కరోనా వీళ్లకి కలిసొచ్చింది!
గ్రామాలలో యథేచ్ఛగా మద్యం విక్రయాలు.. రెండింతలు పెంచినా తగ్గని డిమాండ్
- అదనంగా రూ.200 నుంచి 800 పెంచి అమ్మకాలు
- చోద్యం చూస్తున్న ఆబ్కారీ సిబ్బంది
- ముడుపులు ముడుతున్నాయంటూ స్థానికుల విమర్శలు
- సిండికేట్ గా మందుబాబులు మెసేజ్ లు
- ఫలానా చోట అమ్ముతున్నారంటూ సందేశాలు
- స్థానిక బస్తీ లీడర్ల హస్తం పై అనుమానాలు
హైదరాబాద్: అసలే కరోనా వైరస్ వ్యాధి నుండి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాంటి సమయంలో కాలనీలకు కొత్త వారు వస్తే ఎలా ఉంటుంది? వారి నుంచి ప్రజలు ఎంత భయపడతారు? ఒకవైపు కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా అందరూ ఇళ్లలో ఉండండి అంటూ ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. కొందరు బ్లాక్ దందాగాళ్లు ఇష్టానుసారంగా లిక్కర్ అమ్ముతున్నారు. దాంతో కొత్త ముఖాలు కాలనీలో కనిపిస్తున్నాయి. ఎవరికి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో అనికాలనీ ప్రజలు భయాందోళనకు గురి అవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా యధేచ్ఛగా ఒక క్వార్టర్, బీర్ బాటిల్ పై అదనంగా రెండు వందలు ఫుల్ పై ఎనిమిది వందలు రూపాయలు లాభాలు పొందుతున్నారు. ఇవి ఎవరెవరికి ముడుతున్నాయో తెలియదు ఇదంతా కొల్లాపూర్ మున్సిపాల్ పరిధిలో జరుగుతుంది. పట్టణంలో అన్ని శాఖ అధికారులు ఉన్నా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అంటే వారి ధైర్యం ఏమిటో తెలియడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేసుకుండా దందాను కొనసాగిస్తున్నారు. కొందరు అధికార పార్టీ కి చెందిన వ్యక్తులు దందా చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వైన్స్ బంద్ వున్నాయి. బెల్ట్ షాపులకు మందు ఎలా వస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడనే ఉంది మతలాబ్. కొందరు వైన్స్ షాపు నుండి స్టాక్ ను బయటకి తెచ్చి బెల్ట్ షాపు లకు రాత్రి వేళల్లో సప్లై చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. పగటి పూట కలెక్షన్ చేసుకుంటున్నారని అంటున్నారు. అధికారులకు సమాచారం ఇస్తే వస్తున్నారు కానీ అమ్మకాలను అడ్డుకోలేక పోతున్నారని అంటున్నారు. ఈ కరోనా వ్యాధి వైరస్ నుండి అన్ని వ్యాపారస్తులు స్వచ్చందంగా షాపులు బందు చేసుకొని వ్యాపారాలు లాస్ అయినా లాక్ డౌన్ పాటిస్తే. బెల్ట్ షాపు వ్యాపారులు మాత్రం మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతుందని అంటున్నారు. ఇదంతా ఆ శాఖ అధికారులకు తెలిసే జరుగుతుందని అంటున్నారు. కొందరు సిబ్బంది ఇదే వ్యాపారం చేస్తున్నారని అంటున్నారు. అయితే మందు కోసం ఎక్కడి నుండో కొత్త వస్తున్నారు. వారి నుండి కరోనా వ్యాధి వ్యాపిస్తుందేమోనని ఆయా కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నత అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. ఒకవైపు పోలీసులు కరోనా వ్యాపించకుండా లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే అక్రమార్కులు మాత్రం తమ దందా కొనసాగిస్తూనే వున్నారు. లిక్కర్ షాపులు బంద్ అయినా దుకాణం సీళ్లు తొలగించి మద్యం అమ్మకాలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. బెల్ట్ షాపులే అడ్డాగా మద్యం అక్రమ అమ్మకాలు బాగా పెరిగిపోతున్నాయి. లాన్ కాలంలోనూ కొందరు మద్యం దుకాణాలు తెరుస్తూ ప్రభుత్వ ఆదేశాలను గాలికి వదిలేస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు అధిక ధరలకు మద్యం అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్రమ మద్యం అమ్మకాలను బెల్ట్ షాపుల ద్వారా అమ్మిస్తూ అక్రమ లాభార్జనకు కొందరు వ్యాపారులు సిద్ధపడుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి…. జైపూర్ మండలంలో ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. బెల్టు షాపుల నిర్వాహకులు క్వార్టర్ రూ.350, బీరు రూ.300 చొప్పున అమ్మకాలు సాగిస్తున్నారు. ఫుల్ బాటిళ్ల ను డబుల్, ట్రిబుల్ రేట్లకు విక్రయిస్తున్నారు మద్యం దుకాణాలను జనతా కర్ఫ్యూ నుంచి మూసివేశారు.