కరోనా కాటేసింది

230 కి.మీ. నడిచి..నీరసించి ఆకలితో మరణించిన గంగమ్మ

బెంగళూరు: ఓ అబల ఆకలితో అలమటించి కన్నుమూసింది. ఒకట్రెండు కిలో మీటర్లు కాదు… ఏకంగా 230 కిలోమీటర్లు నడవడంతో నీరసించి పోయి తను పాదం మోపిన భూమాత ఒడిలో ఒదిగిపోయింది. తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు.. తినడానికి పిడికెడు మెతుకులు లేవు.. చివరకు ఎర్రటి ఎండ.. కాలినడక ఆమె ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌనను విధించారు. దీంతో రోజువారి కూలీలకు ఉపాధి దొరకడం కష్టమైంది. రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్ కు చెందిన గంగమ్మ(27) దంపతులు.. బెంగళూరులోని కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు. లాక్ డౌన్ అమలు చేయడంతో.. భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో కూలీలు తమ సొంతూర్లకు వెళ్లాలని కాంట్రాక్టర్ ఆదేశించారు. కూలీలకు పూట గడవడం కష్టంగా మారింది. సింధనూరు పట్టణానికి చెందిన కూలీలు దిక్కుతోచని స్థితిలో మార్చి 30వ తేదీన తమ సొంతూరికి ట్రాక్టర్ లో బయల్దేరారు. బెంగళూరు నుంచి తుమకూరు రాగానే పోలీసులు ట్రాక్టర్ ను ఆ పేశారు. చేసేదిమీ లేక తుమకూరు నుంచి కూలీలందరూ కాలినడకన బళ్లారికి బయల్దేరారు. తుమకూరు – బళ్లారి మధ్య సుమారు 230 కిలోమీటర్ల దూరం ఉంది. బళ్లారి సమీపం వరకు గంగమ్మతో పాటు మిగతా కూలీలు కాలినడకనే వచ్చారు. తుమకూరు – బళ్లారి మధ్యలో ఆ కూలీలకు ఎవరూ తిండి పెట్టలేదు. కనీసం నీరు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కరోనా భయంతో. చివరకు ఏప్రిల్ 2వ తేదీన ఓ ట్రాక్టర్ ను కిరాయి తీసుకుని బళ్లారికి రాగానే అక్కడున్న చెక్ పోస్టు వద్ద పోలీసులు వారిని ఆపేశారు. అక్కడున్న ఓ పునరావాస కేంద్రంలో కూలీలు సేద తీరుతున్నారు. గంగమ్మ మాత్రం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు మూడు రోజుల పాటు నీరు, ఆహారం లేకపోయేసరికి తీవ్రంగా నీరసించింది. దీంతో భర్త సహాయంతో కూలీలు ఆమెను విమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆమెకు ఆహారంతో పాటు పండ్ల రసం కూడా ఇచ్చారు. గంగమ్మకు ఇతర అనారోగ్య సమస్యలు ఉ ండడంతో చికిత్స పొందుతూనే ఆమె కన్నుమూసింది. నీరసం, కాలేయం, రక్తహీనత వల్లే గంగమ్మ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. గంగమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి అండగా నిలబడాలని అధికారులను ఆయన ఆదేశించారు. లా డౌన్ నేపథ్యంలో బెంగళూరు నుంచి సొంతూరికి కాలినడకన బయల్దేరి మార్గమధ్యలో గంగమ్మ (29) తనువు చాలించింది. 200 కిలోమీటర్లు పైగా నడిచి ఆకలిబాధతో కన్నుమూసింది. దేశవ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టాలకు ఈ విషాద ఘటన అద్దం పడుతోంది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు, రోజువారీ కూలీల బతుకులు దుర్భరంగా మారాయి. గంగమ్మ మరణం దురదృష్టకరమని ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా దురదృష్టకర, బాధాకరం. సింధనూరు గ్రామానికి చెందిన గంగమ్మ లాక్ డౌన్ సందర్భంగా తన సొంతూరికి నడిచి వెళుతుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఆమె అన్ని కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాను’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని.. ఆహారం, సరుకులు అవసరమైన వారి కోసం హెల్ప్ లైన్ నంబరు పెట్టామని యెడియూరప్ప తెలిపారు. వలస కార్మికుల కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అందరూ ప్రభుత్వం సూచనలు పాటించాలని, ఎటువంటి అవసరం వచ్చినా హెల్స్ డెస్క్ లను సంప్రదించాలని సూచించారు.