక్సిన్ కని పెడితేనే కరోనా కట్టడి
- కుదేలయిపోతున్న బడా దేశాల ఆర్థిక వ్యవస్థ
- 1929లో వచ్చిన ఆర్థికమాంద్యాన్ని మించిన నష్టం
- లాక్ డౌన్లతో నిరుద్యోగం విలయ తాండవం
- అన్ని రంగాల పై తీవ్ర ప్రభావం
- ప్రజల జీవన విధానంలో పెనుమార్పులకు ఆస్కారం
హైదరాబాద్: మానవ పరిణామ క్రమంలో చరిత్రను చెప్పేటప్పుడు క్రీస్తుకు పూర్వం(బీసీ).. క్రీస్తు శకం(ఏడీ) అని వాడతాం. అంటే క్రీస్తు పుట్టుకకు ముందు వెనుకబడిన నాగరికత ఉండేది. క్రీస్తు పుట్టాక నవ శకం ఆరంభమైంది. క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచే మనకు సంవత్సరాలు మొదలయ్యాయి. ఇప్పటికీ క్రీస్తు పుట్టి 2020 సంవత్సరాలు అయ్యాయి. ఇప్పుడు క్రీస్తులాగే మరో శకం ఆరంభమైంది. అదే ‘కరోనా శకం’.. బిఫోర్ కరోనా (బీసీ) ఆఫ్టర్ కరోనా (ఏసీ)గా అభివర్ణిస్తున్నారు. డ్రాగన్ కంట్రీలో పుట్టిన కరోనా వైరస్… క్రమంగా 200 దేశాలకు పైగా విస్తరించింది… అయితే, ఈ వైరస్ ఎప్పుడు పోతోంది..? మళ్లీ పాత రోజులు ఎప్పుడు వస్తాయి? క్రీస్తు పూర్వం… క్రీస్తు శకం అని కాకుండా… ఇక పై కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని చెప్పుకోవాల్సి రావొచ్చు. ఎందుకంటే మానవ పరిణామ క్రమంలో ఇంత పెద్ద విపత్తును ప్రపంచం ఎప్పుడూ చూడలేదు. దాదాపు అన్ని దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుపోయి భవిష్యత్తు ఏంటో అర్ధంకాక అయోమయంలో ఉన్నాయి. అమెరికాలో అయితే పరిస్థితి మరింత దారుణం. కరోనా కారణంగా ఒక్క అమెరికాలోనే కనీసం 2 లక్షల 40 వేల మంది ప్రాణాలు కోల్పోతారని వైట్ హౌస్ అంచనా వేసింది. కరోనా నుంచి ప్రపంచం ఎప్పుడు కోలుకుంటుందో ఎవరికీ తెలియదు. చైనాకు నాలుగు నెలలు పట్టింది. ఇంకా ఆంక్షలు పూర్తిగా తొలిగిపోలేదు. పైగా కొత్త కేసుల నమోదు కూడా ఆగలేదు. అలాంటిది ప్రపంచం మొత్తం కరోనా వైరస్ లేదని చెప్పడానికి ఎంతకాలం పడుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. అసలు మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయా అన్న అనుమానం కూడా ఉంది… ట్రంప్ ప్రభుత్వానికి కరోనా నివారణ విషయంలో సలహాలు ఇస్తున్న డాక్టర్ ఫాసి మాటల్లో చెప్పాలంటే కరోనాకు ముందున్న పరిస్థితులు మళ్లీ రావేమో అనిపిస్తోంది. కరోనా వైరస్ నుంచి మెల్లమెల్లగా బయటపడొచ్చు.. కానీ, కరోనా వైరస్ వ్యాపించడానికి ముందున్న సాధారణ పరిస్థితులు మళ్లీ వస్తాయా అంటే ఏమీ చెప్పలేం…! ఎందుకంటే…. కరోనా ముప్పు ఎప్పటికీ పొంచే ఉ ంటుంది. ఇదీ డాక్టర్ ఫాసీ అభిప్రాయం. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉ ండబోతున్నాయో..! అప్పుడు ఆహారం, మందులు, ఆరోగ్యం కంటే ఆయుధ ఉత్పత్తికి ప్రాధాన్యమిచ్చే మార్కెట్ శక్తుల ప్రాబల్యం తగ్గి ప్రపంచ ప్రజాహితానికి విలువ పెరుగుతుంది. బలవంతులు, బలహీనులు అనే తేడాకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ రంగం పుంజుకుంటుంది. అలా కాకుండా అమెరికా వంటి దేశాలు మరింతగా స్వీయ రక్షణ బాటపట్టి వర్ధమాన దేశాల నుంచి వలసలకు తెర దించడంతోపాటు బలవంతుల ప్రాబల్యమే పెరిగి ఉన్నవారు అతిగా నిల్వ చేసుకొని లేనివారికి మెతుకు, బతుకులేని దుస్థితి, కృత్రిమ కరువు