అమెరికాలో పెరుగుతున్న భారతీయుల మరణాలు
కరోనా కాటుకు 40 మంది భారతీయుల మృతి
న్యూఢిల్లీ: అమెరికాలో భారత నేపథ్యం ఉన్న దాదాపు 40 మంది కరోనా వైరస్(కొవిడ్-19) బారిన పడి మ రణించినట్లు అక్కడి భారతీయ సంఘాలు వెల్లడించాయి. వీరిలో కొంతమంది భారత పౌరసత్వం ఉ న్నవారు కాగా.. మరికొంత మంది అక్కడే నివాసం ఏర్పరచుకున్న భారత సంతతివారని తెలిపాయి. మరో 1500 మంది వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్ న్యూజెర్సీ ప్రాంతాల్లోనే అత్యధిక మంది భారతీయులు నివసిస్తుండడం గమనార్హం. మరణించిన వారిలో 17 మంది కేరళ, 10 మంది గుజరాత్, ఇద్దరు ఆంధ్రప్రదేశ్, ఒకరు ఒడిశాకు చెందినవారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిలో చాలా మంది 60 ఏళ్ల వయసు పైబడినవారేనని సమాచారం. ఒక్కరు మాత్రం 21 ఏళ్ల వయసుగల వారని తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ సేకరించిన వివరాల ప్రకారం దాదాపు 12కు పైగా మంది ఒక్క న్యూజెర్సీలో మరణించారు. మరో 15 మంది న్యూయార్క్ లో మృత్యువాతపడ్డారు. పెన్సిల్వేనియా, ఫ్లోరిడాలో నలుగురు చొప్పున, టెక్సాస్, కాలిఫోర్నియాలో ఒకరు చొప్పున మ రణించినట్లు అక్కడి వర్గాలు పీటీఐకి తెలిపాయి. అయితే, ఇప్పటి వరకు మరణించిన వారిలో 12 మంది భారత పౌరులు ఉన్నట్లు వారి నివేదికలు చెబుతున్నాయి. ఇక న్యూజెర్సీలో ఉంటున్న 400 మంది, న్యూయార్క్ లో ఉంటున్న 1000 మంది ఇండియన్ అమెరికన్లు వైరస్ బారిన పడ్డట్లు సమాచారం. వీరిలో చాలా మంది భారతీయ సంఘాల నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో సున్నోవా అనలైటికల్ సీఈఓ హన్మంతరావు మారేపల్లి, న్యూజెర్సీలో ప్రముఖ వ్యాపారవేత్త చంద్రకాంత్ అమిన్(75), మహేంద్ర పటేల్(60) ఉన్నారు. మరికొంత మంది ఐసీయూల్లో విషమ పరిస్థితుల్లో ఉండడంతో వారి కోసం ప్లాస్మా సేకరించే పనిలో పడ్డాయి అక్కడి భారతీయ సంఘాలు.వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇక్కడ కరోనా ఎంత తీవ్రంగా ఉందంటే గడిచిన 24గంటల్లో అమెరికాలో 2,100పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ సంఖ్యే అమెరికాలో ఈ మహమ్మారి ఏ రేంజ్ లో విలయతాండవం చేస్తుందో చెప్పేస్తుంది. యూఎస్లోని జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కరోనా ట్రాకర్ ప్రకారం, అమెరికాలో ఇప్పటి వరకు 5 లక్షలమందికిపైగా కరోనా సోకింది. వీరిలో 18,700మంది మృత్యువాతపడ్డారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 17లక్షల మందికి కరోనా వైరస్ సోకగా, వారిలో 1.02లక్షల మందికిపైగా మ రణించినట్లు సమాచారం. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా మరణాల సంఖ్య తగ్గడం లేదు. ఈ మహమ్మారి ధాటికి గడిచిన 24 గంటల్లో అమెరికాలో 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ గణంకాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన నాటి నుంచి ఒకే రోజు ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. అదికూడా అగ్రరాజ్యంలో చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో శుక్రవారం నాటికి వైరస్ కారణంగా అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 18,637కు చేరింది. బుధవారం ఒక్కరోజే 1,936 అత్యధిక మంది మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం అంతకంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్(777), న్యూజెర్సీ(232), మిచిగాన్(205) రాష్ట్రాల నుంచే శు క్రవారం అధిక సంఖ్యలో మృతిచెందారని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.