అయితే షాపులకు సిలు వేసినప్పటికి కొందరు దానిని పాక్షికంగా తొలగించడంతో పాటు మరో తాళానికి అది కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మద్యం దుకాణాలకు వస్త్రంతో కూడిన సీళ్లు వేశామని అధికారులు చెబుతుంటే కొని మద్యం దుకాణాలకు పేపర్తో వేసిన సీలు ఉండడం, అది కూడా తొలగించి ఉండడం అనుమానాలకు బలం చేకూరుతోంది. అక్రమంగా అధిక ధరలకు మద్యం అమ్ముతున్న వారి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లాక్ డౌన్ సమయంలో పెద్దపల్లి పట్టణంలోని ఓం సాయిరాం వైన్స్ నుండి అర్ధరాత్రి మద్యం తరలిస్తుండగా పట్టుకున్న, టాస్క్ ఫోర్స్ పోలీసులు, 86, 000 వేల రూపాయల మద్యం, ఒక కారు, 4ద్విచక్ర వాహనాలు, 7 గురు వ్యక్తులను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాయిరాం వైన్ షాప్ యజమాని లాక్ డౌన్ నిబంధనలను ఉ ల్లంఘి%8%చి అత్యాశకుపోయి అడ్డదారిలో మద్యం విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. పెద్దపల్లిపట్టణంలోని కూనారం రోడ్ లో గల సాయిరాం వైన్ షాపులో తెల్లవారు జామున లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా యజమాని ఎక్సైజ్ అధికారులు వేసిన సీల్ ను తొలగించాడు. మద్యం అమ్మకాలు సాగించాడు. ఈ సమయంలో మద్యం అమ్మకాలు జరిపితే భారీ మొత్తంలో లాభాలు సంపాదించవచ్చని ఉద్దేశం తో సాయిరాం వైన్స్ యజమాని బెల్ట్ షాప్ వారితో ఒప్పందం కుదుర్చుకోని భారీ మొత్తంలో మద్యం నిల్వలు షాప్ నుండి బయటకు తీసి వాటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. బెల్ట్ షాపు వారితో కలిసి మద్యం బాక్స్ లను కారు, బైక్ ల పై తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు షాప్ యజమాని తో పాటు బెల్ట్ షాప్ నిర్వాహకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. వారి పై కేసు నమోదు చేశారు. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు గుట్టుగా బ్లాక్ లో మద్యం దందా సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లాక్ డౌన్లో ఏకంగా వైన్సుల నుంచే అమ్మకాలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో స్టాక్ ను బయటకు తీసి అదును చూసి విక్రయిస్తున్నారు. ఈ నెల 22న జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి అన్ని వ్యాపారాలు మూత పడ్డాయి. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలకు సైతం ఎక్సైజ్ అధికారులు తాళాలు వేసి సీల్ వేశారు. అయితే చాలా మంది కర్ఫ్యూ ప్రకటించగానే ఆ రోజు వరకే స్టాక్ బయటికి తీశారు. అదే రోజు రాష్ట్రంలో మార్చి 31వరకు లాక్ డౌన్ ప్రకటించడం, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా లాక్ డౌనను ఏప్రిల్ 14వరకు పొడిగించడం ప్రకటించడంతో చాలా చోట్ల వైన్సుల్లోనే సరుకు ఉండిపోయింది. ఇక కొందరు లాక్ డౌన్ ప్రకటించడం టీవీల్లో చూసి వెంటనే అప్రమత్తమై ఉన్న స్టాక్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక కొందరు వైన్సుల నుంచే స్టాక్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జైపూర్ లో రెండు రోజుల క్రితం ఓ వైన్సు షాపు తాళానికి వేసి ఉన్న సీల్ తొలగించినట్లు ఎక్సైజ్ అధికారుల దృష్టికి వచ్చింది. అంతేకాక గ్రామాల్లో బెల్టు షాపుల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తే సరుకు పట్టుబడుతోంది. ఇదంతా