కాటకాలు తలెత్తితే అంతకంటే దురదృష్టకర ప్రపంచం మరొకటి ఉండదు. నెలల తరబడి ఉత్పత్తి స్తంభించిపోయిన ప్రస్తుత స్థితి ఎటుదారి తీస్తుందో భావి ప్రపంచం ఇప్పటి లోపాలను సవరించుకొని ఆయుధాల కంటే ఆహారానికి, అధి క లాభసాటి ఉత్పత్తి కంటే ప్రాణాలకు, ఆంక్షల కంటే పరస్పర సహకారానికి ప్రాధాన్యమిచ్చే మంచి మార్గం వైపు మళ్లుతుందో అందుకు విరుద్ధంగా ఉంటుందో అనే భయం సహజమే. మానవ పరిణామ క్రమంలో చరిత్రను చెప్పేటప్పుడు క్రీస్తుకు పూర్వం(బీసీ).. క్రీస్తు శకం(ఏడీ) అని వాడతాం. అంటే క్రీస్తు పుట్టుకకు ముందు వెనుకబడిన నాగరికత ఉండేది. క్రీస్తు పుట్టాక నవ శకం ఆరంభమైంది. క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచే మనకు సంవత్సరాలు మొదలయ్యాయి. ఇప్పటికీ క్రీస్తు పుట్టి 2020 సంవత్సరాలు అయ్యా యి. ఇప్పుడు క్రీస్తులాగే మరో శకం ఆరంభమైంది. అదే ‘కరోనా శకం’.. బిఫోర్ కరోనా (బీసీ) ఆఫ్టర్ ఏసీ)గా అభివర్ణిస్తున్నారు. కరోనా రాక ముందు జనాలు ‘హెల్త్ ఈజ్ వెల్త్’ అనే వారు.. మరి ఇప్పుడు కరోనా వచ్చి అందరినీ కబళించడంతో ‘హెల్త్ ఈజ్ లైఫ్’ అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బతకడానికి.. బతికి బయటపడడానికి తప్ప మనుషులకు మరో ఆప్షన్ లేకుండా చేసింది కరోనా వైరస్. దాని నియంత్రణ తప్ప మందు లేని పరిస్థితి. దీంతో అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. కరోనా ఉత్పాతాన్ని తట్టుకొని మనుగడ సాగిస్తున్నారు. కరోనా తో ప్రపంచంలో మార్పు వస్తుందా? కరోనా వైరస్ కరాళనృత్యానికి ప్రపంచవ్యాప్తంగా జనాలకు బుద్ది వచ్చింది. కోట్లు – లక్షలు సంపాదించడం కాదు.. బతకడమే గొప్ప అన్న సూక్ష్మ విషయం తేటతెల్లమైంది. అందుకే ఇప్పుడు అందరూ తమ లైఫ్ స్టైల్ ను మార్చుకునే పడిలో పడ్డారు. ఓ హాలీవుడ్ సినిమాలో చూపించినట్టే జనం డబ్బుల వెంట ఉద్యోగాల వెంట.. విదేశాలకు డాలర్ల వెంటపడి పోకుండా ఉన్న ఊళ్లోనే దర్జాగా బతకాలని డిసైడ్ అవుతున్నారు. అమెరికా – ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు మన వాళ్లు పోయి అక్కడ దిక్కుమాలిన చావులు చచ్చేకంటే దేశంలోనే కలోగంజో తాగి బతకడం బెటరన్న అభిప్రాయానికి వచ్చారు. శుచి శుభ్రత ప్రకృతి పై ప్రేమ పెరగొచ్చు ఇన్నాల్లు అడవులు నరికేశాం.. అటవి జంతువులకు ఆవాసం లేకుండా తరిమేశాం. మనుషులను తప్ప అన్నింటిని తినేశాం. కానీ ఇప్పుడు ప్రకృతే కరోనా వైరస్ తో పగబట్టింది.. మనల్ని కబళించింది. దీంతో మనుషులకు దెబ్బకు శుచి – శుభ్రత – ప్రకృతి పై ప్రేమ ఖచ్చితంగా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కరోనా తర్వాత మనుషుల లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని తెలుస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు – ప్రకృతితో జీవనం అలవాటు చేసుకుంటారు. డాలర్లు డబ్బు వెంట పరిగెత్తకుండా సంతోషకరమైన జీవనం సాగిస్తారు. ఆడంబరాలు ఔటే.. ఇన్నాళ్లు పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు చేసి చేసేవారు. ఇప్పుడు కరోనా దెబ్బతో పెళ్లిళ్లే కాదు.. పండుగలు – పబ్బాలను కూడా తక్కువ మందితో దగ్గరి స్నేహితులతోనే చేసుకునే ఖర్మ పడుతుంది. ఎందుకంటే