30 వరకు లాక్ డౌన్…!

ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.

ఆ తర్వాత దశల వారిగా లా డౌనన్ను ఎత్తివేస్తామని పేర్కొన్నారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 503 కేసులు నమోదయ్యాయని, 14 మంది మరణించారని వెల్లడించారు. 96 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అయ్యారని అన్నారు. ప్రస్తుతం 393 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా మరో రెండు వారాలపాటు లాక్ డౌనను పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ లాక్ డౌనను అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన జారీ చేయాల్సి ఉంది.