30 వరకూ హైకోర్ట్ లాక్ డౌన్
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫుల్ కోర్టు సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టుల్లో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫుల్ కోర్టు సమావేశం నిర్వహించిన హైకోర్టు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న మరోసారి ఫుల్ కోర్ట్ సమావేశమై లాక్ డౌన్ పై చర్చించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 364 కేసులు నమోదు కాగా, 11 మంది మరణించారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 14వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.