ఎక్కువమందితో చేస్తే కరోనా అంటుకుంటుంది. ఫంక్షన్ హాల్లు – సెట్టింగులకు కాలం చెల్లి సుబ్బరంగా గ్రామాల్లోని సొంతిళ్లలో తక్కువ మందితో వేడుకలు చేసుకునే రోజులు రానే వస్తాయి. ఆరోగ్య రంగంలో ఎన్నెన్నో మార్పులు వస్తాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా ప్రైవేట్ కంపెనీలు పోటీపడుతున్నాయి. అయినా, ఏడాదిన్నర టైం పడుతుందంటున్నాయి. వాటికీ వివిధ దేశాల ప్రభుత్వాలు సహకారాలందిస్తున్నాయి. నిజానికి చాలా కంపెనీలు ఇలాంటి వాటికి ముందుకు రావు. వాటిని తయారు చేసేటప్పుడు తమ లాభాన్ని చూసుకుంటాయి. ఎంత వరకు అది ప్రాఫిటబులో ఆలోచిస్తాయి. తయారు చేసినా పేటెంట్ అంటూ మెలిక పెడతాయి. దీంతో సామాన్యుడికి అది అందే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలే రంగంలోకి దిగి సొంతంగా వాటిని అభివృద్ధి చేయించేందుకు కృషి చేస్తాయి. దాని వల్ల ప్రతి పేదవాడికీ మందులందేలా బాటలు పడతాయి. ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోయినా, ఎప్పుడో అప్పుడు అది మాత్రం కచ్చితంగా నిజమవుతుంది. ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తేగానీ మందులు రాయరు. ఇప్పుడు ఆ బెడద లేకుండా టెలీమెడిసిన్ కు దార్లు ఫ్రీ అవుతున్నాయి. ఇండియా సహా చాలాదేశాలు దానికి ఆమోదం చెబుతున్నాయి. దీనివల్ల ఓ పేషెంట్ కు తొందరగా ట్రీట్మెంట్ అందే అవకాశాలుంటాయి. ఇటు ప్రతి ఇంటికి వైద్యం అందే అవకాశాలొస్తాయి. మూఢనమ్మకాలను పక్కన పెట్టి సైన్స్ ను నమ్మే రోజులొస్తాయి. 35 ఏళ్లలో కచ్చితంగా ఆ మార్పు కనిపిస్తుంది. రాజకీయంలో కొత్త నీళ్లు ఎప్పుడూ కొత్త సీసాలో పాత సారానేనా.. ఇకపై ఆ పరిస్థితి మారుతుందంటారు నిపుణులు. అవును, రాజకీయాల్లో కొత్త నీళ్లు పారుతాయంటున్నారు. దాని వెనక ఆవేశం, ఆక్రోశం, కడుపు రగిలిన బాధ ఉంటుందని చెబుతున్నారు. చాలా దేశాల్లో ఈ ఎమర్జెన్సీ అయిపోగానే డబ్బున్నోళ్లు, అన్ని అందుబాటులో ఉన్నోళ్లను అక్కును చేర్చుకుని, పేదలు, కనీస అవసరాలు తీరని వాళ్లను విస్మరించే పరిస్థితి ఉంటుందంటున్నారు. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు కంపెనీలకు బెయిలవుట్లు ప్రకటించే ప్రభుత్వాలు, పేదలను మాత్రం పట్టించుకోవంటున్నారు. అదే జరిగితే ఎప్పుడూ తమనే మోసం చేస్తారన్న భావన పేదల మనసుల్లోకి నాటుకుపోతుందని, వాళ్ల కడుపు రగిలి ఆందోళనలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఆరోగ్యకరమైన తిండే దిక్కు ఇష్టానుసారం తినే తిండి విషయంలోనూ కరోనా తర్వాత మార్పు రావడం ఖాయమంటున్నారు. పిజ్జాలు – బర్గర్లు – జంతువులను తినడం మాని ఆరోగ్యకరమైన ఫుడ్డు – డైట్ ఉన్న ఆహారానికి డిమాండ్ పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. ఇక కరోనా లాంటి వైరస్ నుంచి కాపాడే ఇమ్యూనిటి పెంచే ఆహారాన్నే మెనూలో అందరూ పెట్టుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా ఆఫ్టర్ కరోనా ప్రపంచం మారుతుంది. తర్వాత తరం వాళ్లు కూడా ఇక బిఫోర్ కరోనా.. ఆఫ్టర్ కరోనా అని చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇదంతా కరోనాతో ప్రకృతి ఆడించిన ఆట. ఈ ఆటతో మానవుడు సెట్ రైట్ అవుతాడనే ఆశిద్దాం.