వైన్సుల నుంచే సరఫరా అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బుధవారం కాసిపేట మండలం దేవాపూర్‌లోని బెల్టుషాపుల్లో దాడి చేయగా మద్యం పట్టుబడింది. కొన్ని చోట్ల బ్లాక్ లో కూడా మద్యం దొరక్కపోవడంతో వైన్సుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. బుధవారం దండేపల్లి మండలం చెల్కగూడెంలోని ఓ వైన్సులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి రూ.5వేల విలువైన మద్యం ఎత్తుకెళ్లారు. అడ్డగోలు రేట్లకు అమ్మకం మందుబాబుల బలహీనతను ఆసరా చేసుకుని అడ్డగోలు రేట్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి బ్రాండ్ సరుకును రెట్టింపు ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం. ఉదాహరణకు ఎంసీ ఫుల్ బాటిల్ ఎమ్మార్పీ రూ.560 కాగా, ప్రస్తుతం బ్లాక్ లో రూ.1100లకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీరు ధర ఎమ్మార్పీ రూ.120 ఉంటే ప్రస్తుతం రూ.300 వరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇలా ప్రతి బ్రాండ్ కు ఎమ్మార్పీతో పోల్చితే రెట్టింపుకు మించి ధరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇక కొందరు లాక్ డౌనను ముందే ఊహించి పెద్ద ఎత్తున సరుకును రహస్య ప్రదేశాలకు తరలించారు. జనతా కర్ఫ్యూ పాటించిన రోజే లాక్ డౌన్ ప్రకటించడంతో జిల్లా కేంద్రంతో పాటు అనేక షాపుల్లో ఉన్న స్టార్ ను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఉన్న స్టాక్ కూడా ఖాళీ అవుతుండడంతో ధరలు రెట్టింపు చేస్తూ వచ్చారు. లాక్ డౌన్ తర్వాత రెండు, మూడు రోజులు ఎమ్మార్పీకి మించి రూ.50 నుంచి రూ.100 వరకు అధికంగా విక్రయించగా ప్రస్తుతం కొన్నిచోట్ల రెట్టింపు, మరి కొన్నిచోట్ల మూడింతల ధరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. బయట ఎక్కడా మద్యం దొరకపోవడంతో ఎంత ధర అయినా కొనేందుకు మద్యం ప్రియులు ఆసక్తి చూపుతుండడంతో ఈ దందా సాగుతోంది. ప్రస్తుతం వైన్సు షాపుల్లోనూ ఉన్న స్టాక్ దాదాపు అయిపోయినట్లే తెలుస్తోంది. ఎందుకంటే గోదాంల నుంచి మద్యం స్టాక్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఉన్న స్టార్ నే డిమాండ్ ను బట్టి రహస్యంగా ఎక్కువ ధరలకు అమ్ముకునే పనిలో ఉన్నారు. (ఇదేం పని జోన్స్.. ట్రోల్ చేసిన ఆకాష్ ) గ్రామాల్లో గుడుంబా జోరు.. గుడుంబా రహిత జిల్లాగా సాగిన తర్వాత మళ్లీ లాక్ డౌన్లో గ్రామాల్లో గుడుంబా తయారీ కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రాణహిత తీరం వెంబడి పలు ప్రాంతాల్లో గుడుంబా తయారు చేస్తున్నారు. జిల్లాలో నెన్నెల, దండేపల్లి, కోటపల్లి, భీమారం, మందమర్రి తదితర మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారుల దాడుల్లో పెద్దఎత్తున బెల్లంపానకం, నాటు సారా పట్టుబడుతోంది. అటు మద్యం సరఫరా లేకపోవడంతో కొందరు గ్రామీణ ప్రాంతాల్లో మత్తు కోసం గుడుంబా వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం లీటరు గుడుంబా ఏడు వందల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎంతైన ఖర్చు చేసి మత్తు కోసం జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. మద్యం షాపుల తాళాలకు వేసిన సీల్ తీసినా.. తాళాలు తమ వద్దనే ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో నిత్యం మఫ్టీలో గుడుంబా తయారీ అరికట్టేందుకు గస్తీ చేస్తున్నామని ఎక్కడైనా మద్యం విక్రయిస్తే తమ దృష్టికి తేవాలని అబ్కారీ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నిత్యం మద్యం సేవించే అలవాటు ఉ న్నవారికి కొద్ది రోజులుగా మద్యం దొరకపోవడంతో నిర్ణీత సమయాల్లోనైనా ఆంక్షలతో మద్యం షాపులు తెరవాలనే డిమాండ్లు వస్తున్నాయని అంటున్నారు.